Market Crash: గ్లోబల్ మార్కెట్లపై చిమ్మ చీకట్లు.. అమెరికా మార్కెట్లు నష్టాల్లోనే, సెన్సెక్స్-నిఫ్టీ పరిస్థితి?
Markets Collapsed: గడచిన మూడు రోజులుగా కొంత రికవరీని నమోదు చేసిన భారతీయ స్టాక్ మార్కెట్లలో మళ్లీ కొత్త భయాలు స్టార్ట్ అయ్యాయి. వాస్తవానికి నిన్న అమెరికా స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా నష్టాలను నమోదు చేయటమే దీనికి కారణం. ఈ క్రమంలో డౌజోన్స్, నాస్‌డాక్ సూచీలు పెద్ద క్షీణతను చూశాయి.
వాస్తవానికి అమెరికా మార్కెట్లు ఒక్కసారిగా భారీ క్షీణతను చూడటానికి అసలు కారణం యూఎస్ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించటమే. వాస్తవానికి ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా దాని పనితీరును అక్కడి స్టాక్ మార్కెట్స్ ప్రతిబింబిస్తుంటాయి. అయితే దీనిపై స్పందించిన ట్రంప్ తాను అమెరికా దీర్ఘకాలిక భవిష్యత్తు దృష్ట్యా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల స్వల్పకాలిక ప్రభావాలకు స్టాక్ మార్కెట్లకు ముడిపెట్టొద్దని వల్లడించారు. కానీ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధిస్తున్న సుంకాల ప్రభావం అందరికంటే ముందుగా అమెరికాలోని వినియోగదారులపై ద్రవ్యోల్బణం రూపంలో పడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో అంత్యత శక్తివంతమైన కన్జూమర్ ఎకానమీగా అమెరికా ఉన్న సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం అమెరికాలోని పరిణామాలు ఆర్థిక మాంద్యం దిశగా అడుగులు వేయిస్తున్నాయా అనే అనుమానాలు ప్రజల్లో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అయితే దీనిపై కొందరు నిపుణులు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. కానీ యూరోపియన్ మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్లు మాత్రం అమెరికా స్టాక్ మార్కెట్ల పతనంతో క్షీణతను చూస్తున్నాయి. ప్రధానంగా టాప్ టెక్ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, టెస్లా, మెటా, ఆల్ఫాబెట్ తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనగా వాటి షేర్ల ధరలు 4-11% మధ్య పడిపోయాయి. మెుత్తానికి అమెరికా మార్కెట్లు దాదాపు 4 ట్రిలియన్ డాలర్ల మేర విలువను ఒక్కరోజులో కోల్పోయాయి.
ఇదే క్రమంలో ప్రపంచ కుబేరుల్లో మెుదటి స్థానంలో నిలిచిన ఎలాన్ మస్క్ సీఈవోగా వ్యవహరిస్తున్న టెస్లా స్టాక్ పతనం కారణంగా 125 బిలియన్ డాలర్ల మేర కంపెనీ విలువ ఆవిరైంది. ఇదే క్రమంలో ఆపిల్, ఎన్వీడియా కంపెనీల షేర్లు ఒక్కోటి 5 శాతం మేర పతనాన్ని నమోదు చేశాయి. దీంతో ప్రస్తుతం మార్కెట్ విశ్లేషకులతో పాటు పెట్టుబడిదారులు రానున్న ద్రవ్యోల్బణం డేటా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఫెడ్ చైర్మన్ పావెల్ వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూస్తే ఒక క్లారిటీ వస్తుందని వారు భావిస్తున్నారు. కొనసాగుతున్న ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల మధ్య మార్కెట్ దిశను నిర్ణయించడంలో రాబోయే వారాలు కీలకంగా కానున్నాయి.
ఇకపోతే భారతీయ స్టాక్ మార్కెట్లు సైతం నేడు తమ ప్రయాణాన్ని నష్టాల్లోనే మెుదలుపెట్టి కొనసాగిస్తున్నాయి. బెంచ్ మార్క్ సూచీలను పరిశీలిస్తే.. సెన్సెక్స్ 322 పాయింట్ల పతనంలో ఉండగా, నిఫ్టీ 88 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 309 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 367 పాయింట్ల మేర నష్టంతో ఉదయం 9.40 గంటల సమయంలో కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications