స్టాక్ మార్కెట్ నష్టాలతో ప్రారంభం.. టెక్ షేర్ల పతనంతో ఆసియా మార్కెట్లు డౌన్.. వెంటాడుతున్న AI భయాలు..

Asian Stock Markets Today: అంతర్జాతీయ ఆర్థిక విపణిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), దిగ్గజ టెక్నాలజీ షేర్ల చుట్టూ ఉన్న ఆందోళనలు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి (Sell-off) దారితీశాయి. గత వారం అమెరికన్ స్టాక్ మార్కెట్లలో నమోదైన పదునైన పతనం ప్రభావంతో సోమవారం (నవంబర్ 2, 2026) ఉదయం ఆసియాన్ మార్కెట్లు కూడా నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీలు తమ ప్రధాన వ్యాపారాల ఆదాయం మందగిస్తున్నప్పటికీ ఏఐ మౌలిక సదుపాయాలపై రూ. లక్షల కోట్లు (CapEx) వెచ్చిస్తుండటం.. ఈ పెట్టుబడులకు తగినంత లాభాలు తక్షణమే రావడం లేదన్న నిరాశ ఇన్వెస్టర్లలో పెరగడమే ఈ గ్లోబల్ సెల్-ఆఫ్‌కు ప్రధాన కారణమైంది.

అమెరికా మార్కెట్లలో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో టెక్ ఆధారిత నాస్‌డాక్ 100 (Nasdaq 100) సూచీ ఏకంగా 3.5 శాతం క్షీణించి జూన్ తర్వాత అత్యంత దారుణమైన ఒక్కరోజు పతనాన్ని నమోదు చేయగా.. చిప్ తయారీ రంగ సూచీ అయిన ఫిలడెల్ఫియా సెమీకండక్టర్ ఇండెక్స్ (SOX) 7.2 శాతం మేర కుప్పకూలింది. ఆల్ఫాబెట్, అమెజాన్ వంటి గ్లోబల్ దిగ్గజాల Q3 ఆర్ధిక ఫలితాలు ఏఐ ఆధారిత మౌలిక వ్యయాల పెరుగుదలను స్పష్టం చేయడంతో పాటు, టెక్ రంగానికి ప్రధాన వనరుగా ఉన్న సాంప్రదాయ ప్రకటనలు, క్లౌడ్ వ్యాపార వృద్ధి మందగిస్తుందన్న అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

Asian Stock Markets Today Global Stock Market Today November 2 2026 Japan Nikkei 225 South Korea Kospi Topix Index Asian Markets Fall Wall Street Selloff AI Stocks Crash Technology Stocks Global Market News 2

వాల్‌స్ట్రీట్ లో కనిపించిన ఈ ప్రతికూల ప్రభావం సోమవారం ఆసియా మార్కెట్లపై స్పష్టంగా పడింది. దక్షిణ కొరియా కోస్పి (KOSPI) సూచీ 1.06 శాతం తగ్గగా, జపాన్ నిక్కీ 225 (Nikkei 225) 0.39 శాతం, టోపిక్స్ 0.51 శాతం, ఎమ్‌ఎస్‌సిఐ ఆసియా పసిఫిక్ సూచీ 0.5 శాతం నష్టాలను చవిచూశాయి. అయితే అంతర్జాతీయంగా ప్రతికూలతలు ఉన్నప్పటికీ భారత మార్కెట్‌కు ముందస్తు సంకేతమైన 'గిఫ్ట్ నిఫ్టీ' (GIFT Nifty) ఉదయాన్నే దాదాపు 200 పాయింట్ల (0.96%) లాభంతో 23,281 వద్ద ట్రేడ్ అవుతూ భారత స్టాక్ మార్కెట్ సానుకూలమైన బుల్లిష్ ఆరంభాన్ని పొందే అవకాశాలను సూచించింది.

మరోవైపు చైనా తన దేశీయ స్టాక్ మార్కెట్‌కు మద్దతు ఇచ్చేందుకు అత్యవసర చర్యలకు శ్రీకారం చుట్టింది. చైనా సెంట్రల్ బ్యాంక్ (PBOC), నేషనల్ ఫైనాన్షియల్ రెగ్యులేటరీ అడ్మినిస్ట్రేషన్, ప్రధాన బ్యాంకింగ్ అధికారులు సోమవారం ప్రత్యేకంగా సమావేశమై.. కంపెనీలు తమ సొంత షేర్లను కొనుగోలు చేయడానికి (Share Buybacks) అందించే రుణ పథకాలు, రీఫైనాన్సింగ్ సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా మార్కెట్‌ను రక్షించే ప్రణాళికలపై చర్చిస్తున్నారు.

డిజిటల్ అసెట్ విభాగంలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజ్ అయిన బైనాన్స్ (Binance) చరిత్రలోనే అత్యంత భారీ హ్యాకింగ్‌కు గురికావడం అంతర్జాతీయ మార్కెట్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. హ్యాకర్లు రికార్డు స్థాయిలో $6.3 బిలియన్ల (రూ. 52,000 కోట్లకు పైగా) డిజిటల్ అసెట్స్‌ను దారిమళ్లించారు. ఈ దాడి వెనుక ఉత్తర కొరియా ప్రభుత్వ మద్దతు ఉన్న సైబర్ కేటుగాళ్లు ఉన్నట్లు బిట్‌గో, ఇతర బ్లాక్‌చెయిన్ సంస్థలు అనుమానిస్తున్నాయి.

ఎక్స్ఛేంజ్ అప్రమత్తమై వెంటనే డిపాజిట్, విత్‌డ్రాయల్స్‌ను నిలిపివేసి $3 బిలియన్ల విలువైన అసెట్స్‌ను ఆన్-చైన్ ద్వారా ఫ్రీజ్ చేయగలిగింది. బాధిత ఖాతాదారులందరికీ తమ సొంత 'సఫూ' (SAFU) ఫండ్ ద్వారా 100 శాతం పరిహారాన్ని చెల్లిస్తామని బైనాన్స్ హామీ ఇవ్వడంతో విపరీతమైన ఒత్తిడికి గురైన బిట్‌కాయిన్, ఇతర క్రిప్టోలు క్రమంగా కోలుకుని రికవరీ బాట పడుతున్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+