ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్.. భారీ ర్యాలీ తరువాత ఈ ఏఐ స్టాక్స్ కుప్పకూలాయి.. అసలేం జరిగింది..

AI Stock Market Shock: చైనాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దిగ్గజం Z.AI (జిపు - Zhipu) షేర్లు స్టాక్ మార్కెట్లో తీవ్ర పతనాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ అయిన తర్వాత కేవలం ఆరు నెలల వ్యవధిలోనే దాదాపు 2,000 శాతం మేర దూసుకెళ్లిన ఈ కంపెనీ షేర్లు.. జూన్‌లో నమోదైన గరిష్ఠ స్థాయి నుండి ఇప్పటివరకు ఏకంగా 85 శాతానికి పైగా కుప్పకూలాయి. ఇటీవల చైనా ఏఐ రంగంలో నెలకొన్న భారీ అమ్మకాల వెల్లువలో అత్యధికంగా నష్టపోయిన సంస్థలలో Z.AI ఒకటిగా నిలిచింది.

అమెరికా ప్రభుత్వం తీసుకున్న తాజా ఎగుమతి ఆంక్షల నిర్ణయం చైనా ఏఐ కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మూడవ దేశాల్లోని డేటా సెంటర్లు, క్లౌడ్ సర్వర్ల ద్వారా చైనా కంపెనీలు అధునాతన ఏఐ చిప్‌లను రిమోట్‌గా వినియోగించుకోకుండా అడ్డుకునేందుకు వాషింగ్టన్ కఠిన నిబంధనలను ప్రకటించడంతో మంగళవారం నాటి ట్రేడింగ్‌లో జిపు షేర్లు మరో 6.8 శాతం నష్టపోయాయి.

China AI stocks Zhipu AI stock crash Z AI shares fall 85 China AI stock rally 2000 AI stock market crash Chinese AI companies US Nvidia chip restrictions China AI bubble Zhipu AI IPO AI investment news AI AI Z AI 85 AI AI AI AI

ఇప్పటికే ఎన్విడియా (Nvidia) చిప్‌ల సరఫరాపై నెలకొన్న వివాదాలతో ప్రపంచ ఏఐ స్టాక్స్ ఒత్తిడిలో ఉన్న తరుణంలో ఈ ప్రకటన రావడం మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది. గత బుధవారం ముగింపు ధరతో పోలిస్తే జిపుతో పాటు దాని చిన్న ప్రత్యర్థి సంస్థ మినిమాక్స్ గ్రూప్ (MiniMax Group) రెండూ తమ మార్కెట్ విలువలో దాదాపు మూడో వంతును కోల్పోయాయి.

Also Read

ఈ ఆంక్షల వల్ల చైనా ఏఐ కంపెనీల భవిష్యత్ ప్రణాళికలపై తీవ్ర ప్రభావం పడుతుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. గ్లోబల్ ఎక్స్ మేనేజ్‌మెంట్ పెట్టుబడి వ్యూహకర్త బిల్లీ ల్యూంగ్ అభిప్రాయం ప్రకారం, అమెరికా తాజా నిషేధం వల్ల చైనా సంస్థలు విదేశీ డేటా సెంటర్ల ద్వారా ఎన్విడియా కంప్యూటింగ్ వనరులను పొందే ప్రత్యామ్నాయ మార్గం మూసుకుపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ఆయా కంపెనీల నిర్వహణ ఖర్చులు భారీగా పెరగడమే కాకుండా, కొత్త ఏఐ నమూనాల (AI Models) అభివృద్ధి వేగం కూడా మందగిస్తుందని ఆయన పేర్కొన్నారు. అమెరికా-చైనా మధ్య పెరుగుతున్న సాంకేతిక ఉద్రిక్తతలకు తోడు, దేశీయంగా ఏఐ కంపెనీల మధ్య తీవ్రమవుతున్న ధరల పోటీ కూడా ఈ రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

షేర్ల ధరలు భారీగా పడిపోతున్నప్పటికీ.. జిపు స్టాక్‌లో షార్ట్ సెల్లింగ్ కార్యకలాపాలు మాత్రం మరింత పెరుగుతుండటం గమనార్హం. ఎస్&పి గ్లోబల్ (S&P Global) డేటా ప్రకారం, కంపెనీ ఫ్రీ ఫ్లోట్ షేర్లలో షార్ట్ ఇంట్రెస్ట్ రికార్డు స్థాయిలో 9.9 శాతానికి చేరుకుంది.. అంటే రాబోయే రోజుల్లో షేరు మరింత పతనం కావచ్చని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. అయితే, ఇంతటి భారీ పతనం తర్వాత కూడా జనవరి లిస్టింగ్ ధరతో పోలిస్తే జిపు షేర్లు ఇప్పటికీ సుమారు 200 శాతం లాభంలోనే కొనసాగుతున్నాయి. దీనికి భిన్నంగా మినిమాక్స్ గ్రూప్ షేర్లు మాత్రం జనవరిలో లిస్టింగ్ అయినప్పటి నుండి ఆర్జించిన లాభాలన్నింటినీ పూర్తిగా కోల్పోయి మదుపర్లను నిరాశపరిచాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+