Lay Off's": ఊడిపోతున్న సాఫ్ట్ వేరు జాబ్స్.. ఉద్యోగుల తొలగింపులో 2వ స్థానంలో నిలిచిన భారత్..!

ఏఐ విప్లవం సాఫ్ట్ ఉద్యోగుల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఏ క్షణం కంపెనీ మెయిల్ వస్తోందో.. ఏ క్షణం లే ఆఫ్స్ వార్త వస్తుందోనని భయపడి పోతున్నారు. రూ.లక్షల్లో జీతాలు తీసుకునే వారు.. సడన్ గా జాబ్ నుంచి తీసేస్తే ఈఎంఐ ఎలా చెల్లించాలో అని ఆందోళన చెందుతున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు ఏఐపై భారీ పెట్టుబడి పెడుతూ మానవ వనరులను తగ్గించుకుంటున్నాయి. దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, మెటా, ఒరకిల్ తో పాటు చాలా ఎంఎన్సీ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. అయితే ప్రపంచంలో అత్యధికంగా ఉద్యోగుల తొలగిస్తున్న దేశాల్లో భారత్ 2వ స్థానంలో నిలిచింది.

Layoffs.fyi అనే లైవ్ ఆన్‌లైన్ ట్రాకర్ ప్రకారం 2026 సంవత్సరం జూలై 1 నాటికే జరిగిన ఉద్యోగాల కోత, గత 2025 పూర్తి ఏడాదిలో జరిగిన మొత్తం లేఆఫ్స్‌ను దాటేసింది. ఏఐ వాడడాన్ని పెంచడం కారణంగా తొలగింపులు కొనసాగుతోన్నాయి. కంపెనీలు రోబోటిక్ స్పీడ్‌తో పనులు చేయించుకుంటూ ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. కోడింగ్, ప్రోగ్రామింగ్ చేసిన చేతులకు ఏఐ టూల్స్ బాయ్ చెబుతున్నాయి. అమెరికాలో అత్యధికంగా లే ఆఫ్స్ జరుగుతున్నాయి. ప్రతి నాలుగు లే ఆఫ్స్ లో మూడు కంపెనీలు యూఎస్ చెందినవిగా ఉంటున్నాయి. భారతదేశం 7.16 శాతం లే ఆఫ్స్ తో 2వ స్థానంలో నిలిచింది. అయితే ఏఐ విప్లవం కేవలం ఐటీ రంగంలోనే కాదు.. ఎడ్యుకేషన్ రంగంలో కూడా ప్రవేశిస్తోంది. మొత్తం లే ఆఫ్స్ లో విద్య రంగం వాటా 20 శాతానికి పైగా ఉంది.

Lay Off

లెర్నింగ్ యాప్స్, ఆన్‌లైన్ ట్యూటరింగ్ లను ఏఐ బాట్లు వేగంగా రీప్లేస్ చేస్తుండటమే దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు. తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా మరో దఫా లే ఆఫ్స్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం మైక్రోసాఫ్ట్ తన వర్క్ ఫోర్స్ సుమారు 2.5 శాతం మందిని తొలగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం ప్రారంభంలో ఉద్యోగుల తొలగింపు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ లో దాదాపు 2,20,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 5,500 మంది ఉద్యోగులు.. తమ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

అయితే మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను తొలగించడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఉద్యోగుల్ని తొలగించింది. గత ఏడాది మే, జూలై నెలల మధ్య దాదాపు 15,000 ఉద్యోగుల్ని తొలగించింది. ఇది అప్పుడున్న వర్క్ ఫోర్స్ లో 4 శాతానికి సమానం. కాగా ఈ ఏడాది మొదట్లో దాదాపు 8,750 మంది అర్హులైన ఉద్యోగులను స్వచ్ఛంద నిష్క్రమించే అవకాశం కల్పించింది. ఉద్యోగాల తొలగింపుపై మైక్రోసాఫ్ట్ ను సంప్రదించగా.. స్పందించడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ విడతలో సేల్స్, కన్సల్టింగ్, ఎక్స్‌బాక్స్ గేమింగ్ విభాగంతో సహా పలు విభాగాలలోని ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. లే ఆఫ్ ఫై ప్రకారం 2026లో ఇప్పటివరకు టెక్ కంపెనీలు మొత్తం 1,22,524 మంది ఉద్యోగులను తొలగించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+