Multibagger Stock: రూ.లక్షను రూ.మూడన్నర లక్షలు చేసిన స్టాక్ ఇదే..!

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి. అయితే మంచి అవగాహనతో క్వాలిటీ స్టాక్ లో పెట్టుబడి పెడితే భారీ రాబడి పొందవచ్చని చెబుతున్నారు. చాలా స్టాక్స్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి స్టాక్ ల్లో ఎథర్ ఎనర్జీ ఒకటి. స్టాక్ మార్కెట్ పడిపోతున్నప్పటికీ ఎథర్ ఎనర్జీ స్టాక్ మాత్రం దూసుకెళ్లింది. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారు చేస్తోంది. ఈ కంపెనీ స్కూటీలకు మార్కెట్ లో మంచి డిమాండే ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్టాక్ ప్రైస్ భారీగా పెరిగింది.

మీరు ఎథర్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీలో సంవత్సరం క్రితం లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే అతి.. ఇప్పుడు దాదాపు మూడున్నర లక్షలు అయింది. బుధవారం ఎథర్ ఎనర్జీ లిమిటెడ్ షేర్ ప్రైస్ మధ్యాహ్నం 12: 40 గంటలకు రూ.1133.90 కొనసాగుతోంది. ఈ స్టాక్ గత కొంత కాలంగా పెరుగుతూ వస్తోంది. ఈ స్టాక్ గత నెలలో ఇది 20 శాతానికి పైగా లాభపడింది. గత ఆరు నెలల్లో ఎథర్ ఎనర్జీ స్టాక్ దాదాపు 50 శాతం రిటర్న్స్ అందించింది. ఇది కేవలం ఆరు నెలల్లోనే రూ. 1 లక్ష పెట్టుబడిని రూ. 1.5 లక్షలుగా మార్చింది.

ather Energy

ఒక సంవత్సర కాలంగా స్టాక్ పనితీరును పరిశీలిస్తే సంవత్సర కాలంగా కూడా బాగానే రాణిస్తోంది. ఇది పెట్టుబడిదారులపై డబ్బు వర్షం కురిపించింది. ఎథర్ ఎనర్జీ స్టాక్ వత్సరం క్రితం దాదాపు రూ.332 వద్ద ట్రేడ్ అవుతూ ఉండేది. ఇప్పుడు అది దాదాపు 240% పెరిగింది. ఒకవేళ మీరు ఒక సంవత్సరం క్రితం ఈ స్టాక్‌లో రూ.100,000 పెట్టుబడి పెట్టి ఉంటే, ఆ మొత్తం ఈ రోజు రూ.3.40 లక్షలకు చేరుకునేది. ఎథర్ ఎనర్జీ స్టాక్ పెన్నీ స్టాక్ కాదు. కంపెనీ ఫండమెంటల్స్ కూడా బాగానే ఉన్నట్లు చెబుతున్నారు.

పైగా దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిపోయింది. ఢిల్లీ సర్కార్ 2028 కేవలం ఎలక్ట్రిక్ వాహనాలకే రిజిస్ట్రేషన్ ఉంటుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. అంతేకాకుండా పెరుగుతున్న పెట్రోల్ ధర కారణంగా చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలనే వాడుతున్నారు. మరోపక్క ఓలా సరిగా పని చేయకపోవడంతో ఎథర్ స్కూటీలకు మంచి డిమాండ్ వచ్చింది. ఈ కంపెనీ ఫలితాలు కూడా బాగున్నాయని చెబుతున్నారు. గతేడాది కాలంలో కంపెనీ 262,942 ఎలక్ట్రిక్ టూ-వీలర్లను విక్రయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+