jio 6G: గుడ్ న్యూస్ చెప్పిన జియో.. 2030 నాటికి 6జీ నెట్ వర్క్..!

టెలికాం టెక్నాలజీలో తదుపరి దశకు జియో ప్లాట్‌ఫామ్స్ సన్నద్ధమవుతోంది. 2030 కల్లా 6జీ వాణిజ్యపరంగా ప్రారంభించేందుకు ఆ కంపెనీ సిద్ధమవుతుంది. సొంతంగా కొత్త మార్కెట్లలోకి ప్రవేశించకుండా, భాగస్వామ్యాల ద్వారా తన టెక్నాలజీని అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకువెళ్లాలని కూడా ఈ సంస్థ ఆలోచిస్తోంది. జియో ఐపీఓ మీడియా మీట్‌లో జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ దీనిపై స్పందించారు. 6జీ ప్రమాణాల అభివృద్ధికి తమ సంస్థ దోహదపడుతోందని, తమ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ భారతదేశంలోనూ, విదేశాలలోనూ అవకాశాలను కల్పిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.

6జీ టెక్నాలజీ ఇంకా ప్రామాణీకరణకు ముందు దశలోనే ఉందని, 2029 నాటికి ప్రమాణాలు ఏర్పడే అవకాశం ఉందని అంబానీ అన్నారు. 2030వ దశకం ప్రారంభంలో వాణిజ్యపరమైన విస్తరణలు మొదలవుతాయని అంచనా వేస్తున్నారు. జియో 6జీని ప్రధానంగా ఒక సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌గా చూస్తోందని, తన ఎండ్-టు-ఎండ్ టెక్నాలజీ స్టాక్‌లో పెట్టుబడులు కొనసాగిస్తుందని ఆయన వివరించారు. "మాకు, 6జీ ఒక సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ కాబోతోంది. మేము మా సమగ్రమైన ఎండ్-టు-ఎండ్ టెక్నాలజీ స్టాక్‌లో పెట్టుబడులు కొనసాగిస్తాము" అని అంబానీ పేర్కొన్నారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి, ప్రతి భారతీయుడికి సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడమే జియో విస్తృత లక్ష్యమని ఆయన వివరించారు.

Jio 6G

జియో ప్లాట్‌ఫామ్స్ కొత్త మార్కెట్లలోకి నేరుగా ప్రవేశించకుండా స్థానిక సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా తన అంతర్జాతీయ వ్యాపారాన్ని విస్తరించుకోవాలని చూస్తోంది. తాము ప్రారంభించినది ఒక ప్రత్యేకమైన ప్లాట్‌ఫామ్, కేవలం హార్డ్‌వేర్ టెక్నాలజీ లేదా సాఫ్ట్‌వేర్ లైసెన్స్ అమ్మడం కన్నా, స్థానిక సంస్థలకు మేనేజ్డ్ సర్వీస్ భాగస్వామిగా మారడమే మా వ్యాపార నమూనా అని వివరించారు. కంపెనీ ఇప్పటికే తన ఎండ్-టు-ఎండ్ టెక్నాలజీ స్టాక్‌ను సొంత నెట్‌వర్క్‌పై నిర్వహిస్తోందని, తమ తమ మార్కెట్లలో ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోగల తగిన భాగస్వాములను గుర్తించాలని కోరుకుంటున్నట్లు అంబానీ తెలిపారు.జి

తాము కొత్త మార్కెట్లలోకి వెళ్లి ప్రవేశించాల్సిన అవసరం ఉందని నమ్మడం లేదన్నారు. తమ టెక్నాలజీ, ఎండ్-టు-ఎండ్ స్టాక్ ఆ భాగస్వాములకు కొత్త మార్కెట్ అవకాశాలను కల్పిస్తుందని తాము విశ్వసిస్తున్నాని పేర్కొన్నారు. జియో ప్లాట్‌ఫామ్స్‌కు ఉన్న నాలుగు కీలక అవకాశాల రంగాలను అంబానీ వివరించారు. మొబైల్ సేవలు, హోమ్ కనెక్టివిటీ, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్, దాని ప్రధాన సాంకేతికతల ద్వారా ఆదాయాన్ని సంపాదించడం. కంపెనీ సమగ్ర సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ విలువ గొలుసు అంతటా పాలుపంచుకునే సామర్థ్యాన్ని ఇస్తుందని, తద్వారా దాని ప్రస్తుత టెలికాం వ్యాపారానికి మించి అవకాశాలను సృష్టిస్తుందని ఆయన అన్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+