Multibagger Stock: 10 నెలల్లో రూ.275 నుంచి రూ.600 చేరిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
స్టాక్ మార్కెట్ లో మల్టీబ్యాగర్ రిటర్స్న్ అందిస్తోన్న స్టాక్స్ ఎన్నో ఉన్నాయి. అందులో అరవింద్ లిమిటెడ్ కంపెనీ ఒకటి. ఆగస్టు 2025లో రూ. 275 ఉన్న ఈ స్టాక్ ప్రైస్ జూన్ 2026 నాటికి రూ. 600 స్థాయికి చేరింది. 10 నెలల వ్యవధిలో పెట్టుబడిదారుల డబ్బును రెట్టింపు చేసింది. దాదాపు 118 శాతం పెరిగింది. ఇటీవల కాలంలో వీటి విలువ 8 శాతం తగ్గింది. స్థూల ఆర్థిక పరిణామాల కారణంగా నూలు ధరలు, ప్యాకేజింగ్ ఖర్చులు పెరిగాయని, ఫలితంగా జూన్ త్రైమాసికంలో టెక్స్‌టైల్, అడ్వాన్స్‌డ్ మెటీరియల్ బిజినెస్ (AMB) విభాగాలలో మార్జిన్లలో తగ్గుదల కనిపించిందని విశ్లేషకులు పేర్కొన్నారు. అయినప్పటికీ, స్వల్పకాలిక మందగమనం కొత్తగా ప్రవేశించే అవకాశాన్ని కల్పిస్తుందని చెబుతూ, వారు ఈ స్టాక్‌పై 'కొనుగోలు' సిఫార్సును కొనసాగించారు. అరవింద్ సంస్థ ఫ్యాబ్రిక్-కేంద్రీకృత సంస్థ నుంచి గార్మెంట్స్-ఆధారిత వ్యాపారంగా వ్యూహాత్మక పరివర్తన చెందే దశలో ఉందని పేర్కొన్నారు.
అరవింద్ లిమిటెడ్ మొదటి త్రైమాసిక (Q1) ఫలితాలు అనియంత్రిత కారకాల వల్ల దెబ్బతిన్నాయని ఎంకే గ్లోబల్ పేర్కొంది. అందువల్ల FY27 రెండవ అర్ధభాగంలో Q1 మార్జిన్ తగ్గుదల సాధారణ స్థితికి వస్తుందని అభిప్రాయపడింది. మొదటి త్రైమాసికంలో (Q1) వస్త్ర పరిశ్రమలో నమోదైన 13 శాతం వార్షిక వృద్ధి తమకు నచ్చిందని, ఇది సాధారణ పరిస్థితులలో మెరుగైన ఉత్పత్తి మిశ్రమం ఉండే అవకాశంపై తమకు విశ్వాసాన్ని కలిగిస్తోందని దేశీయ బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. కాగా ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు, బీఎస్ఈలో అరవింద్ షేరు 3.72 శాతం తగ్గి రూ. 550.50 వద్ద ట్రేడవుతోంది.

ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల మార్జిన్లు దెబ్బతిన్నాయని నువామా తెలిపింది. అరవింద్ FY27 ఆదాయం, ఎబిట్డా అంచనాలను మైనస్ 0.4-1.2 శాతం ఉందని పేర్కొంది. టార్గెట్ ప్రైస్ ను రూ. 660 గా నిర్ణయించింది. రాబోయే 2-3 సంవత్సరాలలో 11-12 శాతం ఆదాయ వృద్ధిని సాధిస్తామని కంపెనీ పేర్కొంది. 40-60 బేసిస్ పాయింట్ల ఆపరేటింగ్ మార్జిన్ విస్తరణను యాజమాన్యం అంచనా వేస్తోంది. ఈ స్టాక్ లో పెట్టుబడి పెట్టేవారు రిస్కులు కూడా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రిస్కులలో టారిఫ్ రిస్క్, ముడి పదార్థాలు, వ్యయ ఒత్తిళ్లు ఉంటాయని పేర్కొన్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications