బ్యాంకింగ్ రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే అభ్యర్థులకు సువర్ణావకాశం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (Specialist Cadre Officer) పోస్టుల కోసం కొత్త నియామక ప్రకటనను విడుదల చేసింది. ఈ నియామకం డిప్యూటీ మేనేజర్ (ఎకనామిస్ట్)పదవుల కోసం. ముఖ్యంగా, ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష అవసరం లేదు. నేరుగా షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది.
జీతం, ఇతర ప్రయోజనాలు: ఈ పోస్టులకు మూల వేతనం రూ. 64,820 నుంచి రూ. 93,960 వరకు ఉంటుంది. అదనంగా డియర్‌నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఇతర ప్రయోజనాలు కూడా అందిస్తారు. మొత్తం నెల జీతం రూ.90,000 వరకు ఉండే అవకాశం ఉంది.
అర్హతలు, అనుభవం: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 60% మార్కులతో ఎకనామిక్స్ / ఎకనామెట్రిక్స్ / మ్యాథమెటికల్ ఎకనామిక్స్ / ఫైనాన్షియల్ ఎకనామిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ లేదా సమానమైన అర్హత (PhD సహా) ఉండాలి. అదనంగా, సంబంధిత రంగంలో కనీసం 1 సంవత్సరం అనుభవం తప్పనిసరి.

వయోపరిమితి: ఆగస్టు 1, 2025 నాటికి అభ్యర్థి వయస్సు 30 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: ఈ నియామకానికి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థుల అర్హతలు, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేసి, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉంటాయి, వాటి ఆధారంగా మెరిట్ జాబితా సిద్ధం చేసి తుది ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభ తేదీ: అక్టోబర్ 8, 2025
చివరి తేదీ:అక్టోబర్ 28, 2025
అధికారిక వెబ్‌సైట్: [sbi.bank.in](https://www.sbi.bank.in)
ముఖ్యమైన వివరాలు
నియామక సంస్థ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
పదవి పేరు: డిప్యూటీ మేనేజర్ (ఎకనామిస్ట్)
ఖాళీలు: 03
గ్రేడ్: MMGS-II
పోస్టింగ్ స్థలం: ముంబై లేదా దేశవ్యాప్తంగా ఎక్కడైనా
దరఖాస్తు ఎలా చేయాలి :
1. SBI అధికారిక వెబ్‌సైట్ [sbi.bank.in](https://www.sbi.bank.in) సందర్శించండి.
2. Careers విభాగంలోకి వెళ్లి "Recruitment of Specialist Cadre Officers on Regular Basis" లింక్‌పై క్లిక్ చేయండి.
3. "Apply Online" ఎంపికను ఎంచుకోండి.
4. కొత్త అభ్యర్థులు "Click for New Registration" పై క్లిక్ చేసి, పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి వివరాలు నమోదు చేయాలి.
5. ఇప్పటికే రిజిస్టర్ అయి ఉంటే, లాగిన్ చేసి అప్లికేషన్ ఫారమ్ పూరించండి.
6. అవసరమైన డాక్యుమెంట్లు సరైన సైజులో అప్‌లోడ్ చేయండి.
7. అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫైనల్ సబ్మిట్ చేయండి.
8. ఫారమ్ యొక్క ప్రింట్ కాపీని భవిష్యత్తు సూచన కోసం ఉంచుకోండి.
అప్లికేషన్ ఫీజు:
General / EWS / OBC: రూ. 750
SC / ST / PwBD: ఫీజు లేదు
రుసుము చెల్లించని దరఖాస్తులు అంగీకరించబడవు. SBIలో ఈ నియామకం ప్రతిష్టాత్మకమైనది. పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అవ్వడం వలన ఇది తాజా గ్రాడ్యుయేట్లకు, అనుభవజ్ఞులైన అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications