Agarwal Toughened Glass IPO: మార్కెట్లు తిరిగి పుంజుకుంటున్న వేళ ఇన్వెస్టర్లు తమ డబ్బును మార్కెట్లలోకి కుమ్మరిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఈక్విటీలను ఎంచుకుంటుండగా మరికొందరు మాత్రం ఐపీవోలను ఉత్తమ పెట్టుబడి మార్గంగా చూస్తున్నారు. డిసెంబర్ మెుదటి వారంలో మార్కెట్లోకి వచ్చిన అన్ని ఐపీవోలు బంపర్ రాబడులను అందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు మరో ఎస్ఎమ్ఈ ఐపీవో సంచలనాలు సృష్టించింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది అగర్వాల్ టఫ్‌నెడ్ గ్లాస్ ఇండియా కంపెనీ ఐపీవో గురించే. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన ఐపీవో నేడు విజయవంతంగా ఎన్ఎస్ఈలో జాబితా అయ్యింది. ఈ క్రమంలో కంపెనీ షేర్లు వాస్తవ ఇష్యూ ధర కంటే దాదాపు 25 శాతం ప్రీమియం రేటు రూ.135 వద్ద మార్కెట్లోకి అడుగుపెట్టాయి. అయితే లిస్టింగ్ తర్వాత కంపెనీ షేర్ల కొనుగోలు కోసం ఇన్వెస్టర్లు ఎగబడటంతో స్టాక్ ధర దాదాపు రూ.140.75 స్థాయికి చేరుకుంది. దీంతో బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు తొలిరోజే భారీగా రాబడిని తెచ్చిపెట్టింది. వాస్తవానికి విశ్లేషకులు 30 శాతం వరకు ప్రీమియం లిస్టింగ్ ఊహించగా.. దానికి చేరువలోనే కంపెనీ షేర్లు జాబితా కావటంతో ఇన్వెస్టర్లు కూడా హ్యాపీగా ఉన్నారు.

కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.62.64 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఇందుకోసం ఇన్వెస్టర్లకు పూర్తిగా 58 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది. కంపెనీ తన ఐపీవోను నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2 వరకు పెట్టుబడి పెట్టేందుకు అందుబాటులో ఉంచింది. ఈ క్రమంలో తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.105 నుంచి 108గా నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 1200 షేర్లుగా ఉండటంతో రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం రూ.1,29,600 ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. అలాగే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.17.82 కోట్లను విజయవంతంగా సమీకరించింది. తాజా ఐపీవోకి ముందు కంపెనీ ప్రమోటర్లు అనితా అగర్వాల్, మహేష్ కుమార్ అగర్వాల్, ఉమా శంకర్ అగర్వాల్, శారదా అగర్వాల్ కు కంపెనీలో 95.16 శాతం వాటాలు ఉండగా అవి ప్రస్తుతం 63.94 శాతానికి డైల్యూట్ చేయబడ్డాయి.
కంపెనీ తాజా ఐపీవో నుంచి సమీకరించిన మెుత్తాన్ని ప్రస్తుతం ఉన్న తయారీ యూనిట్ కోసం కొత్త మెషినరీ కొనుగోలుతో పాటు కొంత భాగాన్ని రుణాల చెల్లింపుల కోసం వినియోగించాలని నిర్ణయించింది. ఇక కొంత భాగాన్ని పెరుగుతున్న వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, కార్పొరేట్ ఖర్చుల కోసం ఉపయోగించాలని ఉద్ధేశించింది. 2009లో స్థాపించబడిన
అక్టోబర్ 2009లో స్థాపించబడిన అగర్వాల్ టఫ్‌నెడ్ గ్లాస్ ఇండియా లిమిటెడ్ టెంపర్డ్ గ్లాస్‌లను తయారు చేస్తుంది. కంపెనీ ఉత్పత్తులు షవర్ డోర్లు, రిఫ్రిజిరేటర్ ట్రేలు, మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లు, డైవింగ్ మాస్క్‌ల కోసం బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, వివిధ రకాల ప్లేట్లు, వంటసామాను వంటి వివిధ పరిశ్రమలలో ఉపయోగించబడతాయి. అలాగే కార్యాలయ భవనాలు, హోటళ్లు, సంస్థలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, షాపింగ్ సెంటర్లు వంటి రంగాలకు అవసరమైన గ్లాస్ ఎక్విప్మెంట్ తయారు చేసి అందిస్తోంది. ఈ క్రమంలో అనేక రకాల గ్లాస్ ఉత్పత్తుల పోర్ట్‍ఫోలియోను కంపెనీ నిర్వహిస్తోంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications