Airfloa Rail Technology IPO: స్టాక్ మార్కెట్‌లో ప్రస్తుతం ఐపీఓల సందడి నెలకొంది. కొన్ని ఐపీఓలు పెట్టుబడిదారులకు నిరాశ కలిగిస్తుంటే, కొన్ని భారీ లాభాలను అందిస్తున్నాయి. ఇక మార్కెట్లో విడుదలకి ఎదురుచూస్తున్న ఐపీఓలు కూడా ఉన్నాయి.తాజాగా రేపు మార్కెట్లోకి రానున్న ఐపీఓలలో ఎయిర్‌ఫ్లోవా రైల్ టెక్నాలజీ ఐపీఓ ఒకటి.
ఈ ఎయిర్‌ఫ్లోవా ఐపీఓ SME విభాగానికి చెందినది. పెట్టుబడిదారులకు రెట్టింపు లాభాన్ని ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఐపీఓ సెప్టెంబర్ 11న ప్రారంభమై సెప్టెంబర్ 15 వరకు బిడ్ చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ IPO ద్వారా రూ. 91.10 కోట్లు సేకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ మొత్తం 65 లక్షల కొత్త షేర్లను విడుదల చేయనుంది. ఇందులో ఎలాంటి OFS (Offer for Sale) షేర్లు లేవు.

ఇష్యూ ధర బ్యాండ్ రూ. 133 నుండి రూ. 140 మధ్యగా నిర్ణయించారు. ఒక్క షేరుకు ముఖ విలువ రూ. 10 మాత్రమే. ఈ ఐపీఓ లిస్టింగ్ సెప్టెంబర్ 18న జరగనున్నట్టు భావిస్తున్నారు. ఒక్క లాట్‌లో 1,000 షేర్లు ఉంటాయి. అందువల్ల ఒక్క లాట్ విలువ సుమారు రూ. 1.40 లక్షలు ఉంటుంది. రిటైల్ పెట్టుబడిదారులు కనీసం రెండు లాట్‌లు బుక్ చేసుకోవాలి. అందుకై కనీసం రూ. 2.80 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
అత్యంత ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ IPO గ్రే మార్కెట్‌ను ప్రారంభంలోనే ముంచెత్తింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు దీని గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) రూ. 170గా నమోదైంది. అంటే, ఈ IPO రూ. 133 రూ. 140 ధర రేంజ్‌తో వస్తున్నా.. గ్రే మార్కెట్‌లో ఈ షేర్లు రూ. 310 వరకూ ట్రేడింగ్ అవుతున్నాయి. ఈ పరిస్థితిలో ఈ ఐపీఓ జాబితాలో చేరగానే రూ. 121.43 శాతం లాభాన్ని ఇవ్వగలదని అంచనా వేస్తున్నారు. ఇది పెట్టుబడిదారులకు ఆశాజనకంగా ఉంది.
ఎయిర్‌ఫ్లోవా రైల్ టెక్నాలజీ లిమిటెడ్ 1998 డిసెంబరులో స్థాపించబడింది. కంపెనీ ప్రధానంగా భారతీయ రైల్వే కోచ్‌ల తయారీకి సాంకేతిక పరిజ్ఞానం అందిస్తుంది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF), ఇతర కోచ్ ఫ్యాక్టరీలకు కోచ్‌లు, భాగాలను తయారుచేస్తోంది. ఇది రైల్వే కోచ్‌లలో ఇంటీరియర్ పనులు కూడా చేస్తుంది. వాటితో పాటు విమానాలు, రక్షణ రంగానికి అవసరమైన భాగాల తయారీలో కూడా కంపెనీ అనుభవం కలిగి ఉంది.
ఎయిర్‌ఫ్లోవా రైల్ టెక్నాలజీ లిమిటెడ్ ప్రధానంగా భారతీయ రైల్వేలు, మెట్రో ప్రాజెక్టులు మరియు ప్రత్యేక రైలు ప్రాజెక్టుల కోసం కోచ్‌ల భాగాలు తయారు చేయడం, ఇంటీరియర్ ప్రాజెక్టులను నిర్వహించడం వంటి సేవలను అందిస్తుంది. ఈ కంపెనీ ముఖ్యంగా శ్రీలంక DEMU, మెయిన్‌లైన్ కోచ్‌లు, ఆగ్రా-కాన్పూర్ మెట్రో, RRTS (Regional Rapid Transit System), విస్టాడోమ్ కోచ్‌లు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రముఖ ప్రాజెక్టులకు సేవలు అందించింది. ప్రత్యేకంగా, కంపెనీ కోచ్‌ల భాగాలను తయారు చేయడం మాత్రమే కాకుండా, పూర్తి ఇంటీరియర్ ప్రాజెక్టుల డిజైన్, తయారీ, మరియు ఇన్‌స్టాలేషన్ పనులను కూడా నిర్వహిస్తుంది.
ఈ IPO ద్వారా సేకరించిన డబ్బును ఎయిర్‌ఫ్లోవా రైల్ టెక్నాలజీ వివిధ ముఖ్యమైన ఖర్చుల కోసం వినియోగించనుంది. కంపెనీ మోటార్లు, పరికరాలు, యంత్రాంగాలను అభివృద్ధి చేసుకోవడానికి రూ. 13.68 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ యంత్రాలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు, నాణ్యతను మెరుగుపరచేందుకు ఉపయోగపడతాయి.
అదనంగా, కొన్ని అప్పులను తిరిగి చెల్లించడానికి రూ. 6 కోట్లు వినియోగించబడతాయి. కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చేందుకు రూ. 59.27 కోట్లు ప్రామాణికంగా నిల్వ చేసుకుంటుంది. ఇది రోజువారీ కార్యకలాపాలను సజావుగా నడిపేందుకు, సరఫరా గొలుసులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉపయోగపడుతుంది. మిగతా మొత్తం డబ్బును సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
ప్రస్తుతం ఈ IPOకి భారీ డిమాండ్ రావడంతో పాటుగా మంచి ప్రీమియం ఉండడంతో పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. కంపెనీ యొక్క స్థిరమైన వ్యాపార ప్రొఫైల్ కూడా ప్లస్ కానుంది. మార్కెట్ పోటీపై ఆధారపడిన వ్యూహం, ఇన్నోవేషన్ రంగంలో అధిక నిపుణత, దీర్ఘకాలిక మార్కెట్ లో వృద్ధి అవకాశాల కారణంగా పెట్టుబడిదారులను ఇది ఆకర్షస్తోంది. IPO లిస్టింగ్ తర్వాత నిష్పక్షపాతంగా మంచి మార్కెట్ పనితీరు కనబరిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

ఆర్బీఐ నిర్ణయం.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు భారీ షాకా?

Stock market: సెన్సెక్స్ పతనం.. కానీ రికవరీ మొదలైందా? నేటి మార్కెట్ టాప్ విన్నర్స్ వీరే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..



Click it and Unblock the Notifications