Market Fall: వాస్తవానికి ఈరోజు ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. కానీ కొన్ని గంటల్లోనే మార్కెట్లు తిరిగి యూటర్న్ తీసుకుని నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలో మధ్యాహ్నం 11 గంటలకు దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ నుంచి నిఫ్టీ మిడ్ క్యాప్ వరకు అన్నీ నష్టాలతో తమ ప్రయాణాన్ని కొనసాగించటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ప్రస్తుతం ఇన్వెస్టర్లు తమ ప్రయాణాన్ని కొనసాగించాలా లేక స్వస్తి పలకాలా అనే అయోమయంలో ఉన్నారు.
ఒక్కసారి మార్కెట్లు మెగా ర్యాలీలో ఉన్న రోజులకు వెళితే సెప్టెంబర్ 26, 2024న మార్కెట్ సూచీలు తమ జీవితకాల గరిష్ఠాలను తాకిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సెన్సెక్స్ సూచీ 13 వేల పాయింట్ల వరకు కరెక్షన్ కి గురికాగా.. నిఫ్టీ సూచీ 4200 పాయింట్ల వరకు పతనాన్ని చూసింది. ఇది చాలా పెద్ద క్షీణతగా చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ ఏకంగా 6000 పాయింట్లకు పైగా పతనాన్ని నమోదు చేసింది.

ప్రధానంగా బీఎస్ఈ మిడ్-క్యాప్ ఇండెక్స్ దాని రికార్డు గరిష్ట స్థాయి నుంచి ఏకంగా 22 శాతానికి పైగా పడిపోవటం ఆందోళనలు సృష్టిస్తోంది. ఇదే క్రమంలో స్మాల్ క్యాప్ సూచీ కూడా దాని గరిష్ఠాల నుంచి ఏకంగా 25 శాతానికి పైగా పతనంతో ఉండటంతో ప్రధానంగా మార్కెట్లో అమ్మకాల ఒత్తిడిని పెంచుతోందని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు భారీ లాభాలతో పెట్టుబడిదారులను ఆకట్టుకున్న ఈ రెండు కేటగిరీలు ప్రస్తుతం తమ గడ్డు కాలాన్ని చూస్తున్నాయి.
గత ఐదు నెలల్లో భారతీయ ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడిదారులు దాదాపు రూ.94 లక్షల కోట్లు కోల్పోవటంతో ప్రస్తుతం చాలా మంది మార్కెట్లలో పెట్టుబడులకు దూరంగా ఉండా లేక డిస్కౌంట్ షాపింగ్ చేయటం ద్వారా పడిపోతున్న ప్రస్తుత ధరల వద్ద మరిన్ని కొనుగోళ్లు చేపట్టాలా అనే గందరగోళంలో ఉన్నారు.
ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్‌లో రక్తపాతం కొనసాగుతుండగా.. ఇన్వెస్టర్లకు ఓలటైల్ మార్కెట్లలో ఇంట్రాడే ట్రేడింగ్ అనుకూలంగా ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో పెట్టుబడిదారులు తమ వ్యూహాలను మార్చుకుంటూ పెట్టుబడిదారుడిగా మారి డబ్బు ఆదా చేసుకునే సమయం ఆసన్నమైందని గుర్తించాలి. మార్కెట్ బుల్ ట్రెండ్ లేదా బేర్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు ట్రేడింగ్ చేయాలని నిపుణులు చెబుతుంటారు. అస్థిర మార్కెట్‌లో ఏదైనా పొజిషన్ తీసుకున్న తర్వాత నగదులో పెట్టుబడి పెట్టాలి. బలమైన స్టాప్ లాస్‌ను కొనసాగించాలని కూడా పెట్టుబడిదారులు భావిస్తున్నారు.
ప్రస్తుత స్టాక్ మార్కెట్ పతనాన్ని సద్వినియోగం చేసుకోవాలని దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఖరీదైన మంచి స్టాక్స్ ప్రస్తుతం తక్కువ ధరల వద్ద మార్కెట్లో అందుబాటులో ఉంటాయని స్టాక్స్‌బాక్స్ పరిశోధన విశ్లేషకురాలు అకృతి మెహ్రోత్రా అన్నారు. గడచిన కొన్ని ట్రేడింగ్ సెషన్లలో మార్కెట్ తీవ్ర పతనాన్ని చూసింది, ఇది ఈక్విటీ మార్కెట్లలో వాటాను పెంచడానికి సరైన అవకాశాన్ని అందిస్తుంది. అయితే స్టాక్స్ లో ఎంట్రీ ఇవ్వటానికి ముందు పెట్టుబడిదారులు సంభావ్య నష్టాలను నిశితంగా పరిశీలించాలి, తమ పెట్టుబడి సలహాదారుల వద్ద సంప్రదించటం ఉత్తమం. మెుత్తానికి పడిపోతున్న మార్కెట్లను ఇన్వెస్టర్లు ఎలా ఉపయోగించుకుంటారనేది వారి అనుభవంపై ఆధారపడి ఉంటుంది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications