Multibagger Stock: భారీ లాభాలు అందిస్తున్న ఎలక్ట్రిక్ స్యూటీ తయారీ కంపెనీ..!
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన ఏథర్ ఎనర్జీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయినప్పటి పెట్టుబడిదారులకు భారీ రాబడి ఇస్తోంది. ఆ కంపెనీ జూన్ త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఫలితాలు బాగుండడంతో మంగళవారం నాడు బీఎస్ఈలో ఆ సంస్థ షేర్లు 18 శాతం పెరిగి రూ.1,500 వద్ద రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.51 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఏదాడి రూ.178 నష్టం ఉండేది. ఇప్పుడు నష్టం భారీగా తగ్గింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం గతేడాదితో పోలిస్తే 88.8 శాతం పెరిగింది. అది రూ.1,217 కోట్లకు చేరుకుంది.
బలమైన అమ్మకాల వృద్ధి, వ్యూహాత్మక ధరల నిర్ణయాలు, వాహనేతర ఆదాయ మార్గాల నుంచి అధిక వాటా కారణంగా, ఏకీకృత మొత్తం ఆదాయం 87.2 శాతం పెరిగి రూ.1,260 కోట్లకు చేరుకుంది. సాఫ్ట్‌వేర్ సబ్‌స్క్రిప్షన్‌లు, ఛార్జింగ్ సేవలు, యాక్సెసరీలు, విడి భాగాలు, సర్వీసింగ్ నుంచి వచ్చే ఆదాయం మొత్తం ఆదాయంలో 14 శాతంగా ఉంది. ఏథర్ ఎనర్జీ షేర్లు గత కొంత కాలంగా భారీ లాభాలను ఇస్తున్నాయి. ఈ స్టాక్ గత వారంలో 21 శాతం లాభపడగా.. ఒక నెలలో 29 శాతం, మూడు నెలల్లో 56 శాతం, ఆరు నెలల్లో 110 శాతం, గత సంవత్సరంలో 269 శాతం పెరిగింది.

ఆగస్టు 2025లో ఈ స్టాక్ రూ.349.90 వద్ద ఉన్న 52-వారాల కనిష్ట స్థాయి నుంచి 328% పెరిగి మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. జూన్-త్రైమాసిక ఫలితాల తరువాత నోమురా ఏథర్ ఎనర్జీపై తన 'బై' రేటింగ్‌ను కొనసాగించింది. టార్గెట్ ప్రైస్ ను రూ.1,273 నుంచి రూ.1,714కు పెంచింది. ఇది ప్రస్తుత స్థాయిల నుంచి 34.6 శాతం ఎక్కువ. బుధవారం మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాలకు ఈ స్టాక్ రూ.1457 వద్ద ట్రేడవుతోంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పెరిగిందని నోమురా పేర్కొంది. సరఫరాను డిమాండ్ నిరంతరం మించిపోతోందని పేర్కొంటూ, బ్రోకరేజ్ సంస్థ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో ఏథర్‌ను తన అగ్ర ఎంపికగా కొనసాగించింది.
మార్జిన్ రిస్క్‌లు చాలా వరకు తగ్గుముఖం పట్టాయని, అలాగే మెరుగైన స్కేల్, ఆపరేటింగ్ లెవరేజ్ కారణంగా FY28 నాటికి ఏథర్ EBITDA బ్రేక్ఈవెన్‌ను సాధించడంలో సహాయపడుతుందని నోమురా అభిప్రాయపడింది. మోటార్‌సైకిల్ విభాగంలోకి కంపెనీ ప్రవేశించే అవకాశం ఒక దీర్ఘకాలిక వృద్ధి అవకాశంగా ఉంటుందని కూడా ఈ బ్రోకరేజ్ సంస్థ భావిస్తోంది. అనుకూలమైన విధానపరమైన చర్యలు, మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతల మద్దతుతో బలమైన డిమాండ్ కనిపిస్తుందని ఏథర్ ఎనర్జీ సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ తరుణ్ మెహతా చెప్పారు. రాగి, అల్యూమినియం, లిథియం మరియు ముడి చమురుతో ముడిపడిన పదార్థాల ధరలు పెరగడం వల్ల ఈ త్రైమాసికంలో వస్తు ద్రవ్యోల్బణం ముడి పదార్థాల ఖర్చులను పెంచిందని ఏథర్ పేర్కొంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications