IPO News: రేపు ఓపెన్ అవుతున్న ఐపీవో.. ముందే వాటాలు కొన్న అదానీ.. మీరూ బెట్ వేస్తున్నారా?
Adani News: దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం ఐపీవోల కోలాహలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది ఇన్వెస్టర్లు తమ డబ్బును ఈక్విటీల కంటే ఎక్కువగా ఐపీవోల్లోకి మళ్లిస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం సరైన ఐపీవోని ఎంపిక చేసుకునే పనిలో తలమునకలవుతున్నారు. అయితే ఇప్పుడు వారికి ఒక శుభవార్త ఉంది.
వాస్తవానికి సగిలిటీ ఇండియా ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్లలో నవంబర్ 5న సబ్‌స్క్రిప్షన్ కోసం ఐపీవో ప్రారంభిస్తోంది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.2,106.60 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే కంపెనీ ఐపీవోకి ముందుగానే తొమ్మిది మంది ఇన్వెస్టర్ల నుంచ కంపెనీ దాదాపు రూ.366 కోట్లను సమీకరించినట్లు వెల్లడైంది. అయితే ఇందులో అదానీ గ్రూప్ కంపెనీ అదానీ ప్రాపర్టీస్ సైతం పార్టిసిపేట్ చేసిందని వెల్లడైంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీలో ఒక్కో షేరును రూ.30 ధరకు కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం గౌతమ్ అదానీ ఇందులో 0.14 శాతం వాటాను రూ.20 కోట్లకు దక్కించుకున్నట్లు వెల్లడైంది.

రేపటి నుంచి ప్రారంభం కానున్న ఐపీవో కోసం కంపెనీ రూ.2106.60 కోట్లను సమీకరించేందుకు సిద్ధమౌతోంది. ఇందుకోసం 70.22 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను విక్రయిస్తోంది. మెయిన్ కేటగిరీలో వస్తున్న ఐపీవో ఏకకాలంలో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్టింగ్ కానుంది. ఇందుకోసం కంపెనీ తన ప్రైస్ బ్యాండ్ ధరను రూ.28-30గా నిర్ణయించింది. కంపెనీ తన లాట్ పరిమాణాన్ని 500 షేర్లుగా ఉంచటంతో ఇన్వెస్టర్లు కనీసం 1 లాట్ కొనుగోలు చేయటానికి రూ.15,000 వెచ్చించాల్సి ఉంటుందని వెల్లడైంది. ఇదే క్రమంలో కంపెనీ తన ఉద్యోగుల కోసం ఐపీవోలో 19 లక్షల షేర్లను రిజర్వు చేసింది. అలాగే షేర్లను వారికి ఇష్యూ ధర కంటే రూ.2 డిస్కౌంట్‌కు అందించాలని నిర్ణయించింది.
సగిలిటీ ఇండియా లిమిటెడ్ గతంలో బెర్క్‌మీర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌గా పిలువబడేది. చెల్లింపుదారులకు ఆరోగ్య సంరక్షణ-కేంద్రీకృత పరిష్కారాలు, సేవలను అందిస్తుంది. అయితే కంపెనీ కస్టమర్లు పూర్తిగా అమెరికా వ్యాప్తంగా ఉన్నట్లు వెల్లడైంది. కంపెనీ చెల్లింపుదారులు ప్రొవైడర్ల ప్రధాన వ్యాపారానికి మద్దతు ఇస్తుంది. చెల్లింపుదారులకు సేవలు కేంద్రీకృత క్లెయిమ్‌ల అడ్మినిస్ట్రేషన్, క్లినికల్ సర్వీసెస్ ఫంక్షన్‌లతో సహా వారి మొత్తం కార్యాచరణ స్పెక్ట్రమ్‌ను కలిగి ఉంటాయి. వీటిలో క్లెయిమ్‌ల నిర్వహణ, చెల్లింపు సమగ్రత, క్లినికల్ మేనేజ్‌మెంట్, ఇతర సేవలు ఉన్నాయి. ప్రొవైడర్ల కోసం, కంపెనీ వారి బిల్లింగ్‌ను నిర్వహించడంలో, చెల్లింపుదారుల నుంచి చికిత్స ఖర్చులను క్లెయిమ్ చేయడంలో వారికి సహాయపడేందుకు రెవెన్యూ సైకిల్ నిర్వహణ సేవలను అందిస్తుంది.


Click it and Unblock the Notifications