Chinese stocks: ట్రంప్ తీసుకుంటున్న దూకుడు వాణిజ్య నిర్ణయాలు ఒకపక్క ప్రపంచ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధానంగా భారతీయ స్టాక్ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. గీతదాటితే ఇండియాపై కూడా సుంకాల విషయంలో తగ్గేదే లే అని ట్రంప్ తేల్చి చెప్పటం వ్యాపార వర్గాలను, ఇన్వెస్టర్లను ఆందోళకు గురిచేస్తోంది.
ఈ క్రమంలో భారతీయ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు కుప్పకూలటంతో పాటు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు కూడా భారీగా నష్టాలను చూస్తున్నాయి. బ్యాంకింగ్, ఐటీ రంగాలకు చెందిన లిస్టెడ్ కంపెనీలు రక్తపాతాన్ని చూస్తున్నాయి. కానీ.. మరో పక్క చైనా స్టాక్ మార్కెట్లు మాత్రం ట్రంప్ ప్రకటనలతో భారీగా దూసుకుపోతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ మొదటి రోజు నుంచి సుంకాలను పెంచిన తరువాత, చైనీస్ ఆస్తుల్లో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు ఉపశమనం పొందారు. అయితే ప్రపంచ మార్కెట్లు మాత్రం భారీ ఒత్తిడికి లోనవటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ముందుకు సాగుతున్నారు.

ఫిబ్రవరి 1, 2025 నాటికి మెక్సికో, కెనడాలపై 25 శాతం చొప్పున సుంకాలు విధిస్తామని తొలిరోజే ట్రంప్ బెదిరించారు. ఈ క్రమంలో తన ప్రత్యర్థిక అయిన చైనాపై తక్షణం ఎలాంటి ప్రకటన చేయకపోవటంతో చైనా స్టాక్ మార్కెట్లు బుల్ జోరును కొనసాగిస్తున్నాయి. అలాగే చైనాపై అదనపు సుంకాల విషయంలో అడిగిన ప్రశ్నలకు ట్రంప్ సమాధానం చెప్పకుండా దాటవేయటం చూస్తే ఇప్పట్లో చైనాపై ప్రత్యక్ష ప్రభావం ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో హాంగ్ సెంగ్ చైనా ఎంటర్‌ప్రైజెస్ ఇండెక్స్ 1.3 శాతం పెరుగుదలను చూసింది. అలాగే CSI 300 ఇండెక్స్ 0.4% లాభపడింది.
ఈ పరిణామాలతో ఆసియా మార్కెట్లలో అత్యధికంగా చైనీస్ స్టాక్స్ లాభపడ్డాయి. చాలా కాలంగా ట్రంప్ హిట్ లిస్టులో చైనా కూడా సుంకాల పెంపుకు గురవుతుందనే ఊహాగానాలకు తెరపడటంతో ప్రస్తుతం రిలీఫ్ ర్యాలీ కొనసాగుతోందని నిపుణులు చెబుతున్నారు. పెరిగిన భయాల మధ్య MSCI చైనా ఇండెక్స్ జనవరి ప్రారంభంలో బేర్ మార్కెట్‌లోకి జారుకుంది. కరెన్సీని పెంచడానికి సెంట్రల్ బ్యాంక్ ప్రయత్నాలు చేసినప్పటికీ ఆఫ్‌షోర్ యువాన్ రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయిలకు పడిపోయింది. డాలర్ బలపడటం కూడా దీనికొక కారణంగా ఉంది.
అయితే భవిష్యత్తులో చైనాపై 60 శాతం సుంకాల ముప్పు ఉంటుందని తాము ఇప్పటికీ నమ్ముతున్నట్లు మిజుహో సెక్యూరిటీస్ ఆసియా లిమిటెడ్ ఆర్థికవేత్త సెరెనా జౌ పేర్కొన్నారు. రానున్న కొన్ని వారాల్లో చైనాపై కీలక ప్రకటనలు ఉండవచ్చని ఆయన భావిస్తున్నారు. అయితే తాజా సుంకాల చర్యలతో కెనడా, మెక్సికో కరెన్సీలు 1.4 శాతం వరకు క్షీణతను చూశాయి. గతవారం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ ఆశలు పెంచుతోంది. చైనాకు ఇలాంటి సుంకాల పెంపులు కొత్తేమీ కానప్పటికీ.. చైనా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం చాలా బలహీనంగా ఉంది. ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది. క్లారిటీ కోసం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందేనని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
More From GoodReturns

యుద్దంపై ఇరాన్ కీలక ప్రకటన.. భారీ సైనిక దాడులు చేస్తామంటున్న ట్రంప్.. అసలేం జరుగుతోంది..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications