NSE IPO: గ్రే మార్కెట్‎లో దూసుకెళ్తోన్న ఎన్ఎస్ఈ షేర్లు.. 11 శాతం ప్రీమియంలో ట్రేడవుతున్న షేర్లు..!

ప్రపంచంలోనే ఈక్విటీ డెరివేటివ్ వాల్యూమ్‌ల పరంగా అతిపెద్దదైన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) సెప్టెంబర్ 17న ఓపెన్ కానుంది. ఈ ఐపీఓ సెప్టెంబర్ 21న ముగుస్తుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.1,700-1,785గా నిర్ణయించారు. ఈ ధరల శ్రేణిలోని గరిష్ట స్థాయిలో ఎన్‌ఎస్‌ఈ రూ.22,561.5 కోట్లను సమీకరించనుంది. ఈ బుక్-బిల్ట్ ఇష్యూ పూర్తిగా 10 మంది ప్రస్తుత వాటాదారుల ద్వారా 126.4 మిలియన్ల ఈక్విటీ షేర్ల వరకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూపంలో ఉంటుంది. ఇందులో కొత్త ఇష్యూ ఏదీ లేదు, అంటే ఈ ఐపీఓ నుంచి ఎన్‌ఎస్‌ఈకి ఎలాంటి నిధులు రావు.

జూన్ 2026లో దాఖలు చేసిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)లో ప్రతిపాదించిన 148.9 మిలియన్ షేర్ల నుంచి ఇష్యూ పరిమాణాన్ని 15% తగ్గించారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సెప్టెంబర్ 4న DRHPని ఆమోదించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన వాటాలో కొంత భాగాన్ని ఐపీఓ ద్వారా విక్రయిస్తోంది. కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ (CPPIB) 11.8 మిలియన్ షేర్లను, అరండా ఇన్వెస్ట్‌మెంట్స్ (మారిషస్) 11.2 మిలియన్లు, MS స్ట్రాటజిక్ (మారిషస్) 11 మిలియన్లు, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ 10.5 మిలియన్ షేర్లను విక్రయించనున్నాయి.

NSE

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) పబ్లిక్ ఇష్యూపై బ్రోకరేజీలు సానుకూలంగా ఉన్నాయి. రూ. 1,785 ఎగువ ధర శ్రేణి వద్ద, ఈ ఎక్స్ఛేంజ్ విలువ FY2026 ఆదాయాలకు 42.9 రెట్లుగా ఉంది. ఆసియాలోనే అత్యంత పురాతన ఎక్స్ఛేంజ్ అయిన, లిస్టెడ్ ఎక్స్ఛేంజ్ లోని BSE ప్రస్తుత 49.3 రెట్ల వాల్యుయేషన్ కంటే తక్కువ. ఎన్ఎస్ఈ FY26లో కార్యకలాపాల ద్వారా రూ. 16,601 కోట్ల ఆదాయాన్ని, రూ. 10,302 కోట్ల నికర లాభాన్ని (PAT) నివేదించింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈ షేర్లు షేర్లు గ్రే మార్కెట్ లో ప్రీమియంలో ట్రేడవుతున్నాయి. గ్రే మార్కెట్ లో 11.65 శాతం ప్రీమియంలో కొనసాగుతోంది. గ్రే మార్కెట్ లో రూ.208 ప్రీమియంలో కొనసాగుతోంది.

ఐపీఓ గరిష్ట ప్రైస్ రూ.1785 గా ఉంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఎన్ఎస్ఈ షేర్లు స్టాక్ మార్కెట్ లో రూ.1993 వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఐపీఓకు పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన వచ్చే అవకాశం ఉంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+