Sensex Crash: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు అనూహ్యంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఇంట్రాడేలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1000 పాయింట్ల మేర పతనాన్ని చూసిన సంగతి తెలిసిందే. ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఈ పరిస్థితులతో గందరగోళానికి గురవుతున్నారు.
వాస్తవానికి నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు పతనం కావటంతో పెట్టుబడిదారుల సంపద రూ.5 లక్షల కోట్లకు పైగా హరించుకుపోయింది. దీంతో మార్కెట్లో లిస్టెడ్ కంపెనీలు మార్కెట్ క్యాప్ దాదాపు రూ.425 కోట్లకు తగ్గింది. నేడు మార్కెట్లలో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి పెరిగిపోవటానికి కారణం పెట్టుబడిదారులు అప్రమత్తం కావటమైనని తెలుస్తోంది. అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ పొరుగు దేశాలపై వాణిజ్య పన్నులకు సంబంధించిన ప్రకటనలతో మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఈ క్రమంలో బీఎస్ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు దాదాపు 2 శాతం మేర పతనాన్ని నమోదు చేశాయి.

అకస్మాత్తుగా భారతీయ ఈక్విటీ మార్కెట్లలో నమోదైన అమ్మకాలతో పెట్టుబడిదారుల సంపద రూ.5 లక్షల కోట్ల మేర కరిగిపోయింది. అయితే మార్కెట్ల భారీ పతనానికి కారణమైన 5 ప్రధాన అంశాలను పరిశీలిస్తే..
* ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానం చుట్టూ అలుముకున్న అనిశ్చితులు మార్కెట్లలో పెట్టుబడిదారులను అప్రమత్తం చేస్తున్నాయి. పొరుగున ఉన్న కెనడా, మెక్సికోలపై పన్ను టారిఫ్ ల గురించి కూడా ట్రంప్ తన ప్రకటనలో వెల్లడించారు. అలాగే భారత్ సహా మరికొన్ని దేశాలకు ఇదే క్రమంలో పన్నులు పెంచుతానని, తీరుమార్చుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రధానంగా ఈ నిర్ణయాలు భారతీయ ఐటీ పరిశ్రమపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చని తెలుస్తోంది. ట్రంప్ 2.0 ప్రపంచ దేశాలను వణికిస్తోంది.
* ఇదే క్రమంలో ఫిబ్రవరి 1, 2025న కేంద్ర ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ కూడా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ ప్రసంగం కోసం ఆసక్తిగా పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. నిర్మలమ్మ ఏఏ రంగాలకు ఎలాంటి కేటాయింపులు చేస్తారోనని వేచి చూస్తున్నారు. ప్రధానంగా గ్రామీణ రంగంతో పాటు దేశంలో వినియోగాన్ని పెంచటానికి ప్రభుత్వం ఫోకస్ కొనసాగించవచ్చని తెలుస్తోంది. కేటాయింపులు నిరాశ కలిగిస్తే మార్కెట్ సెంటిమెంట్లు ప్రతికూలంగా ప్రభావితం కావొచ్చు.
* విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు భారతీయ మార్కెట్లలో తమ ఇన్వెస్ట్మెంట్లను విక్రయిస్తున్నారు. అమెరికన్ డాలర్ బలంగా ఉండటంతో పాటు బాండ్ ఈల్డ్స్ పెరుగుదల పెట్టుబడుల విక్రయించేలా ప్రేరేపిస్తోందని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో జనవరి 1 నుంచి 20 వరకు పెట్టుబడిదారులు దాదాపు రూ.51,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకోవటం మార్కెట్లలో అస్థిరతను పెంచుతోంది.
* ఇదే క్రమంలో ప్రస్తుతం దేశంలోని లిస్టెడ్ కంపెనీలు తమ మూడవ త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మార్కెట్ అంచనాలను కంపెనీలు అందుకోవటంలో మిస్ కావటంతో పెట్టుబడిదారులు నిరాశకు గురవుతున్నారు. మెుదటి త్రైమాసికం నుంచి ఇప్పటి వరకు ఫలితాలు నిరాశాజనకంగానే ఉండటం మార్కెట్లలో సెంటిమెంట్లను దెబ్బతీశాయని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించటంతో వృద్ధి రేటు కూడా తగ్గిందని వారు అంటున్నారు.
* చివరిగా మ్యాక్రో ఎకానమీ స్థాయిలో పరిస్థితులు దిగజారటం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్లను ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం భారతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్నట్లు సంకేతాలను అందించటం మార్కెట్ పెట్టుబడిదారులను అప్రమత్తం చేస్తోంది. ప్రభుత్వ క్యాపెక్స్ కూడా తగ్గుతుండటంతో ఉపాధి అవకాశాలను కూడా ప్రభావితం చేస్తోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications