స్టాక్ మార్కెట్ టుడే.. ఇన్వెస్టర్లకు శుభవార్త.. లాభాలతో ప్రారంభమైన ఆసియా స్టాక్ మార్కెట్లు..

Asian Markets Today: ఆసియా స్టాక్ మార్కెట్లు ఈ వారం ప్రారంభంలోనే మిశ్రమ ధోరణిని కనబరిచాయి. జపాన్ బెంచ్‌మార్క్ సూచీలైన నిక్కీ 225 దాదాపు ఒకటిన్నర శాతానికి పైగా, టోపిక్స్ రెండు శాతానికి పైగా లాభపడగా, దక్షిణ కొరియా కోస్పి, కోస్‌డాక్ సూచీలతో పాటు ఆస్ట్రేలియా ఎస్&పి/ఏఎస్ఎక్స్ 200 సూచీలు నష్టాల బాట పట్టాయి. ఆస్ట్రేలియా మార్కెట్ ప్రారంభంలో లాభపడినప్పటికీ, చివరికి నష్టాల్లోకి జారుకుంది.

రాబోయే రోజుల్లో వెలువడనున్న ప్రముఖ కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఆదాయ ఫలితాలు, కీలకమైన స్థూల ఆర్థిక డేటా కోసం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దిగ్గజమైన ఎన్విడియా (Nvidia) చుట్టూ ముసురుకున్న వివాదాలు టెక్నాలజీ రంగానికి సంబంధించిన షేర్లపై అనిశ్చితిని మరింత పెంచాయి. అమెరికా స్థూల ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడానికి ఇన్వెస్టర్లు అక్టోబర్ నెల వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణ గణాంకాల వైపు దృష్టి సారించారు.

Asian markets today Kospi today Nikkei today Nvidia news Asian stock market South Korea stock market Japan stock market Asian market news November 9 2026 Kospi Nikkei Nvidia

టెక్నాలజీ షేర్ల పునరుద్ధరణపై నమ్మకంతో వాల్ స్ట్రీట్ ఫ్యూచర్స్ వార ప్రారంభంలో లాభాలతో మొదలైనప్పటికీ.. అంతర్గత పరిణామాలు సూచీలను దెబ్బతీశాయి. ఎస్&పి 500, నాస్‌డాక్-100, డౌ జోన్స్ ఫ్యూచర్స్ లాభాల్లోకి ప్రవేశించిన వెంటనే, ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌ను ఒక విదేశీ (చైనీస్) గూఢచర్య కుట్రలో లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలు బయటకు వచ్చాయి. దీనిపై ఎన్విడియా బోర్డు అంతర్గత విచారణ ప్రారంభించిందన్న వార్తలతో నాస్‌డాక్-100 ఫ్యూచర్స్ ఒక్కసారిగా ఒక శాతం వరకు లేదా దాదాపు 150 పాయింట్ల మేర పడిపోయాయి.

Also Read

ఇప్పటికే అమెరికా మధ్యంతర ఎన్నికలలో ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటినీ డెమోక్రాట్లు సొంతం చేసుకోవడంతో చెలరేగిన అమ్మకాల ఒత్తిడికి గురు, శుక్రవారాల్లో డౌ జోన్స్ సూచీ రెండు వేల పాయింట్లు కోల్పోయింది. అక్టోబర్ నెలలో యూఎస్ ఏకంగా 1.6 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించినట్లు డేటా వెల్లడించినప్పటికీ, ఎన్విడియా అధినేత వివాదం టెక్ రంగాన్ని కలవరపెడుతోంది.

ఈ వారంలో వాల్ స్ట్రీట్ మార్కెట్లను శాసించే కీలక అంశాలలో కోర్‌వీవ్, నెబియస్ గ్రూప్ సంస్థల త్రైమాసిక ఫలితాలు ప్రధానమైనవి. పెద్ద కంపెనీల ఫలితాలు ఇవి మాత్రమే అయినప్పటికీ, స్థూల ఆర్థిక డేటా, ఫెడరల్ రిజర్వ్ అధికారుల ప్రసంగాలు మార్కెట్ దిశను నిర్ణయించనున్నాయి. ముఖ్యంగా మంగళవారం విడుదల కానున్న వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం (CPI) మరియు శుక్రవారం వెలువడనున్న ఉత్పత్తిదారుల ధరల ద్రవ్యోల్బణం (PPI) వివరాలు అత్యంత కీలకమైనవి.

దీనికితోడు ఆస్టన్ గూల్స్‌బీ, థామస్ బార్కిన్, మేరీ డేలీలతో సహా దాదాపు 10 మంది ఫెడ్ అధికారులు ఈ వారం వేర్వేరు సమాయాల్లో ప్రసంగించనున్నారు. ద్రవ్యోల్బణాన్ని రెండు శాతానికి తగ్గించేందుకు మరిన్ని వడ్డీ రేట్ల పెంపు అవసరమని ఫెడ్ అధికారులు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. డిసెంబర్ 18న జరిగే చివరి విధాన నిర్ణయానికి ముందు ఈ ద్రవ్యోల్బణ డేటానే కీలకం కానుంది.

మరోవైపు అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 97.90 డాలర్ల వద్ద క్షీణించడం మార్కెట్లకు కాస్త ఉపశమనం అందించింది. ఇరాన్ అణు కార్యక్రమం మరియు హోర్ముజ్ జలసంధిని తెరిచే విషయంలో దౌత్యపరమైన చర్చలు కొలిక్కి వస్తే అమెరికా తదుపరి దాడులు జరపబోదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించడం క్రూడ్ ధరలను తగ్గించింది. అయినప్పటికీ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్ ఫెడ్ నిర్ణయాలు రాబోయే రోజుల్లో స్టాక్ మార్కెట్లకు అత్యంత సవాలుగా మారనున్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+