భారత్-అమెరికా మధ్య ఎన్నో నెలలుగా పెండింగ్‌లో ఉన్న కీలక వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు పట్టాలెక్కింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు చరిత్రాత్మక ర్యాలీని నమోదు చేశాయి. మార్కెట్ అంతటా కొనుగోళ్ల జోరు కనిపించగా.. ఈ లాభాల ప్రవాహంలో అదానీ గ్రూప్ కంపెనీలు ప్రత్యేకంగా వెలిగాయి. ఒప్పందంతో ఏర్పడిన పాజిటివ్ సెంటిమెంట్ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడంతో, అదానీ గ్రూప్ స్టాక్స్‌లో భారీ ర్యాలీ నమోదైంది.
గ్రూప్‌కు ప్రధానమైన అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో సుమారు 13 శాతం లాభపడింది. ఇది నవంబర్ 2024 తర్వాత ఈ స్టాక్‌కు నమోదైన అతిపెద్ద సింగిల్-డే జంప్‌గా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే బాటలో అదానీ పోర్ట్స్ షేర్ 8 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 12.7 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 10 శాతం, అదానీ పవర్ 7.8 శాతం వరకు ఎగబాకాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, పోర్ట్స్ రంగాలకు వాణిజ్య ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాలపై ఉన్న అంచనాలే ఈ ర్యాలీకి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

మొత్తం మార్కెట్‌లోనూ అసాధారణమైన ఉత్సాహం కనిపించింది. ట్రేడింగ్ సమయంలో నిఫ్టీ దాదాపు 5 శాతం పెరిగి 26,341 పాయింట్ల వరకు చేరింది. అదే సమయంలో సెన్సెక్స్ కూడా సుమారు 5.15 శాతం లేదా 4,200 పాయింట్లకు పైగా లాభపడింది. ఫిబ్రవరి 2021 తర్వాత సూచీలకు ఇదే అతిపెద్ద ఇంట్రాడే లాభంగా నమోదైంది. అయితే, ఉదయం 10:40 గంటల ప్రాంతానికి లాభాల స్వీకరణ కారణంగా నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ కొంత వెనక్కి తగ్గి సుమారు 2.8 శాతం లాభాల వద్ద ట్రేడింగ్ కొనసాగించాయి.
ఈ ర్యాలీకి మూల కారణమైన భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం విషయానికి వస్తే.. దీర్ఘకాల చర్చల అనంతరం రెండు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న 25 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంతేకాకుండా రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై విధించిన అదనపు 25 శాతం పన్నును కూడా తొలగించనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదిక Xలో స్వాగతిస్తూ.. అధ్యక్షుడు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
గత ఐదు నెలల క్రితం పరిస్థితిని చూస్తే.. రష్యా నుంచి చమురు దిగుమతుల అంశాన్ని కారణంగా చూపుతూ అమెరికా.. అనేక భారతీయ ఎగుమతి ఉత్పత్తులపై 50 శాతం వరకు సుంకాలు విధించింది. దీని ప్రభావం మార్కెట్లపై తీవ్రంగా పడింది. తాజా ఒప్పందంతో ఆ ఒత్తిడికి తెరపడినట్లయింది.
ఇదే సమయంలో అదానీ గ్రూప్‌కు సంబంధించిన మరో కీలక అంశం కూడా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. మీడియా కథనాల ప్రకారం అదానీ గ్రూప్‌కు చెందిన మూడు కంపెనీలు జపాన్ నుంచి సుమారు 2 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించే యోచనలో ఉన్నాయి. అదానీ పోర్ట్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో.. సంస్థ తన మూలధన అవసరాల కోసం వివిధ నిధుల సేకరణ అవకాశాలను పరిశీలిస్తుందని.. ఇది సాధారణ వ్యాపార ప్రక్రియలో భాగమేనని పేర్కొంది.
ఇదిలా ఉండగా, జపాన్‌కు చెందిన ప్రముఖ రేటింగ్ సంస్థ జపాన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (JCR), Adani గ్రూప్‌లోని అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ కంపెనీలకు విదేశీ కరెన్సీలో దీర్ఘకాలిక క్రెడిట్ రేటింగ్‌లను కేటాయించింది. ఇది గ్రూప్‌కు అంతర్జాతీయంగా మరింత విశ్వసనీయతను పెంచే అంశంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా గత నెలలో అదానీ గ్రూప్ షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. గౌతమ్ అదానీతో పాటు గ్రూప్‌కు చెందిన ఒక అధికారి మోసం, లంచం ఆరోపణలపై విచారణకు హాజరుకావాలని US నియంత్రణ సంస్థ SEC అనుమతి కోరినట్లు వార్తలు రావడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. అయితే తాజా వాణిజ్య ఒప్పందం, మార్కెట్ ర్యాలీ, అంతర్జాతీయ రేటింగ్‌ల వంటి పరిణామాలు ఆ ప్రతికూలతలను తాత్కాలికంగా పక్కన పెట్టి.. అదానీ గ్రూప్ షేర్లకు కొత్త ఊపునిచ్చినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications