IPO News: ఈ ఐపీవోపై బెట్టింగ్ వేసినోళ్లు మునిగిపోతారు.. గ్రేమార్కెట్లో లాభాలు ఆవిరి, జాగ్రత్త ఫ్రెండ్స్..
Afcons Infrastructure IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు నవంబర్ ఐపీవో స్పీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అనేక కొత్త కంపెనీల ఐపీవోలు ఇష్యూ ప్రారంభిస్తుండగా, మరికొన్ని మాత్రం లిస్టింగ్ కోసం రావటానికి సిద్ధమౌతున్నాయి. అయితే ఇప్పుడు ఐపీవోలపై బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లకు షాక్ తగలనుంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఐపీవో గురించే. వాస్తవానికి ఇది షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు చెందిన స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ అండ్ కన్‌స్టక్షన్ కంపెనీ. ఐపీవో లిస్టింగ్ ముందు ఈ షేర్లు గ్రే మార్కెట్‌లో తగ్గింపుతో ట్రేడవుతున్నాయి. వాస్తవానికి ఐపీవో అక్టోబర్ 25 నుంచి అక్టోబర్ 29 వరకు ఇన్వెస్టర్లు బెట్టింగ్ వేసేందుకు అందుబాటులో ఉంచబడింది. మూడు రోజుల ఇష్యూ సమయంలో ఐపీవో సుమారు 2.63 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఎన్‌ఎస్‌ఈలో డేటా ప్రకారం కంపెనీ తన ఐపీవో ఇష్యూ కింద ఇన్వెస్టర్ల కోసం 8,66,19,950 షేర్లను విక్రయానికి ఉంచగా ఈ సమయంలో 22,78,13,728 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.

కంపెనీ తాజా ఐపీవో ద్వారా రూ.5,430 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఇందులో రూ.1,250 కోట్లకు తాజా ఆఫర్ ఉండగా.. మిగిలిన మెుత్తాన్ని ఆఫర్ ఫర్ సేల్ కింద సమీకరిస్తోంది. మెయిన్ కేటగిరీలో వస్తున్న ఐపీవో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ఏకకాలంలో లిస్టింగ్ కానుంది. ఈ క్రమంలో కంపెనీ తన ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.440-463గా నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 32 షేర్లుగా నిర్ణయించటంతో కనీసం ఒక్కో ఇన్వెస్టర్ బెట్టింగ్ వేయటానికి లాట్ కొనాలంటే రూ.14,816 ఇన్వెస్ట్ చేశారు. అలాగే కంపెనీ తన ఉద్యోగుల కోసం ఐపీవోలో 596,659 షేర్లను రిజర్వు చేసింది. ఇందులో ఆఫర్ రేటు కంటే షేర్లను రూ.44 చొప్పున తగ్గింపు ధరకు అందిస్తోంది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల రిజర్వ్ సెగ్మెంట్ 5.05 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల కేటగిరీ 94 శాతం, అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల విభాగం 3.79 రెట్లు సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. అలాగే కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఇప్పటికే రూ.1621 కోట్లను విజయవంతంగా సమీకరించిందని వెల్లడైంది. బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు లిస్టింగ్ గెయిన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. గ్రేమార్కెట్లో ఒక్కో షేరు రూ.3 డిస్కౌంట్ రేటు వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇది చూస్తుంటే మార్కెట్లో కంపెనీ షేర్ల లిస్టింగ్ లాభాలతో కాకుండా ఇష్యూ ధర కంటే తక్కువ రేటు అంటే నష్టాలతో జాబితాను సూచిస్తోంది. ఇదే జరిగితే ఇన్వెస్టర్ల ఆశలు నిరాశలు కానున్నాయి.


Click it and Unblock the Notifications