Juniper Green Energy IPO: జునిపర్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఐపీఓ.. గ్రే మార్కెట్ ఎలా ఉందంటే..!

జునిపర్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) 2026 జూలై 30న ఓపెన్ అయింది. ఆగస్టు 3 వరకు కొనసాగుతోంది. కంపెనీ యాజమాన్యం జునిపర్ గ్రీన్ ఎనర్జీ షేర్లను ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.214 నుంచి రూ.225 గా నిర్ణయించింది. కొత్త షేర్ల జారీ ద్వారా రూ.1,800 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. జునిపర్ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ పరిమాణం రూ.1,800 కోట్లుగా ఉంది. కాగా, సెకండరీ మార్కెట్‌లోని సానుకూల ధోరణుల మధ్య గ్రే మార్కెట్‌లో కంపెనీ షేర్లకు డిమాండ్ పెరిగింది. ఈ ఇష్యూ ద్వారా సమకూరే నిధులన్నీ పూర్తిగా కంపెనీ బ్యాలెన్స్ షీట్‌కే కేటాయించనున్నారు. మార్కెట్ పరిశీలకుల ప్రకారం గ్రే మార్కెట్‌లో కంపెనీ షేర్లు రూ.17 ప్రీమియంతో ట్రేడవుతున్నాయి.

బిడ్డింగ్ రెండో రోజు సాయంత్రం 4:00 గంటల సమయానికి, ఈ బుక్-బిల్డింగ్ ఇష్యూ 0.46 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది. ఇందులో రిటైల్ విభాగం 0.21 రెట్లు, ఎన్ఐఐ విభాగం 0.08 రెట్లు, క్యూఐబీ విభాగం 1.19 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యాయి. ఆర్థిక పరంగా చూస్తే జునిపర్ గ్రీన్ ఎనర్జీ FY26లో కార్యకలాపాల ద్వారా రూ.718.9 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిందని వెంచురా సెక్యూరిటీస్ పేర్కొంది. ఇతర ఆదాయం రూ.86.03 కోట్లతో కలిపి మొత్తం ఆదాయం రూ.804.93 కోట్లుగా ఉందని వివరించింది.

ipo

FY26లో కంపెనీ ఎబిట్డా రూ.455.32 కోట్లు, పీబీటీ రూ.55.19 కోట్లు ఉండగా PAT రూ.40.5 కోట్లుగా నమోదు చేసిందని పేర్కొంది. కంపెనీ సమీకృత పునరుత్పాదక ఇంధన వేదిక, సౌర, పవన, హైబ్రిడ్ ప్రాజెక్టులపై పని చేస్తుంది. అధిక రుణభారం, ఆర్థిక వ్యయాలు, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడంపై కంపెనీ పరిస్థితి ఆధారపడి ఉంటుందని బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది. ఐపీఓలో సమీకరించిన నిధుల్లో దాదాపు 78 శాతం నిధులు మాతృ సంస్థ, కీలక అనుబంధ సంస్థల రుణభారాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తున్నారని బ్రోకరేజ్ సంస్థ అభిప్రాయపడింది.

బిడ్డర్లు ఈ పబ్లిక్ ఇష్యూ కోసం 'లాట్ల' రూపంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో లాట్‌లో కంపెనీకి చెందిన 66 షేర్లు ఉంటాయి. షేర్ల కేటాయింపు ప్రక్రియ ఆగస్ట్ 4న పూర్తి కానుంది. ఈ 'బుక్ బిల్డ్' ఇష్యూకి అధికారిక రిజిస్ట్రార్‌గా కేఫిన్ టెక్నాలిజీస్ లిమిటెడ్ నియమించారు. జునిపర్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ షేర్లు ఆగస్ట్ 6న స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+