Economic Survey 2025: బుల్ జోరులో సెన్సెక్స్-నిఫ్టీ.. నేడు లాభపడిన రంగాలివే, 2030 టార్గెట్ అదే..
Stock Market: నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎకనామిక్ సర్వే ప్రసంగంతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా లాభపడ్డాయి. ప్రధానంగా బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు భారీ పెరుగుదలను చూశాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ల సంపద ఒక్కరోజులోనే రూ.4.23 లక్షల కోట్ల మేర పెరుగుదలను నమోదు చేసింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో భారత్ ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అంచనా వేసింది.
నేడు ఎకనమిక్ సర్వే ప్రకటన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలోని కొన్ని రంగాలు భారీగా కొనుగోళ్లను చూశాయి. ప్రధానంగా కన్జూమర్ డ్యూరబుల్స్, ఆటో రంగాలకు చెందిన స్టాక్ నేడు భారీగా ర్యాలీని చూశాయి. బీఎస్ఈ క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆటో షేర్లు రంగాల వారీగా అత్యధికంగా లాభపడ్డాయి, సూచీలు వరుసగా 2311 పాయింట్లు, 1520 పాయింట్లు, 896 పాయింట్లు లాభపడ్డాయి.

ప్రపంచ ఆర్థిక ర్యాంకింగ్స్‌లో భారత్ అనూహ్యంగా పెరగటం వెనుక ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2024-25 ఆర్థిక సర్వే జరుగుతున్న ఒక పెద్ద పరివర్తనను హైలైట్ చేస్తుంది. కేవలం దశాబ్ధకాలంలోనే ఇండియా యూకేను వెనక్కు నెట్టి నాల్గవ స్థానానికి ఎగబాకింది. అయితే 2030 నాటికి భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నట్లు తెలుస్తోంది. అంటే అమెరికా, చైనా తర్వాతి స్థానం కోసం దేశం ప్రస్తుతం ప్రయత్నిస్తోంది.
ఎకనమిక్ సర్వేలో భారతీయుల సగటు వయస్సు 28 ఏళ్లతో అత్యంత ఎక్కువ సంఖ్యలో యువత ఉన్న దేశంగా వెల్లడించబడింది. భారతీయ యువత సంఖ్య ప్రపంచ వృద్ధిలో కీలక పాత్ర పోషించే దేశంగా నిలిపింది. ఈ విస్తరణకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయని ఆర్థిక సర్వే వెల్లడించింది. ఈ క్రమంలో దేశంలో డిపెండెన్సీ రేషియో కూడా భారీగా తగ్గుతూపోతోంది. 2011లో 64.6 శాతం నుంచి 2021 నాటికి 55.7 శాతానికి తగ్గింది. అయితే ఇది 2026 నాటికి 54.3 శాతానికి చేరుకుంటుందని అంచనా వేయబడింది.
భారత్ తన యువ జనాభా ప్రయోజనాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలంటే కొన్ని అంశాలపై ఫోకస్ చేయాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా తయారీ, సేవలు, సాంకేతికత వంటి కీలక రంగాల్లో ఉద్యోగ సృష్టి అవసరమని వారు చెబుతున్నారు. అలాగే పెరుగుతున్న పరిశ్రమ అవసరాలు, డిమాండ్లకు అనుగుణంగా యువతకు నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు కార్యక్రమాలు అవసరమని వారు సూచిస్తున్నారు. పట్టణీకరణతో పాటు పారిశ్రామిక విస్తరణకు మద్దతుగా మౌలిక సదుపాయాల వృద్ధి చేయాలన్నారు. యువ భారతీయులను భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న నైపుణ్యంతో సన్నద్ధం చేయడానికి విద్యా వ్యవస్థలో సంస్కరణలు అవసరమని వారు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications