Jio IPO: జియో ఐపీఓ వచ్చిన వారికి గుడ్ న్యూస్.. గ్రే మార్కెట్‎లో ప్రీమియంలో ట్రేడవుతున్న షేర్లు..!

జియో ప్లాట్‌ఫామ్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) శుక్రవారం భారీ సబ్‌స్క్రిప్షన్‌తో ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టి వచ్చే వారం జరగనున్న ఈ మెగా ఐపీఓ లిస్టింగ్‌పైనే ఉంది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) మద్దతు ఉన్న ఈ ఇష్యూ రికార్డు స్థాయిలో నిధుల సమీకరణ, యాంకర్ ఇన్వెస్టర్ల డిమాండ్ వచ్చింది. బిడ్డింగ్ ప్రారంభమైన కేవలం 100 నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రిప్షన్ సాధించడం వంటి అనేక రికార్డులను బద్దలు కొట్టింది. రిలయన్స్ జియో ఐపీఓ కేటాయింపుల స్థితి వివరాల కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో రిలయన్స్ జియో ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం (GMP)లో ఎలా ఉందో చూద్దాం.

అక్టోబర్ 24, శనివారం సాయంత్రం 5 గంటలకు మీడియా నివేదికల ప్రకారం రిలయన్స్ జియో ఐపీఓ గ్రే మార్కెట్ ప్రిమీయం ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.248గా ఉంది. ఒక్కో షేరుకు రూ.1119గా నిర్ణయించిన అప్పర్ ప్రైస్ బ్యాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, ఈ ఇష్యూ ఒక్కో షేరుకు రూ.1367 (ప్రైస్ బ్యాండ్ మరియు తాజా GMP మొత్తం) వద్ద లిస్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఐపీఓ జీఎంపీ 22.16% లిస్టింగ్ లాభాన్ని సూచిస్తోంది. జీఎంపీ అనేది కేవలం ఊహాగానం మాత్రం. ఇది కచ్చితమైన అంచనా కాదు. రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ 2026 అక్టోబర్ 28న లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో లిస్ట్ కానుంది. రిలయన్స్ జియో ఐపీఓ ఉదయం 10 గంటలకు ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అవుతుంది.

Jio

ఐపీఓ లిస్టింగ్ ప్రక్రియ ఉదయం 9 గంటల నుంచి 9:45 గంటల మధ్య జరిగే ప్రత్యేక ప్రీ-ఓపెన్ సెషన్ (SPOS)తో ప్రారంభమవుతుంది. ఈ ప్రత్యేక సెషన్ ఆర్డర్ ఎంట్రీ, మార్పులు, రద్దుల కోసం తెరవబడుతుంది. దీని తర్వాత ఉదయం 9:45 గంటల నుంచి 9:55 గంటల మధ్య ఆర్డర్ మ్యాచింగ్, ట్రేడ్ నిర్ధారణ, ప్రారంభ ధర నిర్ధారణ సెషన్ జరుగుతుంది. ఆ తర్వాత ఐదు నిమిషాల బఫర్, పరివర్తన కాలం ఉంటుంది. అనంతరం ఉదయం 10 గంటలకు లిస్టింగ్ జరుగుతుంది. జియో ఐపీఓ మూడవ రోజున 22.19 రెట్లు సబ్స్క్రయిబ్ అయింది.

ఇందులో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB) కేటగిరీలో భారీగా 70.55 రెట్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (NII) కేటగిరీలో 14 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో 2.72 రెట్లు, ఉద్యోగుల రిజర్వ్డ్ కోటాలో 2.93 రెట్లు, రిజర్వేషన్ పోర్షన్ వాటాదారులలో 7.60 రెట్లు సబ్స్క్రయిబ్మెంట్ నమోదైంది. ఈ ఐపీఓ (IPO) ధర శ్రేణిని ఒక్కో షేరుకు రూ.1,065 నుంచి రూ.1,119గా నిర్ణయించారు. దరఖాస్తు కోసం లాట్ పరిమాణం 12 షేర్లుగా ఉంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 12 షేర్ల కోసం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీనికి అయ్యే కనీస మొత్తం రూ.13,428. ఈ ఐపీఓలో ఉద్యోగుల కోసం గరిష్టంగా 46,94,836 షేర్లను కేటాయించారు; వీరికి ఒక్కో షేరుపై ₹54.00 రాయితీ (డిస్కౌంట్) లభిస్తుంది. షేర్ల అలాట్ మెంట్ సోమవారం జరగనుంది. ఆ తర్వాత డీ మ్యాట్ ఖాతాలో షేర్లు క్రెడిట్ అవుతాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+