Infosys Jobs: ఇటీవలి కాలంలో టెక్ జాబ్ ఓపెనింగ్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల టెక్కీలకు అనేక ఓపెనింగ్స్ వరుసగా స్వాగతం పలుకుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోని టాప్ ఐటీ కంపెనీలు ప్రధానంగా రిక్రూట్మెంట్లను కొనసాగించటం మనం చూస్తూనే ఉన్నాం.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీ జాబ్ ఓపెనింగ్ గురించే. కంపెనీ SAP Security Consultant పాత్ర కోసం నియామకాలను కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో కంపెనీ హైదరాబాద్, పూణే, బెంగళూరు కోసం రిక్రూట్మెంట్ కొనసాగిస్తోంది. అయితే కంపెనీ అవసరాల మేరకు పైన పేర్కొన్న ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. కంపెనీ ఈ పాత్ర కోసం 999 ఓపెనింగ్స్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. దీనికింద కనీసం 3 ఏళ్లు సపోర్ట్స్, మెయింటెనెన్స్, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లలో అనుభవం కలిగి ఉండాలని కంపెనీ పేర్కొంది. అలాగే ఉద్యోగార్థులు కలిగి ఉండాల్సిన ప్రైమరీ స్కీల్స్ SAP SECURITY, SAP GRC అని కంపెనీ పేర్కొంది. ప్రాసెస్ కంట్రోల్, ఆటోమేషన్స్ లో అనుభవం కలిగి ఉండటం యాడెడ్ అడ్వాంటేజ్ అని కంపెనీ వెల్లడించింది.

ఇన్ఫోసిస్ కన్సల్టింగ్ టీమ్‌లో భాగంగా ఎఫోర్ట్ ఎస్టిమేషన్, డయాగ్నసిస్, సొల్యూషన్ జెనరేషన్, డిజైన్ అండ్ డెవలప్మెంట్ వంటి కీలక అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. లిటరసీ సర్వేలు, పబ్లిక్ డొమెయిన్లో అందుబాటులో ఉన్న సమాచారం, విక్రేత మూల్యాంకన సమాచారం మొదలైనవాటిని కలిగి ఉన్న పరిశోధన ఆధారంగా సిఫార్సు చేయబడిన పరిష్కారాలకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తారు. అలాగే మీరు వ్యాపార అవసరాల నుంచి అవసరమైన స్పెసిఫికేషన్‌లను సృష్టిస్తారు. అవసరాల ఆధారంగా చేయబోయే ప్రక్రియలు, వివరణాత్మక ఫంక్షనల్ డిజైన్‌లను నిర్వచిస్తారు.
ఇక విద్యార్హతల విషయానికి వస్తే ఇంజనీరంగ్ బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలని కంపెనీ వెల్లడించింది. అయితే కంపెనీ ఇక్కడ ఉద్యోగులకు ఆఫర్ చేస్తున్న శాలరీ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయలేదు. అయితే ఒకటే ప్యాకేజీ ఉంటుందా లేక ఉద్యోగి గత అనుభవం, శాలరీ వంటి వివరాలను పరిగణలోకి తీసుకుంటారా అనే విషయాన్ని కంపెనీ ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు. అయితే రోల్ కేటగిరీ ఐటీ సెక్యూరిటీ కిందకు వస్తుందని కంపెనీ పేర్కొంది.
జాబ్ ఓపెనింగ్ కి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Layoffs: ఒరాకిల్ లేఆఫ్స్: ఒక్క రోజే 30 వేల మంది ఇంటికి! అసలు కారణం ఇదే!

Hyderabad: హైదరాబాద్‌లో ఇళ్ల ధరల విస్ఫోటనం..! చిన్నగా మారుతున్న అపార్ట్మెంట్లు!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క ఏరియాలోనే ఇల్లు కావాలంటున్న కొనుగోలుదారులు..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications