Lay Off's: గూగుల్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు అంటూ ప్రచారం.. స్పందించిన కంపెనీ..!
ప్రపంచంలో ఏఐ హవా కొనసాగుతోంది. చాలా కంపెనీలు ఏఐ పెట్టుబడి పెడుతున్నాయి. మరో పక్క ఉద్యోగుల తొలగింపులను కొనసాగిస్తున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగులు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనగా ఉన్నారు. తాజాగా గూగుల్ కూడా లే ఆఫ్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఉద్యోగులను తొలగించినట్లు ప్రచారం జరిగింది. దీనిపై గూగుల్ స్పందించింది. భారతదేశంలోని తన క్లౌడ్ విభాగంలో భారీ ఎత్తున ఉద్యోగ కోతలు ఉన్నాయన్న సోషల్ మీడియా వదంతులను గూగుల్ కొట్టివేసింది. ఒక చిన్న సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా గత వారం కేవలం 30 పోస్టులను మాత్రమే తొలగించినట్లు కంపెనీ స్పష్టం చేసింది.
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో భారీ ఉద్యోగ కోతల వార్తలు ప్రచారం కావడం, ఉద్యోగులు, టెక్నాలజీ నిపుణులలో ఊహాగానాలు, ఆందోళన రేకెత్తించడంతో ఈ స్పష్టత వచ్చింది. భారతదేశంలోని గూగుల్ క్లౌడ్ బృందాలలో దాదాపు సగం మంది ప్రభావితులయ్యారని, ఉద్యోగులకు రాజీనామా చేయడానికి లేదా తొలగింపును ఎదుర్కోవడానికి 24 గంటల గడువు ఇచ్చారని కొన్ని పోస్టులు ఆరోపించాయి. ఈ వదంతులు 'బ్లైండ్' అనే అనామక ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో ప్రారంభమైనట్లు సమాచారం. బెంగళూరుకు చెందిన గూగుల్ ఉద్యోగినని చెప్పుకుంటున్న ఒక వినియోగదారుడు, భారీ ఉద్యోగ కోతలు, రాజీనామా అల్టిమేటమ్‌ల గురించి అక్కడ వాదనలు పంచుకున్నారు.

భారీ ఉద్యోగ కోతల వార్తల నేపథ్యంలో గూగుల్ ఇండియాలో ఏం జరుగుతోందని ప్రశ్నిస్తూ, ఎక్స్ యూజర్ వెంకటేష్ అల్లా కూడా ఒక పోస్ట్‌లో ఈ విషయాన్ని లేవనెత్తారు. ఈ ఊహాగానాలకు స్పందిస్తూ, గూగుల్ క్లౌడ్ ఇండియా అధికారిక ఖాతా ఆ వాదనలు అవాస్తవమని స్పష్టం చేసింది. "ఈ వదంతులు పూర్తిగా అవాస్తవం. గత వారం, గూగుల్ క్లౌడ్ భారతదేశంలో ఒక చిన్న సంస్థాగత మార్పు చేసింది. పని ప్రాధాన్యతలను పునఃసమీక్షించడంలో భాగంగా దాదాపు 30 ఉద్యోగాలను తొలగించింది" అని గూగుల్ క్లౌడ్ ఇండియా పేర్కొంది. మరో దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 60,000 మంది ఉద్యోగులకు, భారతదేశంలోని అర్హతగల సిబ్బందితో సహా, స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీలను అందించినట్లు సమాచారం. ఈ సంఖ్య దాని మొత్తం ఉద్యోగులలో దాదాపు నాలుగో వంతుకు సమానం.
మరో పక్క గూగుల్, మైక్రోసాఫ్ట్, డేటాబ్రిక్స్ వంటి కంపెనీలు వచ్చే ఏడాదికి తమ క్యాంపస్ నియామకాల ప్రణాళికలను నిలిపివేస్తున్నాయని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ కంపెనీల నుంచి ఎటువంటి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, వారు ఇప్పటికే కొంతమంది సిబ్బందిని రహస్యంగా తొలగిస్తున్నారని కొన్ని యూజర్ అకౌంట్లు కూడా సూచిస్తున్నాయి. గూగుల్, డేటాబ్రిక్స్, మైక్రోసాఫ్ట్ వచ్చే ఏడాది నియామకాలు చేపట్టేందుకు ప్రణాళిక వేయడం లేదని టెక్ ప్రొఫెషనల్ రాయ్ Xలో పోస్ట్ చేసిన తర్వాత, నియామకాలను నిలిపివేసే అవకాశంపై చర్చ ప్రారంభమైంది. "
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications