Stock Market: డిసెంబర్ నెలలో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. అందుకే మార్కెట్లు ఎప్పుడు సెలవులో ఉంటాయి, ట్రేడింగ్ చేయటానికి ప్లాన్ చేయటానికి ముందు చూసుకుంటున్నారు. అధికారికంగా సెలవుల జాబితాపై ప్రస్తుతం ఇన్వెస్టర్ల దృష్టి కొనసాగుతోంది. అయితే డిసెంబర్ నెలలో వివిధ కారణాల వల్ల మెుత్తం 10 రోజుల పాటు స్టాక్ మార్కెట్లు క్లోజ్ కానున్నాయని తెలుస్తోంది.
వాస్తవానికి మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై, నగర శివారు ప్రాంతాలకు డిసెంబర్ 6 సెలవుగా ప్రకటించింది. ఈ సెలవు కారణంగా డిసెంబర్ 6, 2024న ముంబై మహానగరంలో ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. దీనికి కారణం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్థంతి కారణంగా ప్రభుత్వం ఈరోజును సెలవుగా ప్రకటించింది. అయితే స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి సెలవు గురించి ఇప్పటి వరకు సెలవు గురించి ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు. స్టాక్ ఎక్స్ఛేంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ సెలవుల గురించి ఇన్వెస్టర్లకు ఎలాంటి సర్క్యులర్ జారీ చేయలేదు. దీని ప్రకారం రేపు అంటే డిసెంబర్ 6న దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ కార్యకలాపాల కోసం అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది బీఆర్ అంబేడ్కర్ 68వ వర్థంతి జరగనుంది. ఈ రోజును మహాపరినిర్వాన్ దివస్ అని పిలుస్తారు. ఈ లెక్కన డిసెంబర్ 6న దేశీయ స్టాక్ మార్కెట్లు ఎప్పటిలాగానే యధావిధిగా వ్యాపారం కొనసాగించనున్నాయని తెలుస్తోంది. అయితే స్టాక్ మార్కెట్ల సెలవుల క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 25న క్రిస్టమస్ సందర్భంగా స్టాక్ మార్కెట్లకు అధికారికంగా సెలవు వల్ల మూసివేయబడతాయని అధికారికంగా ధృవీకరించబడింది.
డిసెంబరులో స్టాక్ మార్కెట్ సెలవులు ఇవే..
స్టాక్ మార్కెట్ సెలవుల క్యాలెండర్‌ను పరిశీలిస్తే.. 25 డిసెంబర్ క్రిస్మస్ సందర్భంగా స్టాక్ మార్కెట్లు సెలవులో ఉండనున్నాయి. ఈ క్రమంలో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో ఈరోజున ట్రేడింగ్ ఉండదు. దీనికి తోడు ప్రతినెల మాదిరిగానే వారాంతంలో అంటే శని, ఆదివారాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు సెలవులో ఉంటాయి. దీని ప్రకారం డిసెంబర్ మాసంలో నాలుగు శనివారాలు, 5 ఆదివారాలు వచ్చాయి. అంటే డిసెంబర్ నెలలో మెుత్తంగా దేశీయ స్టాక్ మార్కెట్లు 10 రోజుల పాటు సెలవులో ఉంటాయి. ఈ మేరకు 10 రోజుల పాటు BSE-NSEలలో ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిపివేయబడతాయి. అంటే 2024లో ట్రేడర్లకు కేవలం 21 ట్రేడింగ్ రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications