Amanta Healthcare IPO: గుజరాత్ ఫార్మాస్యూటికల్ రంగానికి చెందిన అమంత హెల్త్‌కేర్ కంపెనీ IPO (Initial Public Offering) సెప్టెంబర్ 1, 2025న పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమైంది. ఈ IPO ద్వారా కంపెనీ మొత్తం రూ. 126 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ధరల శ్రేణి విషయానికి వస్తే.. ఒక్కో షేరుకు రూ. 120 నుంచి రూ. 126 వరకు నిర్ణయించబడింది. మొత్తం 1 కోటి (10 మిలియన్) ఈక్విటీ షేర్లు జారీ చేయబడ్డాయి. ఇందులో Offer for Sale (OFS) లేదు. అంటే మొత్తం నిధులు కంపెనీ విస్తరణకే ఉపయోగించబడతాయి.
అహ్మదాబాద్‌కు చెందిన ఈ కంపెనీ స్టెరైల్ లిక్విడ్ ఉత్పత్తులు, వైద్య పరికరాలను తయారు చేస్తుంది.గత వారం, దాని గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) 17 శాతంగా ఉంది. నేడు అది 22.22 శాతానికి పెరిగింది. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో.. అన్‌లిస్టెడ్ మార్కెట్లో అమంటా హెల్త్‌కేర్ షేర్లు రూ. 154 వద్ద ట్రేడవుతున్నాయి. అంటే ఎగువ ధర బ్యాండ్ అయిన రూ. 126 కంటే రూ. 28 అధికంగా (22.2% ప్రీమియం) ఉన్నాయి. ఇది లిస్టింగ్ రోజున మంచి లాభం వచ్చే అవకాశాన్ని సూచిస్తుంది.బిడ్డింగ్ ముగింపు తేదీ సెప్టెంబర్ 3, 2025గా నిర్ణయించారు. లాట్ సైజు కనీసం 119 షేర్లుగా నిర్ణయించారు. రిటైల్ పెట్టుబడిదారుడి కనీస పెట్టుబడి రూ. 14,994గా ఉంది.

ఈ IPO ద్వారా వచ్చిన నిధులను కంపెనీ ముఖ్యంగా క్రింది అవసరాలకు వినియోగించుకోనుంది. గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో కొత్త స్టెరైల్ ఇంజెక్షన్ (Sterile Parenteral) తయారీ లైన్ ఏర్పాటు చేయనుంది. అలాగే ప్లాంట్, యంత్రాలు, సివిల్ కన్‌స్ట్రక్షన్ పనులు, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించుకోనుంది. ఇది కంపెనీకి కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి, ప్రస్తుత కస్టమర్లతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి, ఉత్పత్తి శ్రేణిని విస్తరించడానికి సహాయపడనుంది.
IPO ప్రారంభానికి ముందు.. ఆగస్టు 29న కంపెనీ రూ. 37.8 కోట్లు యాంకర్ బుక్ ద్వారా సేకరించింది. ఒక్కో షేరును రూ. 126 వద్ద 6 సంస్థాగత పెట్టుబడిదారులు కొనుగోలు చేశారు. వీరిలో బంధన్ మ్యూచువల్ ఫండ్, సంషి ఫండ్, H2W రైజింగ్ ఫండ్, ఆర్త్ గ్రోత్ ఫండ్, సన్‌రైజ్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్, ఫినావెన్యూ క్యాపిటల్ ట్రస్ట్ ఉన్నాయి. కంపెనీ IPO ధర FY25 అంచనా P/E 46.6x వద్ద ఉందని, ఇది పూర్తిగా ధరకే ఉన్న IPO అని పేర్కొంది. అయితే దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు బలంగా ఉన్నందున సబ్‌స్క్రైబ్ - దీర్ఘకాలికం అని సిఫార్సు చేసింది.
ఇక అరిహంత్ క్యాపిటల్ దీనిపై స్పందించింది. విస్తరణ ప్రణాళికలు, ఉత్పత్తి డిమాండ్ పాజిటివ్‌గా ఉన్నప్పటికీ, సామర్థ్య విస్తరణ, నియంత్రణ అనుమతులు, పోటీ వంటి సవాళ్లు ఉన్నాయని తెలిపింది. కాబట్టి రిస్క్ తీసుకునే పెట్టుబడిదారులు లిస్టింగ్ గైన్స్ కోసం అప్లై చేయవచ్చు. స్థిరమైన రాబడి కోరుకునే వారు దీర్ఘకాలిక పెట్టుబడిగా మాత్రమే ఆలోచించాలని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

ఆర్బీఐ నిర్ణయం.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు భారీ షాకా?

Stock market: సెన్సెక్స్ పతనం.. కానీ రికవరీ మొదలైందా? నేటి మార్కెట్ టాప్ విన్నర్స్ వీరే!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications