ప్రపంచం ఇప్పుడు ఏఐ వైపు శరవేగంగా అడుగులు వేస్తోంది. అందులో పెట్టుబడి పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నాయి.ఇప్పటికే ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలు.. డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాల కోసం భారీ స్థాయిలో పెట్టుబడులను ప్రకటించాయి.
2026 కోసం అమెజాన్ సుమారు 200 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 18 లక్షల కోట్లు) ఖర్చు చేయనుండగా.. ఆల్ఫాబెట్ పెట్టుబడులు 185 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. మెటా తన పెట్టుబడులను 115 నుంచి 135 బిలియన్ డాలర్ల మధ్య అంచనా వేస్తుండగా.. మైక్రోసాఫ్ట్ దాదాపు 120 బిలియన్ డాలర్ల క్యాపెక్స్‌ను ప్రకటించింది. ఈ నాలుగు కంపెనీల పెట్టుబడులు కలిపితే మొత్తం 650 బిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ. 58.5 లక్షల కోట్లు.

ఇది భారతదేశంలోని ఐదు అతిపెద్ద కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌కు సమానం కావడం విశేషం. ఇది AI కోసం హైపర్‌స్కేలర్లు ఎంత భారీగా ఖర్చు చేస్తున్నారో స్పష్టంగా చూపిస్తుంది. ఈ స్థాయి పెట్టుబడుల వల్ల అనేక రంగాల్లో విజేతలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పెట్టుబడి చక్రంలో కేంద్రబిందువుగా ఉన్న డేటా సెంటర్ రంగం నుంచి లాభపడే కంపెనీలు కీలక పాత్ర పోషించనున్నాయి. AI పనిభారం పెరిగే కొద్దీ కంప్యూటింగ్ వినియోగం వేగంగా పెరుగుతుంది, దాంతో డేటా సెంటర్ల అవసరం గణనీయంగా పెరగనుంది.
ఈ క్యాపెక్స్ చక్రం నుంచి లాభపడే మూడు భారతీయ డేటా సెంటర్ సంబంధిత స్టాక్స్‌పై ఇప్పుడు ప్రధానంగా దృష్టి పడుతోంది. మొదటిగా స్టెర్లైట్ టెక్నాలజీస్ (STL). వేదాంత గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ డిజిటల్ కనెక్టివిటీ మౌలిక సదుపాయాల్లో గ్లోబల్ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆప్టికల్ ఫైబర్ నుంచి కేబుల్ తయారీ వరకు "గ్లాస్ టు గిగాబిట్" అనే పూర్తిస్థాయి తయారీ సామర్థ్యం STLకు ప్రధాన బలంగా మారింది. AI డేటా సెంటర్లకు అవసరమైన అధిక బ్యాండ్‌విడ్త్, తక్కువ జాప్యం కలిగిన కనెక్టివిటీ పరిష్కారాలను అందించడం ద్వారా ఇది ఒక జనరేషన్‌లో ఒక్కసారి వచ్చే అవకాశంను అందిపుచ్చుకుంటోంది. ముఖ్యంగా ఉత్తర అమెరికా మార్కెట్ STLకు అతిపెద్ద వృద్ధి శక్తిగా మారుతోంది.
రెండవది HFCL. అమెరికాలో డేటా సెంటర్‌లు, AI వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌కు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న HFCL, టైర్-1 టెలికాం ఆపరేటర్ల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లను సాధిస్తోంది. అధిక ఫైబర్ కౌంట్ కేబుల్స్, MPO ఆధారిత ర్యాక్-టు-ర్యాక్ సొల్యూషన్లతో డేటా సెంటర్ అవసరాలకు అనుగుణంగా తన ఉత్పత్తి శ్రేణిని విస్తరిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో డేటా సెంటర్ క్యాపెక్స్ పెరుగుదలతో HFCL ఆదాయం వేగంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మూడవది బ్లాక్ బాక్స్. ఇది కేవలం కనెక్టివిటీ పరిష్కారాలకే పరిమితం కాకుండా, డేటా సెంటర్ డిజైన్, అమలు, ఆపరేషన్ మద్దతు వంటి పూర్తి స్థాయి సేవలను అందిస్తోంది. ప్రత్యేక AI బృందాల ఏర్పాటు, US మార్కెట్‌లో పెరుగుతున్న హై-విలువ ఆర్డర్లు, ప్లాట్‌ఫామ్ ఆధారిత సేవల వైపు మార్పు బ్లాక్ బాక్స్‌కు బలమైన వృద్ధి అవకాశాలను కల్పిస్తున్నాయి. 2029 నాటికి 2 బిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవాలన్న దిశగా డేటా సెంటర్ విభాగం కీలకంగా మారనుంది.
క్లుప్తంగా చెప్పాలంటే 650 బిలియన్ డాలర్ల AI క్యాపెక్స్ చక్రం గ్లోబల్ డిజిటల్ మౌలిక సదుపాయాల్లో ఒక నిర్మాణాత్మక మార్పును సూచిస్తోంది. స్టెర్లైట్, HFCL, బ్లాక్ బాక్స్ వంటి భారతీయ కంపెనీలు ఈ మార్పులో కీలక స్థానం సంపాదిస్తూ.. భిన్నమైన రిస్క్-రివార్డ్ అవకాశాలను ఇన్వెస్టర్లకు అందిస్తున్నాయి. రాబోయే AI, డేటా సెంటర్ బూమ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ స్టాక్స్‌ను వాచ్‌లిస్ట్‌లో ఉంచుకోవడం ప్రయోజనకరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications