Yes Bank షేర్లపై బ్రోకరేజీల తాజా రేటింగ్.. నేడు పెరిగిన స్టాక్ ఉంచుకోవాలా? అమ్మాలా?
Yes Bank Stock: దేశీయ స్టాక్ మార్కెట్లో తక్కువ షేరు ధర ఉండే కంపెనీలపై ఎల్లప్పుడూ ఇన్వెస్టర్ల గురి ఉంటూనే ఉంటుంది. చాలా మంది అందుకే పెన్నీ స్టాక్స్, స్మాల్ అండ్ మీడియం కేటగిరీలోని తక్కువ ధరలు ఉంటే షేర్లపై బెట్టింగ్ వేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాంటి వారి పోర్ట్ ఫోలియోలో ఎల్లప్పుడూ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యెస్ బ్యాంక్ షేర్లకు చోటు ఉంటూనే ఉంటుంది. ఒకప్పుడు వెలుగు వెలిగిన ఈ బ్యాంకింగ్ సంస్థ తర్వాతి కాలంలో అంతర్గత యాజమాన్య సమస్యలతో కళను కోల్పోయిన సంగతి తెలిసిందే.
కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్, JM ఫైనాన్షియల్‌తో సహా కొన్ని బ్రోకరేజీలు తమ కాన్ఫరెన్స్‌ల్లో బ్యాంకులకు ఆతిథ్యం ఇవ్వగా వాటిలో యెస్ బ్యాంక్ కూడా ఉంది. అనేక ప్యారామీటర్లలో కంపెనీ తన పనితీరును మెరుగుపరుచుకుంది. ఈ క్రమంలో బ్యాంక్ తక్కువ-రేటింగ్, అధిక-దిగుబడిని ఇచ్చే కార్పొరేట్ రుణాలను పూర్తిగా తొలగించినట్లు వెల్లడైంది. ఇదే క్రమంలో అన్‍సెక్యూర్డ్ రిటైల్ రుణాల పెంపును కొనసాగించలేదని యెస్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ కోటక్‌కి వెల్లడించింది. ఇదే క్రమంలో యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, MFI, వ్యక్తిగత రుణాల నిష్పత్తి మార్కెట్లోని ఇతర పోటీదారులతో పోలిస్తే గణనీయంగా తక్కువగా ఉన్నట్లు వెల్లడించబడింది. ఇదే క్రమంలో డిపాజిట్లు గతంలో ఉన్న రూ.1.7 లక్షల కోట్ల నుంచి రూ.2.7 లక్షల కోట్లకు చేరుకోవటం పెద్ద బలంగా చెప్పుకోవచ్చు.

కంపెనీ తన ఆదాయాలను పెంచుకోవటానికి ప్రధానంగా రెండు మార్గాలను వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. ముందుగా లోన్ మిక్స్ మార్చటంతో పాటు రేట్లను పెంచటం కంపెనీకి ఆర్థిక బలాన్ని అందిస్తున్నాయి. బ్యాంక్ ప్రస్తుతం 0.5 శాతం నుండి 1 శాతం వరకు ఆస్తిపై రాబడిని క్రమంగా పెంచుతుందని JM ఫైనాన్షియల్ పేర్కొంది. అసెట్ మిక్స్‌ను మార్చడం ద్వారా మార్జిన్‌లను మెరుగుపరుస్తూ.. కార్పొరేట్ లెండింగ్ బుక్ తగ్గిస్తున్నట్లు వెల్లడైంది. మొత్తం రూ.లక్ష కోట్ల బ్యాలెన్స్ షీట్‌లో, ఆర్‌ఐడీఎఫ్ డిపాజిట్లు రూ.44,000 కోట్లుగా ఉన్నాయి. ఇది కంపెనీ మెుత్తం ఆస్తుల్లో దాదాపు 11 శాతంగా ఉంది.
బ్రోకరేజీల తాజా టార్గెట్ ధరలు ఇవే..
నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో యెస్ బ్యాంక్ స్టాక్ 5 శాతానికి పైగా లాభపడి చివరికి ఒక్కోటి రూ.20.14 వద్ద ఎన్ఎస్ఈలో స్థిరపడింది. ఇదే క్రమంలో ఇంట్రాడేలో కంపెనీ షేర్లు గరిష్ఠంగా రూ.20.63 వద్దకు చేరుకున్నాయి. ప్రస్తుతం స్టాక్ తన 52 వారాల కనిష్ఠ ధరకు అతిచేరువలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. దాదాపు రెండు వారాలుగా కొనసాగిన బేర్ మార్కెట్లో కంపెనీ షేర్లు కరెక్షన్ చూశాయి. అయితే ప్రస్తుతం యెస్ బ్యాంక్ షేర్లపై ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు కోటక్, జేఎం ఫైనాన్షియల్ సెల్ రేటింగ్ కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications