D Mart: పెరిగిన డీ మార్ట్ ఆదాయం.. కొత్తగా 3 స్టోర్లు ప్రారంభం..
డీ మార్ట్ రిటైల్ చైన్‌ను నిర్వహిస్తున్న ఎవెన్యూ సూపర్ మార్ట్స్ సెప్టెంబర్ 30, 2026తో ముగిసిన రెండవ త్రైమాసికానికి సంబంధించి తన కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంలో (స్టాండ్‌అలోన్) 18.4% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఆదాయం రూ.19,206.18 కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ద్వారా రూ.16,218.79 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. రాధాకిషన్ దమానీ నేతృత్వంలోని ఈ రిటైల్ సంస్థకు సెప్టెంబర్ 30 నాటికి మొత్తం 518 స్టోర్లు ఉన్నాయి. ఈ సంఖ్యలో మహారాష్ట్రలోని నవీ ముంబై, సంపడాలో ఉన్న అవుట్‌లెట్ కూడా ఉంది. అయితే పునర్నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఇది ప్రస్తుతం మూసివేశారు.
జూన్ త్రైమాసికంలో నమోదైన రూ.18,343.49 కోట్ల ఆదాయంతో పోలిస్తే డీ మార్ట్ ఆదాయం 4.7% పెరిగింది. రాధాకిషన్ దమానీ, ఆయన కుటుంబం ప్రమోట్ చేసిన D-Mart, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR), తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్ వంటి అనేక రాష్ట్రాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. డీమార్ట్ నిత్యవసర గృహోపకరణాలు, వ్యక్తిగత వినియోగ ఉత్పత్తులను విక్రయిస్తుంది. ఎవెన్యూ సూపర్ మార్ట్స్ జూన్ త్రైమాసికానికి సంబంధించి తన ఏకీకృత నికర లాభంలో 11.3 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసి రూ.860.6 కోట్లకు చేర్చింది.

అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఈ లాభం రూ.773 కోట్లుగా ఉంది. జూన్ 30, 2026తో ముగిసిన త్రైమాసికానికి కంపెనీ మొత్తం ఆదాయం, గత ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ.16,360 కోట్ల నుంచి రూ.18,795 కోట్లకు పెరిగింది. ఎబిట్డా (వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచనకు ముందు ఆదాయం) ఏడాది క్రితం ఉన్న రూ.1,299 కోట్ల నుంచి 15.4 శాతం పెరిగి రూ.1,499 కోట్లకు చేరింది. Q1FY26లో 7.9 శాతంగా ఉన్న ఎబిట్డా మార్జిన్, Q1FY27లో స్వల్పంగా మెరుగుపడి 8 శాతానికి చేరింది. ఈ త్రైమాసికంలో Avenue Supermarts మూడు కొత్త స్టోర్లను ప్రారంభించింది. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 503కి చేరింది. Q1FY27లో కంపెనీ PAT మార్జిన్ 4.6%గా నమోదైంది.
ఇది అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలోని 4.7%తో పోలిస్తే స్వల్పంగా తక్కువ. ఎవెన్యూ సూపర్ మార్ట్స్ షేర్ ధర వివిధ కాల వ్యవధులలో మిశ్రమ పనితీరును కనబరిచింది. గత వారంలో ఈ స్టాక్ 0.61 శాతం, గత నెలలో 0.12% వృద్ధిని సాధించింది. ఈ ఏడాది ప్రారంభం నుండి చూస్తే, షేర్లు 2.48% పెరిగాయి. అయితే మూడు నెలల కాలంలో 12.07%, ఆరు నెలల కాలంలో 10.81% క్షీణతను నమోదు చేసింది. స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయినప్పటి నుండి ఇది 518.46% మేర భారీ (మల్టీబ్యాగర్) రాబడిని అందించింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
