Apex Ecotech IPO: నవంబర్ నెల చివరికి వచ్చేసరికి ఐపీవోల మార్కెట్ తిరిగి పుంజుకుంది. కొన్ని కంపెనీల ఐపీవోలు వరుసగా మార్కెట్లో లాభాల లిస్టింగ్ చూస్తుండగా మరికొన్ని తమ ఇష్యూని ప్రారంభించాయి. దీంతో పెట్టుబడిదారులు తమకు నచ్చి, లాభాలను తెచ్చిపెట్టగలదని నమ్మిన కంపెనీల ఐపీవోలపై డబ్బును కుమ్మరిస్తున్నారు. ఈ క్రమంలో ఐపీవో ఇష్యూ తొలిరోజే భారీ స్పందనను చూస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది అపెక్స్ ఎకోటెక్ కంపెనీ ఐపీవో గురించే. వాస్తవానికి ఈ కంపెనీ ఎస్ఎమ్ఈ కేటగిరీలో లిస్టింగ్ కోసం ఇష్యూని ప్రారంభించింది. రిటైల్ పెట్టుబడిదారుల సబ్‍స్క్రిప్షన్ కోసం నేడు ఐపీవో ప్రారంభం కాగా నవంబర్ 29 వరకు ఇది అందుబాటులో ఉండనుంది. ఎన్ఎస్ఈలో లిస్టింగ్ కోసం వస్తున్న కంపెనీ ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.25.54 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 34.99 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించాలని నిర్ణయించింది. పెట్టుబడిదారుల కోసం ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్ ధరను కంపెనీ రూ.71-73గా నిర్ణయించింది. ఐపీవో ప్రారంభం రోజునే పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించింది. కంపెనీ లాట్ పరిమాణాన్ని 1600 షేర్లుగా నిర్ణయించటంతో కనీసం రూ.1.16 లక్షలు పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది.

అపెక్స్ ఎకోటెక్ షేర్లు ప్రస్తుతం గ్రేమార్కెట్లో మెుదటి రోజునే ఇష్యూ ధరపై 48 శాతం ప్రీమియం పలుకుతున్నాయి. దీంతో తొలిరోజు గ్రేమార్కెట్ ధర ఒక్కో షేరుకూ రూ.35 వద్ద కొనసాగుతోంది. ఇదే ధర లిస్టింగ్ రోజు వరకు కొనసాగితే పెట్టుబడిదారులు మంచి రాబడులను అందుకోనున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన స్టాక్ వాస్తవ ఇష్యూ ధరకు కాకుండా ప్రీమియం ధర రూ.108 వద్ద జాబితాను చూస్తుందని వారు అంటున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కంపెనీ షేర్లు డిసెంబర్ 4న మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి ముందు డిసెంబర్ 3న విజయవంతమైన బిడ్డర్ల డీమ్యాట్ ఖాతాల్లో షేర్లను కంపెనీ జమ చేస్తుంది. కంపెనీ ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.7.22 కోట్లను విజయవంతంగా సమీకరించింది.
కంపెనీ వ్యాపారం..
2009లో స్థాపించబడిన అపెక్స్ ఎకోటెక్ లిమిటెడ్ నీరు- మురుగునీటి శుద్ధి, నీటికి సంబంధించి రీసైక్లింగ్, పునర్వినియోగ పరిష్కారాలను అందిస్తుంది. కంపెనీ ఇండస్ట్రియల్ అవసరాల కోసం నీటి శుద్ధి ప్లాంట్లు, కాలుష్య నిబంధనలకు అనుగుణంగా ఎఫ్లుయెంట్ & మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, స్లడ్జ్ డీవాటరింగ్ పరికరాలను అందించడం, మెమ్బ్రేన్ సిస్టమ్స్ ద్వారా ముందుగా శుద్ధి చేసిన మురుగునీటిని రీసైక్లింగ్ చేయడం వంటివి ఉన్నాయి. కంపెనీ సేల్స్ అండ్ సర్వసెస్ తో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందిస్తోంది. కంపెనీ దేశీయంగా సేవలను అందిస్తున్న వివిధ సంస్థల జాబితాను పరిశీలిస్తే.. ఆదిత్య బిర్లా గ్రూప్, అశోక్ లేలాండ్, అపోటెక్స్ రీసెర్చ్, భారతీయం, ఎస్కార్ట్స్ కుబోటా, హల్దీరామ్, హీరో మోటోకార్ప్, హోండా కార్స్, హోండా స్కూటర్స్ & మోటార్‌సైకిల్, హెచ్‌యుఎల్, జూబిలెంట్, కోహ్లర్, లెన్స్‌కార్ట్, మహీంద్రా & మహీంద్రా, పెప్సికో, పిరమల్ ఫార్మాస్, పిరమల్ ఫార్మాస్,టకేనాక సహా మరెన్నో ఉన్నాయి.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications