Multibagger Stock: లిస్ట్ అయిన 7 రోజుల్లోనే రూ.429 నుంచి రూ. 1,675 పెరిగిన స్టాక్ ఇదే..!

ఈఎస్డీఎస్(ESDS) సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ ఐపీఓ ద్వారా మార్కెట్‌లో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. మార్కెట్ దృష్టిని ఆకర్షించిన సంస్థగా నిలిచింది. AI, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న ఈ సంస్థ షేర్ల ధర IPO ధర అయిన రూ.429 నుంచి రూ. 1,675.15కి భారీగా పెరిగింది. దీనివల్ల షేర్లు పొందిన పెట్టుబడిదారులకు దాదాపు 290 శాతం మేర అద్భుతమైన రాబడి లభించింది. సెప్టెంబర్ 11 శుక్రవారం నాడు కూడా ఈ షేర్లు జోరు తగ్గలేదు. BSEలో రూ.1,565.25 వద్ద ప్రారంభమైన ఈ స్టాక్ 7.3 శాతం పెరిగి రూ.1,675.15 స్థాయిని తాకింది. అంతకుముందు రెండు సెషన్లలోనూ ఈ స్టాక్ 10 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయింది. అంతకు ముందు కూడా వరుసగా రెండు సెషన్ల పాటు 20 శాతం అప్పర్ సర్క్యూట్ వద్ద లాక్ అయ్యింది.

ఈ స్టాక్ మార్కెట్‌లో అడుగుపెట్టిన వెంటనే ఈ దూకుడు మొదలైంది. సెప్టెంబర్ 4న NSEలో ESDS సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ రూ.757 వద్ద లిస్ట్ అయ్యింది. IPO పెట్టుబడిదారులకు ₹429 ఇష్యూ ధరపై తక్షణమే 76.46 శాతం ప్రీమియంలో లిస్ట్ అయింది. BSEలో ఈ స్టాక్ రూ.746.30 వద్ద ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ ర్యాలీ కొనసాగుతూనే ఉంది. IPOలో షేర్లు పొందిన పెట్టుబడిదారులు కేవలం ఐదు ట్రేడింగ్ సెషన్లలోనే తమ పెట్టుబడి విలువ మూడు రెట్లకు పైగా పెరిగాయి. లిస్టింగ్ రోజున కూడా ESDS షేర్లు దాదాపు 112% మేర పెరిగాయి. డిజిటల్ వినియోగం పెరగడం, వ్యాపారాలు అధిక కంప్యూటింగ్ సామర్థ్యాన్ని కోరుకోవడం వల్ల, భారతదేశంలోని క్లౌడ్ కంప్యూటింగ్, డేటా-సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతోంది.

ESDS Software Solution

ఈ నేపథ్యంలో కొత్తగా లిస్ట్ అయిన ESDS సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ఒక కీలకమైన స్టాక్‌గా అవతరించింది. విశ్లేషకులు ఈ సంస్థకు ఆయా వృద్ధి రంగాలతో ఉన్న సంబంధంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. బ్రోకరేజ్ సంస్థ ఛాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ ESDS సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌కు బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ ను రూ. 1,550 నిర్ణయించింది. అయితే ఈ స్టాక్ ఇప్పటికే బ్రోకరేజ్ లక్ష్య ధరను దాటింది. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సెంటర్లు,AI మౌలిక సదుపాయాలలో భారతదేశం యొక్క దీర్ఘకాలిక విస్తరణలో పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులకు, ESDS అత్యంత ఆకర్షణీయమైన లిస్టెడ్ అవకాశాలలో ఒకటిగా ఛాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ భావిస్తోంది.

ESDS సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ IPOకు పెట్టుబడిదారుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. సెప్టెంబర్ 1 మంగళవారం నాడు బిడ్డింగ్ ముగిసే సమయానికి ఈ పబ్లిక్ ఇష్యూ 135.88 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. ఈ ఇష్యూ ఆగస్టు 28, శుక్రవారం నాడు సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమైంది. ఈ ఆఫరింగ్‌లో ఆఫర్-ఫర్-సేల్ (OFS) భాగం లేకుండా కేవలం రూ.720 కోట్ల వరకు విలువైన ఈక్విటీ షేర్ల ఫ్రెష్ ఇష్యూ మాత్రమే ఉంది. కంపెనీ ఒక్కో షేరుకు రూ.408-429 మధ్య IPO ధరల శ్రేణిని నిర్ణయించింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+