A Oneindia Venture

భారతీయ బ్యాంకులకు గట్టి పోటీనిస్తున్న Amazon, Flipkartలు! ఎలాగంటే..

భారతదేశంలో ఇ-కామర్స్ (E-commerce) దిగ్గజాలైన Amazon, Flipkart ఇప్పుడు తమ దృష్టిని లోన్స్ పై కేంద్రీకరించాయి. కస్టమర్‌లకు, చిన్న వ్యాపారాలకు కొత్త consumer loan (వినియోగదారు రుణాలు) అందించడం ద్వారా దేశంలోని సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థకు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ కొత్త ముందడుగు భారతీయ ఆర్థిక మార్కెట్‌లో ఎలాంటి మార్పులు తేనుందో తెలుసుకుందాం.

consumer loan

Amazon ఇటీవలే బెంగళూరుకు చెందిన నాన్-బ్యాంక్ లెండర్ అయిన యాక్సియో (Axio) ను కొనుగోలు చేసింది. ఇదివరకు బై-నౌ-పే-లేటర్ (Buy-Now-Pay-Later ) అలాగే వ్యక్తిగత రుణాలపై (Personal Loans) దృష్టి సారించిన యాక్సియో, ఇప్పుడు చిన్న వ్యాపారాలకు క్రెడిట్ సదుపాయాలు అందిస్తోంది. Amazon పేమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర నేరూర్కర్ అభిప్రాయం ప్రకారం.. భారతదేశంలో ముఖ్యంగా పట్టణాల్లోని చిన్న వ్యాపారాలలో మంచి పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి. అమేజాన్ ఇప్పుడు వీటిపై ఫోకస్ పెడుతోంది. ఇది బ్యాంకింగ్ రంగానికి ఒక గట్టి పోటీగా మారుతోంది.

Flipkart ఫైనాన్స్

వాల్‌మార్ట్‌కు చెందిన Flipkart కూడా ఆర్థిక సేవల్లో తన అడుగులు వేస్తోంది. మార్చిలో 'Flipkart ఫైనాన్స్' పేరుతో తమ నాన్-బ్యాంక్ లెండింగ్ విభాగాన్ని నమోదు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తుది ఆమోదం కోసం ఎదురుచూస్తున్న Flipkart.. ప్రధానంగా రెండు రకాల 'పే-లేటర్' ఆఫర్‌లను అందించడానికి సిద్ధంగా ఉంది. ఒకటి నో-కాస్ట్ ఈఎంఐలు.. అంటే ఆన్‌లైన్ షాపర్‌ల కోసం 3 నుండి 24 నెలల వరకు వడ్డీ లేని నెలవారీ వాయిదాల రుణాలు. రెండోది కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్‌లు (Consumer Durable Loans). టీవీలు, ఫ్రిజ్‌లు వంటి వినియోగదారు వస్తువుల కొనుగోలుకు 18% - 26% వార్షిక వడ్డీ రేట్లతో consumer loan ఆఫర్‌లు. సాంప్రదాయ బ్యాంకుల వడ్డీ రేట్లతో పోలిస్తే ఇది కొంత పోటీని ఇచ్చే అవకాశం ఉంది.

ఆర్థిక మార్కెట్‌పై ప్రభావం

భారతదేశంలో consumer loan మార్కెట్ మార్చి 2020లో సుమారు 80 బిలియన్ల డాలర్ల నుండి మార్చి 2025 నాటికి 212 బిలియన్ల డాలర్లకు పెరిగింది. Amazon, Flipkart వంటి సంస్థలు తమ ప్లాట్‌ఫారమ్‌లలో ఉన్న కోట్లాది మంది కస్టమర్ల కొనుగోలు, చెల్లింపుల డేటాను కలిగి ఉండటం ఒక పెద్ద బలం. ఈ డేటా ఆధారంగా వారికి సులభంగా, వేగంగా మరియు తగిన consumer loan లను అందించే అవకాశం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ సంస్థలు మార్కెట్‌లో పెద్ద ప్రభావం చూపగలవు. అయితే వారి ప్రధాన వ్యాపారం రిటైల్ నుండి ఫైనాన్స్‌కు మారడం అనేది సవాలుతో కూడుకున్నది.

కేవలం లోన్స్ మాత్రమే కాదు

Amazon రుణాలతో పాటు. తమ Amazon Pay ప్లాట్‌ఫారమ్‌లోని కస్టమర్‌లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed Deposit) స్కీమ్స్ ను కూడా అందిస్తోంది. ఇది వారి ఆర్థిక సేవలను విస్తరించే దీర్ఘకాలిక వ్యూహంలో భాగం.

కొత్త పోటీ..

ఏదేమైనా Amazon ,Flipkart లు ఈ కొత్త consumer loan ఆఫర్‌ల ద్వారా ఫైనాన్షియల్ రంగంలోకి అడుగుపెట్టడం కస్టమర్లకు మంచి అవకాశాలను అందించడమే కాకుండా.. దేశీయ బ్యాంకింగ్ రంగాలలో కొత్త పోటీకి నాంది పలకనుంది. భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఇదొక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+