భారీగా క్రాష్ అయిన స్టాక్.. ఐదు సెషన్లలో 21 శాతం డౌన్..
ముఖేష్ అంబానీ మద్దతు ఉన్న అలోక్ ఇండస్ట్రీస్ షేర్ ధర శుక్రవారం 11.51% మేర భారీగా పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి షేరుకు రూ.9.16 వద్ద సరికొత్త 52-వారాల కనిష్ట స్థాయిని తాకింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లుగా ఈ టెక్స్‌టైల్ కంపెనీ షేరు ఒత్తిడిని ఎదుర్కొంటోంది. గద ఐదు ట్రేడింగ్ సెషన్లలో 21 శాతం కంటే ఎక్కువగా పడిపోయింది. ఆగస్టు 28న NSEలో అలోక్ ఇండస్ట్రీస్ షేర్ ధర రూ.20.22 వద్ద ప్రారంభమై రూ.9.24 వద్ద ముగిసింది. ఈ భారీ పతనానికి ఖచ్చితమైన కారణం స్పష్టంగా తెలియకపోయినప్పటికీ, ఆగస్టు చివరి వారంలో ఈ షేరు వరుసగా నష్టాలను చవిచూసింది. శుక్రవారం మరింత తీవ్రమైన పతనాన్ని చూడటానికి ముందు, అలోక్ ఇండస్ట్రీస్ వరుస ట్రేడింగ్ సెషన్లలో తన 52-వారాల కనిష్ట స్థాయిని దాటి కిందకు పడిపోయింది.
అదే కాలంలో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్పంగా మాత్రమే తగ్గుముఖం పట్టడం వల్ల, ఈ పతనం విస్తృత మార్కెట్ అమ్మకాలలో భాగం కాకుండా కేవలం ఈ షేరుకు మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తోంది.
స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఒక నివేదికలో ఇటీవలి కాలంలో కంపెనీ షేర్ల ట్రేడింగ్ పరిమాణంలో గణనీయమైన పెరుగుదల ఉన్నట్లు అలోక్ ఇండస్ట్రీస్ తెలియజేసింది. దీనిపై కంపెనీ స్పష్టతనిస్తూ, లిస్టింగ్ నిబంధనల ప్రకారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు ప్రకటించాల్సిన సమాచారం ఏదీ ఇంకా ప్రకటించకుండా మిగిలిపోలేదని పేర్కొంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఉన్న రూ.171.56 కోట్ల నష్టంతో పోలిస్తే, కంపెనీ ఏకీకృత నికర నష్టం రూ.138.25 కోట్లకు తగ్గింది.

కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం ఏడాది ప్రాతిపదికన సంవత్సరం ప్రతిపాదికన 6.5శాతం పెరిగి రూ.993.11 కోట్లకు చేరగా, మొత్తం వ్యయాలు 1.49% స్వల్ప వృద్ధితో ₹1,153.45 కోట్లకు పెరిగాయి. అయితే, వినియోగించిన ముడిసరుకు ఖర్చు ఏడాది ప్రాతిపదికన దాదాపు 18 శాతం పెరిగి రూ.538.86 కోట్లకు చేరింది. స్టాండ్‌అలోన్ (ప్రత్యేక) ప్రాతిపదికన చూస్తే, కంపెనీ నికర నష్టం ఏడాది క్రితం ఉన్న రూ.176.48 కోట్ల నుంచి రూ.136.20 కోట్లకు తగ్గింది. కార్యకలాపాల ద్వారా వచ్చే స్టాండ్‌అలోన్ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 5.81 శాతం పెరిగి రూ.935.94 కోట్లకు చేరింది.
మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉన్న నేపథ్యంలో అలోక్ ఇండస్ట్రీస్ షేర్ ధర ప్రతికూల ధోరణిని కొనసాగిస్తోంది. టెక్స్‌టైల్ స్టాక్ ఒక నెలలో 22.57 శాతం, సంవత్సరం ప్రారంభం నుంచి (YTD) 43% క్షీణించింది. అంతేకాకుండా టెక్స్‌టైల్ స్టాక్ ఒక సంవత్సరంలో 47 శాతం, మూడు సంవత్సరాలలో 48 శాతం, ఐదు సంవత్సరాలలో 58 శాతం పడిపోయింది. అలోక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది కాటన్, పాలిస్టర్ దుస్తువులు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. నవీ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీలో ఉన్న ఈ కంపెనీ, ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ కింద పనిచేస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications