Markets & Trump: దేశీయంగా స్టాక్ మార్కెట్లు చాలా కాలం తర్వాత తిరిగి బుల్ జోరును తిరిగి పొందుతోంది. కొన్ని నెలలుగా కరెక్షన్ కి గురైన మార్కెట్లు ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించటంతో ఇండియన్ మార్కెట్లకు తిరిగి క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సెన్సెక్స్-నిఫ్టీలు తిరిగి పుంజుకుంటున్నాయి. అయితే కొన్ని నిమిషాల్లో ఈ లాభాలు ఆవిరైపోయాయి.
వాస్తవానికి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రస్తుతం దూకుడు వాణిజ్య విధానాలతో ముందుకు సాగటం ఆందోళనలు కలిగిస్తున్నప్పటికీ భారతీయ బెంచ్ మార్క్ సూచీలు మాత్రం ర్యాలీని కొనసాగిస్తున్నాయి. అమెరికాను తిరిగి మ్యానుఫ్యాక్చరింగ్ దేశంగా పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొస్తానని ట్రంప్ ఈ క్రమంలో పేర్కొన్నారు. యూఎస్‌లో నిక్షిప్తమైన భారీ క్రూడ్ ఆయిల్ వనరులను వెలికి తీసి దేశ అభివృద్ధికి వినియోగించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ నిర్ణయం భవిష్యత్తులో క్రూడ్ ధరల తగ్గుదలకు దారితీయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ట్రంప్ ఎంట్రీతో ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ ఒక శాతానికిపైగా పతనాన్ని చూసింది. అలాగే 10 ఏళ్ల యూఎస్ బాండ్ ఈల్డ్స్ సడలింపు వంటి కారణాలు ఇండియాతో పాటు ఆసియా మార్కెట్లను సానుకూలంగా ముందుకు సాగటానికి దోహదపడుతున్నాయి. ట్రంప్ వాణిజ్య విధానమే దీనికి కారణమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన వికె విజయకుమార్ అభిప్రాయపడ్డారు. వినియోగదారు ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటం దీనికి సహాయపడిందని ఆయన పేర్కొన్నారు.
ఈ పరిస్థితులు ఈ ఏడాది కూడా ఫెడ్ తన వడ్డీ రేట్ల తగ్గింపును కొనసాగించవచ్చనే ఆశలను రేకెత్తిస్తోంది. అలాగే గాజాలో పరిస్థితులు అదుపులోకి రావటం మరో పెద్ద ఊరటను ప్రపంచ మార్కెట్లకు అందిస్తోంది. అయితే ఉదయం 10.40 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 690 పాయింట్లను కోల్పోగా, మరో కీలక సూచీ నిఫ్టీ 158 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 458 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 888 పాయింట్ల మేర పతనాన్ని నమోదు చేసింది.
జొమాటో స్టాక్ పతనం..
నేడు ఇంట్రాడేలో జొమాటో కంపెనీ షేర్లు దాదాపు 9 శాతం పతనాన్ని చూశాయి. కంపెనీ తన క్విక్ కామర్స్ విభాగమైన బ్లింకిట్ విస్తరణకు భారీగా నిధులను ఖర్చుచేయటంతో మూడవ త్రైమాసిక లాభాలపై ఆ ప్రభావం చూపటమే నేటి స్టాక్ పతనానికి కారణంగా తెలుస్తోంది. అయితే బ్రోకరేజ్ కంపెనీలు మాత్రం ఇప్పటికీ కంపెనీ షేర్లపై సానుకూలంగా ఉన్నాయి. లాభాలను బ్లింకిట్ తగ్గించినప్పటికీ భవిష్యత్తులో కంపెనీ పెరుగుదలకు ఇది దారితీస్తుందని తెలుస్తోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications