Next Week IPO's: వచ్చే వారం ఆరు ఐపీఓలు.. రూ.3,824.61 కోట్లు సమీకరణ..!
వచ్చే వారం మార్కెట్ లో కి 6 ఐపీఓలు రానున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి 24 మధ్య ఆరు కంపెనీలు తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌లను ప్రారంభించనున్నాయి. వర్మోరా గ్రానిటో లిమిటెడ్ తన IPO సెప్టెంబర్ 22న ప్రారంభం కానుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 23న ఆర్మీ ఇన్ఫోటెక్ లిమిటెడ్, స్వస్తిక ఇన్ఫ్రా లిమిటెడ్, ఎలివేట్ క్యాంపసెస్ లిమిటెడ్, అడ్రాయిట్ ఇండస్ట్రీస్ (ఇండియా) లిమిటెడ్ తమ IPOలను ప్రారంభించనున్నాయి. ఎ-వన్ స్టీల్స్ ఇండియా లిమిటెడ్ ఐపీఓ సెప్టెంబర్ 24న ప్రారంభం కానుంది. ఈ ఆరు ఐపీఓల ద్వారా కలిసి దాదాపు రూ.3,824.61 కోట్లు సమీకరించనున్నారు. ఇందులో ఫ్రెష్ ఇష్యూల ద్వారా సుమారు రూ. 3,336.12 కోట్లు, ఆఫర్-ఫర్-సేల్ (OFS) ద్వారా దాదాపు రూ. 488.02 కోట్లు సమీకరించే అవకాశం ఉంది.
వర్మోరా గ్రానిటో ఐపీఓ
వర్మోరా గ్రానిటో లిమిటెడ్ తన రూ. 708.02 కోట్ల ఐపీఓ సెప్టెంబర్ 22న ప్రారంభం కానుంది. ఈ ఇష్యూ సెప్టెంబర్ 24న ముగుస్తుంది. ఈ బుక్-బిల్ట్ ఇష్యూలో మొత్తం రూ. 320 కోట్ల విలువైన 2.16 కోట్ల షేర్ల ఫ్రెష్ ఇష్యూ, రూ. 388.02 కోట్ల విలువైన 2.62 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉన్నాయి. ఐపీఓ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ. 140-148గా నిర్ణయించారు. లాట్ సైజు 101 షేర్లు. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం కనీసం రూ. 14,948 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ కంపెనీ షేర్లు సెప్టెంబర్ 29న ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, గోల్డ్‌మన్ సాక్స్ (ఇండియా) సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తుండగా, కేఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ రిజిస్ట్రార్‌గా ఉంది. 2003లో స్థాపించిన వర్మోరా గ్రానిటో లిమిటెడ్, గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ (GVT), పాలిష్డ్ విట్రిఫైడ్ టైల్స్ (PVT) మరియు సిరామిక్ టైల్స్‌తో సహా సిరామిక్, విట్రిఫైడ్ టైల్స్‌ను తయారు చేసి విక్రయిస్తుంది.

ఆర్మీ ఇన్ఫోటెక్ ఐపీఓ
ఆర్మీ ఇన్ఫోటెక్ లిమిటెడ్ తన రూ. 300 కోట్ల ఐపీఓ సెప్టెంబర్ 23 ప్రారంభం అయి సెప్టెంబర్ 25న ముగుస్తుంది. ఈ ఐపీఓ పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ. ఇందులో రూ. 300 కోట్ల విలువైన 80 లక్షల షేర్లు ఉంటాయి. ఇందులో ఓఎఫ్‌ఎస్ (OFS)లేదు. ఐపీఓ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ. 350-375గా నిర్ణయించారు. లాట్ సైజు 40 షేర్లు వస్తాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం కనీసం రూ. 15,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ కంపెనీ షేర్లు సెప్టెంబర్ 30న ఎన్‌ఎస్‌ఈ (NSE), బీఎస్‌ఈ (BSE)లలో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఖండ్వాలా సెక్యూరిటీస్ లిమిటెడ్ బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తుండగా, కామియో కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్ రిజిస్ట్రార్‌గా ఉంది. ఈ కంపెనీని 2003లో స్థాపించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ఆర్మీ ఇన్ఫోటెక్ లిమిటెడ్, ఒక ఐటీ మౌలిక సదుపాయాల పరిష్కారాలు, నిర్వహణ సేవల సంస్థగా ఉంది.
స్వస్తిక ఇన్ఫ్రా ఐపీఓ
స్వస్తిక ఇన్ఫ్రా లిమిటెడ్ తన రూ. 160.88 కోట్ల ఐపీఓను సెప్టెంబర్ 23న ప్రారంభం అయి సెప్టెంబర్ 25న ముగుస్తుంది. ఈ బుక్-బిల్ట్ ఇష్యూలో మొత్తం రూ. 128.50 కోట్ల విలువైన 69.46 లక్షల షేర్ల ఫ్రెష్ ఇష్యూ, రూ. 32.38 కోట్ల విలువైన 17.50 లక్షల షేర్ల ఓఎఫ్‌ఎస్ (OFS) ఉన్నాయి. ఐపీఓ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ. 175-185గా నిర్ణయించారు. లాట్ సైజు 81 షేర్లుగా ఉన్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం కనీసం రూ. 14,985 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ కంపెనీ షేర్లు సెప్టెంబర్ 30న ఎన్‌ఎస్‌ఈ (NSE), బీఎస్‌ఈ (BSE)లలో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. సృజన్ ఆల్ఫా క్యాపిటల్ అడ్వైజర్స్ ఎల్‌ఎల్‌పి ఈ బుక్‌మేకర్‌గా వ్యవహరిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
