Anthropic: ప్రైవేట్ మార్కెట్‌లో భూకంపం: ఇన్వెస్టర్లకు షాకిచ్చిన ఆంథ్రోపిక్ కొత్త రూల్స్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ స్టార్టప్ ఆంథ్రోపిక్ (Anthropic), తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం ప్రైవేట్ ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కంపెనీ షేర్ల బదిలీపై అత్యంత కఠినమైన నిబంధనలను తీసుకురావడమే దీనికి కారణం. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల అనుమతి లేకుండా జరిగే ఎలాంటి షేర్ల అమ్మకమైనా లేదా బదిలీ అయినా "Void" (చెల్లదు) అని స్పష్టం చేయడంతో ఇప్పుడు సెకండరీ మార్కెట్ ఒక్కసారిగా స్తంభించిపోయింది.

అసలు ఏం జరిగింది?
సాధారణంగా పెద్ద పెద్ద స్టార్టప్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూ (IPO) కి రాకముందే, వాటి షేర్లు ప్రైవేట్ మార్కెట్లలో ట్రేడ్ అవుతుంటాయి. ఆంథ్రోపిక్ (Anthropic) వంటి భారీ వాల్యుయేషన్ ఉన్న కంపెనీ షేర్లకు ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే, కంపెనీ ప్రమేయం లేకుండా బయట జరుగుతున్న ఈ లావాదేవీలకు అడ్డుకట్ట వేయాలని యాజమాన్యం నిర్ణయించింది. బోర్డు ఆమోదం లేని షేర్ల బదిలీ ద్వారా కొనుగోలు చేసిన వారికి ఆ షేర్లపై ఎలాంటి చట్టపరమైన హక్కులు ఉండవని కంపెనీ తేల్చి చెప్పింది.
బిలియన్ల డాలర్ల నష్టం?
ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ప్రైవేట్ మార్కెట్‌లో కంపెనీ విలువ భారీగా పడిపోయిందని టాక్ వినిపిస్తోంది. అధికారికంగా వాల్యుయేషన్ మారకపోయినా, ఇన్వెస్టర్ల నమ్మకం దెబ్బతినడంతో వందల బిలియన్ల డాలర్ల మార్కెట్ వాల్యూ గాలిలో కలిసిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రూల్ వల్ల షేర్ల లిక్విడిటీ (నగదుగా మార్చుకునే సౌలభ్యం) తగ్గిపోతుందని, కొనేవారు దొరకడం కష్టమవుతుందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.
AI రంగంలో కొత్త టెన్షన్
ఓపెన్ ఏఐ (OpenAI) , ఆంథ్రోపిక్ (Anthropic) వంటి కంపెనీలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీటి షేర్ల కోసం ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. ఇలాంటి సమయంలో కంపెనీలు ఆంక్షలు విధించడం ఇన్వెస్టర్లకు మింగుడుపడటం లేదు. ఒకవైపు కంపెనీలు తమ నియంత్రణ కోల్పోకూడదని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటే, మరోవైపు భారీగా పెట్టుబడులు పెట్టిన వారు ఇరుక్కుపోతామేమో అని భయపడుతున్నారు.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
ప్రస్తుతానికి బయట దొరికే షేర్లను కొనేముందు వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కంపెనీ నిబంధనల ప్రకారం, బోర్డు అనుమతి పత్రం ఉంటేనే ఆ షేర్లకు విలువ ఉంటుంది. లేదంటే మీరు పెట్టిన పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరు అయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఇతర AI స్టార్టప్‌లపై కూడా ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
ఏది ఏమైనా, టెక్నాలజీ ప్రపంచంలో ఎంత లాభం ఉంటుందో, ఇలాంటి రూల్స్ వల్ల అంతే రిస్క్ కూడా ఉంటుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఇన్వెస్టర్లు ఇలాంటి స్టార్టప్ షేర్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండటం మంచిది.
మొత్తంగా చూస్తే.. చూస్తే, ప్రైవేట్ మార్కెట్‌లో షేర్ల ట్రేడింగ్‌ను నియంత్రించడం ద్వారా తన వాల్యుయేషన్‌ను కాపాడుకోవాలని ఆంథ్రోపిక్ భావిస్తోంది. కానీ, ఈ నిర్ణయం వల్ల చిన్న ఇన్వెస్టర్లు మరియు సెకండరీ మార్కెట్ ప్లేయర్స్ తీవ్ర ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కంపెనీ అనుమతి లేకుండా షేర్లు కొంటే భవిష్యత్తులో అవి చెల్లని కాగితాలుగా మిగిలిపోయే ప్రమాదం ఉన్నందున, ఏ అడుగు వేసినా ఆచితూచి వేయడం ఉత్తమం.


Click it and Unblock the Notifications