Multibagger Stock: ఏడేళ్లలో రూ.లక్షను రూ.65 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
రక్షణ రంగ మల్టీబ్యాగర్ అపోలో మైక్రో సిస్టమ్స్ షేర్లు దూసుకెళ్తున్నాయి. విశ్లేషకుల అంచనాలను మించిన సెప్టెంబర్-త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన తర్వాత, ఈ స్టాక్‌పై కొనుగోలు ఆసక్తి గణనీయంగా పెరిగింది. ఈ సానుకూల ఫలితాల కారణంగా దేశీయ బ్రోకరేజ్ సంస్థ సిస్టమాటిక్స్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ కూడా ఈ స్టాక్‌పై తన బుల్లిష్ వైఖరిని కొనసాగించింది. ఈ స్టాక్ కు బై రేటింగ్‌ను ఇచ్చి ఒక్కో షేరుకు రూ.570 టార్గెట్ ధరను నిర్ణయించింది. ఇది స్టాక్ తాజా ముగింపు ధర అయిన రూ.423 నుంచి 36 శాతం వృద్ధి సూచిస్తోంది. ఈ వారం ప్రారంభంలో కంపెనీ తన ఫలితాలు ప్రకటించింది.
నికర లాభం గతేడాదితో పోలిస్తే 55.6% పెరిగి రూ.48.4 కోట్లకు చేరింది. అదే సమయంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం గతేడాదితో పోలిస్తే 72.2% పెరిగి రూ.388 కోట్లకు చేరింది. ఎబిట్డా గతేడాదితో పోలిస్తే 87.6% పెరిగి రూ.59.2 కోట్ల నుంచి రూ.111 కోట్లకు చేరుకుంది. కాగా ఎబిట్డా మార్జిన్ 26.3 శాతం నుంచి 28.6 శాతానికి విస్తరించింది. MIGM మైన్స్ (మార్చి '27 లోపు అంచనా), మూరెడ్ మైన్స్, AHWT, QRSAM, పినాకా ఆర్డర్లు సమీప భవిష్యత్తులో రానుండటంతో బలమైన ఆర్డర్ల పరంపర పటిష్టంగా కొనసాగుతోంది. రాబోయే రెండేళ్లలో కంపెనీ రూ.120 బిలియన్ల ఆర్డర్ల ప్రవాహాన్ని అంచనా వేస్తోందని సిస్టమాటిక్స్ తెలిపింది.

ఇందులో కొన్ని పెద్ద ప్రాజెక్టులలో MIGM మైన్, హెవీ వెయిట్ టార్పెడో , QRSAM, పినాకా, హెవీ వెయిట్ టార్పెడో ఉన్నాయి. 2026 సంవత్సరం పొడవునా మార్కెట్లు అత్యంత అస్థిరంగా ఉన్నప్పటికీ, ఈ స్టాక్ తన విజయ పరంపరను కొనసాగిస్తూ, ఈ ఏడాది ఇప్పటివరకు 52 శాతం వరకు పెరిగింది. తాజా లాభాలతో ఈ షేరు వరుసగా ఏడవ ఏడాది కూడా తన వృద్ధిని కొనసాగించింది. 2023లో 290 శాతం లాభాన్ని నమోదు చేసిన ఈ షేరు 2025లో మరో 135 శాతం బలమైన రాబడిని అందించింది. గత మూడేళ్లలో ఈ షేరు మొత్తం 454 శాతం వృద్ధిని, గత ఐదేళ్లలో 3,400 శాతం వృద్ధిని సాధించింది. 2019లో నమోదైన కనిష్ట ధర రూ.6.50తో పోలిస్తే ఇప్పటివరకు ఈ షేరు 6,284% పెరిగింది. 2019లో ఈ స్టాక్ లో రూ.లక్ష పెట్టుబడి పెడితే దాని విలువ రూ.65 లక్షలకు చేరిది.
సంపూర్ణ ఆయుధ వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధిని చేపట్టేందుకు, ఈ సంస్థ ఆగస్టు 21, 2026న 'శౌర్యస్త్ర డిఫెన్స్ సిస్టమ్స్' అనే కొత్త సంస్థను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా రూ.34,000 వెచ్చించి 3,400 షేర్లను కొనుగోలు చేయడం ద్వారా, ఈ సంస్థ 34% వాటాను సొంతం చేసుకుంది. దీనితో ఆ కొత్త సంస్థ ఒక అసోసియేట్ కంపెనీగా మారింది. ఈ సంస్థకు డాక్టర్ వి.కె. సరస్వత్ నాయకత్వం వహిస్తున్నారు. భారత రక్షణ పరిశోధన, విధాన రూపకల్పన రంగంలో ఆయనకు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications