AKI India Shares: 5 రోజుల కిందట కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలకమైన బడ్జెట్ ప్రసంగాన్ని చేశారు. ఈ క్రమంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి అనేక రంగాలకు ఎలాంటి ప్రయోజనాలను కల్పిస్తున్నారో అందులో ప్రకటించారు. ఆర్థిక మంత్రి తీసుకున్న కొన్ని నిర్ణయాలు సంబంధిత రంగాలకు చెందిన కంపెనీల షేర్లపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఒక పెన్నీ స్టాక్ ధర నిరంతరాయంగా పెరగటం అందరి దృష్టిని మార్కెట్లో ఆకర్షిస్తోంది. చాలా మంది దేశీయ ఇన్వెస్టర్లు తక్కువ సమయంలో ఎక్కువ రాబడులను కోరుకుంటూ నిరంతరాయంగా మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్స్ కోసం వెతుకుతూనే ఉంటారు. అలాంటి వారు ప్రస్తుతం బడ్జెట్లో నిర్మలమ్మ అందించిన వరంతో పెరుగుతూపోతున్న ఏకేఐ ఇండియా కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు పరిగెడుచున్నారు. దీంతో వరుసగా నాలుగు రోజులుగా దీని కారణంగా కంపెనీ షేర్లు అప్పర్ సర్కూట్ తాకుతున్నాయి.

నేడు ఇంట్రాడేలో ఏకేఐ ఇండియా కంపెనీ షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకటంతో ఒక్కో షేరు రూ.12.16 స్థాయికి చేరుకుంది. వాస్తవానికి బడ్జెట్ ముందు రోజున కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.10.5 వద్ద ఉంది. అయితే ఫిబ్రవరి 1 నుంచి కంపెనీ షేర్లు 22 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. దీనికి కారణం నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనగా తెలుస్తోంది.
నిర్మలమ్మ ప్రకటన ఇదే..
బడ్జెట్ ప్రసంగంలో నిర్మలమ్మ ఈసారి పాదరక్షలు, లెథర్ పరిశ్రమకు "ఫోకస్ ప్రొడక్ట్ స్కీమ్"ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రోత్సాహకం ద్వారా రానున్న రోజుల్లో 22 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు రూ.4 లక్షల కోట్ల వ్యాపార టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఈ రంగం నుంచి లక్ష కోట్లకు పైగా విలువ చేసే వస్తువులను ఎగుమతి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. దీంతో పాదరక్షల వ్యాపారంలో పనిచేస్తున్న అనేక భారతీయ కంపెనీలు ప్రస్తుతం ర్యాలీని చూస్తున్నాయి.
కంపెనీ షేర్లు గడచిన 6 నెలల్లో పెట్టుబడిదారుల సంపదను 47 శాతం లాభాలను అందించగా.. గడచిన ఏడాది కాలంలో 57 శాతం రాబడిని తెచ్చిపెట్టింది. అయితే 2025లో ఇప్పటి వరకు వరుసగా అప్పర్ సర్క్యూట్ తాకుతున్నప్పటికీ 4 శాతం నష్టంలో ఉండటం గమనార్హం. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.30 వద్ద ఉండగా, 52 వారాల కనిష్ఠ ధర రూ.9.17గా ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications