IPO News: ప్రైస్ బ్యాండ్ ప్రకటించిన సోలార్ ఐపీవో.. ఇన్వెస్టర్స్ బెట్టింగ్‌కి డబ్బు రెడీ చేసుకోండి..
Acme Solar Holdings IPO: ఇటీవలి కాలంలో మార్కెట్లోకి వస్తున్న కొన్ని ఐపీవోలు మాత్రం పెట్టుబడిదారులకు భారీగా లాభాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. గతవారం మార్కెట్లోకి వచ్చిన సోలార్ ఐపీవో ఊహించని రాబడులను అందించిన తర్వాత ప్రస్తుతం ఇన్వెస్టర్లు ఈ రంగంలో వస్తున్న మరో కంపెనీ ఐపీవోపై భారీగా బెట్టింగ్ వేసేందుకు సిద్ధమౌతున్నారు. వారీ ఎనర్జీస్ గతవారం ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై దాదాపు 90 శాతం లాభాలను తొలిరోజునే అందించిన తర్వాత ప్రస్తుతం ఐపీవో వస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఆక్మే సోలార్ హోల్డింగ్స్ ఐపీవో గురించే. తాజాగా కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను ప్రకటించటంతో చాలా మంది ఇన్వెస్టర్లు డబ్బును సిద్ధం చేసుకుంటున్నారు. కంపెనీ ఒక్కో షేరుకు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.275-289గా నిర్ణయించింది. రానున్న వారం ఇన్వెస్టర్ల కోసం ఐపీవో సబ్‌స్క్రిప్షన్ తెరచుకోనుంది. రిటైల్ పెట్టుబడిదారులకు ఐపీవో నవంబర్ 6 నుంచి నవంబర్ 8 వరకు బెట్టింగ్ వేసేందుకు అందుబాటులో ఉండనుంది. ఇదే క్రమంలో కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఐపీవోను ఒకరోజు ముందుగానే తెరవనుంది. ఈ క్రమంలో కంపెనీ లాట్ పరిమాణాన్ని 51 షేర్లుగా నిర్ణయించింది. అలాగే ఐపీవో మార్కెట్లో నవంబర్ 13న జాబితా కానుందని తెలుస్తోంది.

కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.2,900 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇందులో ఆఫర్ ఫర్ సేల్ కింద రూ.505 కోట్లు కూడా ఉన్నట్లు వెల్లడైంది. న్యూ ఇష్యూ కోసం కంపెనీ 8.29 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను విక్రయిస్తోంది. కంపెనీ ఐపీవో నుంచి సమీకరించిన మెుత్తాన్ని రుణ చెల్లింపులతో పాటు సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించాలని చూస్తోంది.
జూన్ 2015లో ఉనికిలోకి వచ్చిన ఆక్మే సోలార్ హోల్డింగ్స్ దేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో విద్యుత్ ఉత్పత్తిదారు. కంపెనీ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ రెండింటి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే భారతదేశపు ప్రముఖ ఉత్పత్తిదారుల్లో ఒకటి. సంస్థకు ఆదాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా మద్దతిచ్చే యుటిలిటీలతో సహా అనేక మంది వినియోగదారులకు శక్తిని విక్రయించడం ద్వారా వస్తుంది. కంపెనీ పెద్ద ఎత్తున పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధి, నిర్మాణం, యాజమాన్యం, నిర్వహణ మరియు నిర్వహణలో ప్రత్యేకత కలిగి ఉంది. సంస్థ తన అంతర్గత ఇంజనీరింగ్, సేకరణ మరియు నిర్మాణ (EPC) విభాగం, కార్యకలాపాలు నిర్వహణ (O&M) ద్వారా దీనిని సాధిస్తుంది.


Click it and Unblock the Notifications