TCS Jobs: హైదరాబాదులో టీసీఎస్ అనలిస్ట్ జాబ్ ఓపెనింగ్.. వాకిన్ ఇంటర్వ్యూ డోన్ట్ మిస్..
TCS Hyderabad Jobs: వరుసగా హైదరాబాదులో టెక్కీలకు శుభవార్తలు వస్తూనే ఉన్నాయి. కంపెనీలు తమ వ్యాపార అవసరాలకు అనుగుణంగా కొత్త ఉద్యోగులను నిరంతరం రిక్రూట్ చేసుకోవటం కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే మెున్న విప్రో నేడు టీసీఎస్ తమ ఓపెనింగ్స్ లింక్డిన్‌లో పోస్ట్ చేశాయి.
దేశంలోని టాప్ ఐటీ కంపెనీగా కొనసాగుతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ తాజాగా క్వాలిటీ ఎష్యూరెన్స్ అనలిస్ట్ పోస్టు కోసం ఓపెనింగ్ ప్రకటించింది. దీని కింద కంపెనీ ప్రస్తుతం హైదరాబాదులో పనిచేసేందుకు టెక్కీలను నియమించుకుంటోంది. కంపెనీ లింక్డిన్ పోస్ట్ ప్రకారం హైదరాబాదు ఆఫీసులో వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీనికోసం కనీసం 7 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ అనుభవం కలిగిన టెక్కీలు అర్హులుగా పేర్కొంది. అలాగే సెలీనియం స్కిల్ అవసరమని పేర్కొంది.

సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్‌లో 4 ఏళ్లు అనుభవం తప్పనిసరిగా వెల్లడించింది. ఇదే క్రమంలో 3 ఏళ్ల కంటే ఎక్కువ ఎస్కూఎల్ , ఆర్‌డీబీఎమ్ఎస్ పై పనిచేసిన అనుభవం కావాలని వెల్లడించింది. అలాగే మూడేళ్ల కంటే ఎక్కువ అనుభవం టెస్ట్ ఆటోమేషన్ వ్యూహాలు, ఆటోమేటెడ్ టెస్టింగ్ మెథడాలజీలు, విధానాలు, టూల్స్, పద్ధతులు, ఆటోమేటెడ్ టెస్ట్ సూట్‌లను అమలు చేయడం, డీబగ్గింగ్ టెస్టింగ్ నిర్వహించటంపై అవగాహన తప్పనిసరిగా కంపెనీ వెల్లడించింది. Java, SQL, JMeter, GIT, Docker, Jenkins, Kubernetes, Splunk, Grafana టూల్స్ వినియోగం తెలిసి ఉండాలని కంపెనీ స్పష్టం చేసింది.
SQL క్వరి రాయటం అనుభవం తప్పనిసరిగా టీసీఎస్ వెల్లడించింది. భవిష్యత్తులో వచ్చే లోపాలను తగ్గించడం, నివారించడం అనే లక్ష్యంతో ఉత్పత్తి నాణ్యతను గుర్తించడానికి డేటాను విశ్లేషించాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. STLC, SDLC పై పూర్తిస్థాయి పరిజ్ఞానం తప్పనిసరిగా కంపెనీ వెల్లడించింది. స్క్రమ్ బృందంలో భాగంగా యూజర్ స్టోరీస్ రూపొందించడంలో, యూజర్ స్టోరీలకు అంగీకార ప్రమాణాలను అభివృద్ధి చేయడంలో సహకరించాలని కంపెనీ వెల్లడించింది. దీనికి సంబంధింత బృందాలతో కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఐటీ పరిశ్రమలో లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉన్న కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా క్లయింట్లను కలిగి ఉంది.
ఈ జాబ్ రోల్ కి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications