Bitcoin Crash: ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీలకు భారీగా డిమాండ్ కనిపించింది. ప్రధానంగా ట్రంప్ ఎన్నికల్లో విజయంతో బిట్‌కాయిన్ సూపర్ వేగంతో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం క్రిప్టోలు భారీ నష్టాలతో పెట్టుబడిదారులకు నష్టాలను కలిగిస్తున్నాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే క్రిప్టోల క్రాష్ కి కూడా ట్రంపే కారణం కావటం.
వివరాల్లోకి వెళితే అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఒకటి తర్వాత మరొకటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ ప్రభుత్వం గతంలో హెచ్చరించినట్లుగానే వాణిజ్య యుద్ధానికి తెరలేపింది. ప్రధానంగా కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలను ప్రకటించించింది. ఈ క్రమంలో కెనడా, మెక్సికోలపై 25 శాతం చొప్పున పన్నులను ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ చర్యలు ఈక్విటీ మార్కెట్లనే కాకుండా క్రిప్టో మార్కెట్లను కూడా తీవ్రంగా దెబ్బతీశాయి.

సోమవారం ట్రేడింగ్ ఇంట్రాడే సమయంలో ప్రముఖ క్రిప్టో కరెన్సీగా కొనసాగుతున్న బిట్‌కాయిన్ తన 3 వారాల కనిష్టాన్ని తాకింది. ఇదే క్రమంలో మరో క్రిప్టో అయిన ఈథర్ గత ఏడాది సెప్టెంబరు ప్రారంభంలో ఉన్న ధర కంటే తక్కువకు దిగజారింది. మధ్యాహ్నం 2.50 గంటల సమయంలో బిట్ కాయిన్ ధర 94,395.4 డాలర్ల వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. గడచిన 24 గంటల సమయంలో ఇది దాదాపు 4.46 శాతం పతనాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో మరో క్రిప్టో కరెన్సీ ఈథరమ్ ప్రస్తుతం 2570.41 డాలర్ల వద్ద ఉండగా గడచిన 24 గంటల సమయంలో దాదాపు 17.38 శాతం పతనాన్ని నమోదు చేసింది.
క్రిప్టోల గత పనితీరును పరిశీలిస్తే.. అథ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన జనవరి 20న బిట్‌కాయిన్ ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయి 1,07,071 డాలర్ల మార్కును తాకింది. బిట్‌కాయిన్ లక్ష డాలర్ల మార్కును దాటేయటంతో భవిష్యత్తులో ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని చాలా మంది భావించారు. దీంతో అనేక మంది తమ కష్టార్జితాన్ని ట్రంప్ గెలుపుతో క్రిప్టోలపై బెట్టింగ్ వేసి ప్రస్తుతం భారీ నష్టాలను చూస్తున్నారు. కేవలం ట్రంప్ బాధ్యలు చేపట్టిన ఒక్కరోజే బిట్‌కాయిన్ దాదాపు 40 శాతం పెరుగుదలను చూసింది. ప్రస్తుతం డాలర్ విలువ పెరుగుదలతో ఒక్కసారిగా క్రిప్టో కరెన్సీలు ఢమాల్ అంటూ కిందపడ్డాయని నిపుణులు చెబుతున్నారు.
ఇదే క్రమంలో చాలా మంది చూపు ట్రంప్ తీసుకొచ్చిన క్రిప్టో కరెన్సీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందనే దానిపై కొనసాగుతోంది. ఆయన తీసుకొచ్చిన క్రిప్టో ధర 0.18 వద్ద ప్రారంభనప్పటికీ.. జనవరిలో ఏకంగా ఒక్కోటి 75 డాలర్లకి చేరుకుంది. అయితే కేవలం రెండు వారాల్లోనే దీని విలువ 17.56 డాలర్లకు దిగజారిన సంగతి తెలిసిందే. నేడు ఒక్కరోజే దీని ధర దాదాపు 17 శాతానికి పైగా పతనంతో కొనసాగుతోంది. అలాగే మెలినా ట్రంప్ క్రిప్టో విలువ దాని ప్రారంభంలోని ధర కంటే దాదాపు 82.19 శాతం తగ్గుదలతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. అయితే వాణిజ్య భయాలు పరిస్థితులను మరింతగా దిగజార్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications