కండోమ్ తయారీ కంపెనీ షేర్లు కొనేందుకు ఎగబడిన పెట్టుబడిదారులు, అనందితా మెడికేర్ ఐపీఓకి భారీ స్పందన
Anondita Medicare IPO: భారతదేశంలోని ప్రముఖ కండోమ్ తయారీ సంస్థలలో ఒకటైన అనందితా మెడికేర్ ఐపీఓ ఆగస్టు 22న ప్రారంభమైంది. ఈ ఇష్యూ ఆగస్టు 26 (మంగళవారం) వరకు పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంటుంది. మొత్తం 47.93 లక్షల కొత్త ఈక్విటీ షేర్లు పెట్టుబడిదారుల కోసం తెరిచి ఉంచారు. ఒక్కొక్క షేరు ధర రూ.10 గా నిర్ణయించారు. షేర్‌కి రూ. 137 నుండి రూ. 145 ధర బ్యాండ్‌ను (గరిష్ఠ ధర) నిర్ణయించారు. ఈ IPO ద్వారా కంపెనీ దాదాపు రూ.69.50 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఐపీఎ ద్వారా సేకరించిన నిధులను కంపెనీ మూలధన వ్యయం, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, కార్పొరేట్ అవసరాలు తీర్చడానికి వినియోగించుకోనుంది.
ఈ కంపెనీ ఇష్యూ ప్రారంభమైన రెండో రోజుకే IPO కి బలమైన స్పందన లభించింది. ఇప్పటివరకు ఈ ఇష్యూ మొత్తం 15.91 సార్లు సబ్‌స్క్రిప్షన్ అయ్యింది. ఇందులో.. రిటైల్ ఇన్వెస్టర్లు 10 రెట్లు సబ్‌స్క్రిప్షన్ చేశారు. NII (Non-Institutional Investors) దాదాపు 4.4 రెట్లు సబ్‌స్క్రిప్షన్ చేశారు. అలాగే QIB (Qualified Institutional Buyers) 0.11 రెట్లు సబ్‌స్క్రిప్షన్ చేశారు. గ్రే మార్కెట్‌లో కూడా అనందితా మెడికేర్ షేర్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. GMP (గ్రే మార్కెట్ ప్రీమియం) రూ. 65 వద్ద ట్రేడవుతోంది. అంటే IPO ధరపై దాదాపు 45% లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ IPO ద్వారా సమీకరించనున్న మూలధనం రూ. 69.50 కోట్లు. ప్రధానంగా ఈ మొత్తాన్ని వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, ఫ్యాక్టరీ విస్తరణ & మూలధన వ్యయం, కొత్త ప్రాజెక్టుల కోసం పెట్టుబడులు, సాధారణ కార్పొరేట్ అవసరాలు వంటి వ్యయాలకు కేటాయించబడతాయని కంపెనీ తెలిపింది. ఈ IPOకి నార్నోలియా ఫైనాన్షియల్ సర్వీసెస్ బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది. రిజిస్ట్రార్‌గా మషిట్ల సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ నియమించబడింది.
ఈ IPOలో షేర్ల కేటాయింపు ఇలా ఉంది:
QIBలు: 22.56 లక్షల షేర్లు (మొత్తం ఇష్యూలో 47 శాతం)
రిటైల్ ఇన్వెస్టర్లు: 15.86 లక్షల షేర్లు (33 శాతం). రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 2వేల షేర్లు కోసం బిడ్ చేయవచ్చు.
NIIలు: 6.81 లక్షల షేర్లు (14.21 శాతం)
క్లుప్తంగా చూసుకున్నట్లయితే.. అనందితా మెడికేర్ IPO కి రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి మంచి డిమాండ్ కనిపిస్తోంది. గ్రే మార్కెట్ ప్రీమియం కూడా ఆకర్షణీయంగా ఉండటంతో.. ఈ SME IPOపై పెట్టుబడిదారుల దృష్టి మరింతగా కేంద్రీకృతమవుతోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications