Stock market: ఆరు నెలల్లో 209% లాభం.. ఇప్పుడు ఉచితంగా బోనస్ షేర్లు! ఈ స్టాక్ మ్యాజిక్ చూశారా?
స్టాక్ మార్కెట్ (Stock market) లో కొన్ని షేర్లు అదృష్టాన్ని రాత్రికి రాత్రే మార్చేస్తుంటాయి. అలాంటి కోవలోకే వస్తుంది అప్టస్ ఫార్మా (Aptus Pharma). గత ఆరు నెలలుగా ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపిస్తున్న ఈ కంపెనీ, ఇప్పుడు తన షేర్ హోల్డర్లకు మరో తియ్యని కబురు చెప్పింది. కంపెనీ బోర్డు 3:2 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించింది. అంటే మీ దగ్గర కంపెనీకి చెందిన రెండు షేర్లు ఉంటే, అదనంగా మూడు షేర్లు ఉచితంగా లభిస్తాయన్నమాట.

రికార్డ్ డేట్ ఖరారు
ఈ బోనస్ షేర్లకు అర్హులైన వారిని తేల్చేందుకు కంపెనీ మే 12, 2026ని రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. సెబీ (SEBI) నిబంధనల ప్రకారం, పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాటాదారుల ఆమోదం పొందిన తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. మే 12 నాటికి ఎవరి డీమాట్ ఖాతాలో అయితే ఈ షేర్లు ఉంటాయో, వారికి మాత్రమే ఈ బోనస్ ప్రయోజనం అందుతుంది.
స్టాక్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది!
అప్టస్ ఫార్మా స్టాక్ మార్కెట్‌లో ప్రస్తుతం ఒక సెన్సేషన్‌గా మారింది. గత ఆరు నెలల్లోనే ఈ షేరు ఏకంగా 209% లాభాలను పంచింది. కేవలం 2026 ఏడాదిలోనే 138% పెరిగి మల్టీబ్యాగర్ (multibagger stock) గా నిలిచింది. నేటి ట్రేడింగ్‌లో ఈ షేరు రూ. 408.50 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ. 280.23 కోట్లుగా ఉంది. మూడు నెలల కాలంలో 59%, గత నెల రోజుల్లో 18% పైగా పెరగడం ఈ స్టాక్ పట్ల ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది.
టెక్నికల్ గా స్టాక్ ఎలా ఉంది?
టెక్నికల్ చార్ట్‌లను గమనిస్తే, ఈ షేరు ప్రస్తుతం పూర్తి స్థాయిలో బుల్స్ గుప్పిట్లో ఉంది. 5 రోజుల నుంచి 200 రోజుల వరకు అన్ని 'సింపుల్ మూవింగ్ యావరేజెస్' (SMA) పైన ట్రేడ్ అవుతోంది. ఇది స్టాక్ మరింత పెరిగే అవకాశం ఉందని సూచిస్తోంది. అయితే, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ (RSI) 75.7 వద్ద ఉండటం వల్ల, స్టాక్ ప్రస్తుతం 'ఓవర్ బాట్' (Overbought) జోన్‌లో ఉందని నిపుణులు చెబుతున్నారు. అంటే షేరు ధర వేగంగా పెరిగినందున, ఇన్వెస్టర్లు కాస్త జాగ్రత్తగా ఉండాలని అర్థం.
కంపెనీ నేపథ్యం
2010లో ప్రారంభమైన అప్టస్ ఫార్మా లిమిటెడ్, ఫార్మాస్యూటికల్ రంగంలో మార్కెటింగ్ , డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంలో ఉంది. ఫినిష్డ్ ఫార్ములేషన్స్ రంగంలో ఈ కంపెనీ మంచి గుర్తింపు పొందింది. కేవలం ఆరు నెలల్లోనే ఇన్వెస్టర్ల సంపదను మూడు రెట్లు పెంచిన ఈ స్టాక్, ఇప్పుడు బోనస్ షేర్లతో మరోసారి వార్తల్లో నిలిచింది. స్టాక్ మార్కెట్ (Stock market) ఒడిదుడుకుల మధ్య కూడా ఇలాంటి మల్టీబ్యాగర్ రిటర్న్స్ రావడం విశేషమే!


Click it and Unblock the Notifications