Hyderabad Jobs: ఇటీవలి కాలంలో చూస్తుంటే హైదరాబాదుకు కంపెనీలు క్యూ కడుతూ ఐటీ ఉద్యోగాల ఆఫర్లను పెంచుతున్నాయి. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లేటరల్ జాబ్ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న చాలా మందికి ప్రస్తుతం కొత్త హై పెయిడ్ జాబ్ ఓపెనింగ్స్ పడుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలో టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న విప్రో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే ప్రాంతాల్లో పనిచేయటానికి అనుకూలంగా ఉన్న ఉద్యోగుల కోసం ఒక జాబ్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ Vision Plus Developer కోసం 10 ఖాళీలు ఉన్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ జాబ్ హైబ్రిడ్ వర్క్ విధానాన్ని ఉద్యోగులకు ఆఫర్ చేస్తోంది. కంపెనీ ఈ జాబ్ రోల్ కోసం అభ్యర్థుల అర్హతలు, అనుభవం వంటి విషయాల ఆధారంగా రూ.15-30 లక్షలు వార్షిక వేతనాన్ని ఐటీ దిగ్గజం ఆఫర్ చేయటానికి సిద్ధంగా ఉంది.

విజన్ ప్లస్ డెవలపర్ కోసం సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోసం వెతుకుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనికింద CICS/VSAM/JCL వాతావరణంలో COBOL ప్రోగ్రామ్‌లను డిజైనింగ్, కోడింగ్, పరీక్షించండి, డీబగ్గింగ్, రికార్డ్ చేయటం అవసరమని కంపెనీ పేర్కొంది. డిజైన్ అండ్ అవసరాలను అర్థం చేసుకుంటూ కస్టమ్ అప్లికేషన్ ఫీచర్స్, ఫంక్షన్‌లను అభివృద్ధి చేయటంతో పాటు వాటిని రన్ చేయాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ క్రమంలో కనీసం 5-10 సంవత్సరాల మధ్య క్లాంప్లెక్స్ బ్యాంకి, క్రెడిట్ కార్డ్ ప్రాసెసింగ్ అంశాల్లో పనిచేసిన అనుభవం అవసరమని వెల్లడించింది. అలాగే విజన్ ప్లస్ ఉత్పత్తిపై ఖచ్చితమైన అవగాహన అవసరమని స్పష్టం చేసింది.
ఇదే క్రమంలో చిన్న మధ్యతరహా ప్రాజెక్టులకు అంచనాలను తయారు చేయటం అవసరమని కంపెనీ పేర్కొంది. అలాగే ఆన్ లైన్ ఆర్కిస్ట్రక్చర్, ట్రబుల్ షూటింగ్ వంటి అంశాలపై బలమైన అవగాహన అవసరమని ఐటీ దిగ్గజం వెల్లడించింది. ఇదే క్రమంలో ఉద్యోగం కోసం అప్లై చేసుకునే వ్యక్తులకు డెవప్స్, అజైల్ డిసిప్లైన్ వంటి అంశాలపై కూడా మంచి అనుభవం తప్పనిసరిగా వెల్లడించింది. టీమ్ తో పనిచేసేందుకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరిగా పేర్కొంది. ఇక విద్యార్హతల విషయానికి వస్తే బీటెక్, బీఎస్ లలో ఏదైనా స్పెసిఫికేషన్ పర్వాలేదని వెల్లడించింది.
విప్రో టర్బో హైరింగ్ ప్రోగ్రామ్..
టాప్-5 ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న విప్రో ప్రస్తుతం కొత్తగా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. దీనికింద దేశంలోని టాప్ కాలేజీల్లోని టాలెంట్ బీటెక్ విద్యార్థుల కోసం దీనిని తీసుకొచ్చింది. దీనికింద ఎంపికైన బీటెక్ విద్యార్థులు ప్రపంచ స్థాయి ప్రాజెక్టుల్లో పనిచేయటానికి సులువుగా అవకాశం పొందుతారని కంపెనీ వెల్లడించింది. టర్బో హైరింగ్ ప్రోగ్రామ్ 2025 కింద ఐటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు మాత్రమే ప్రత్యేక వెసులుబాటు కల్పించబడుతోంది.
విప్రో జాబ్ ఓపెనింగ్ కి సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications