రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన అధికారిక వెబ్‌సైట్ rbi.org.inలో 2025 ఆర్థిక సంవత్సరానికి గ్రేడ్ B ఆఫీసర్ పోస్టుల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 120 ఖాళీల కోసం ఈ నియామక ప్రక్రియ విడుదలైంది. RBI గ్రేడ్ B నోటిఫికేషన్ 2025 ప్రధానంగా మూడు స్ట్రీమ్‌లలో విడుదల చేయడం జరిగింది. జనరల్, DEPR (Department of Economic and Policy Research), DSIM (Department of Statistics and Information Management), జనరల్ స్ట్రీమ్‌కు 83 ఖాళీలు, DEPRకి 17 ఖాళీలు, DSIMకి 20 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
గడువు తేదీలు: ఈ ఏడాది ప్రత్యేకంగా నోటిఫికేషన్ PDFను RBI అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. అందులో అర్హత ప్రమాణాలు, పరీక్ష విధానం, సిలబస్, దరఖాస్తు విధానం వంటి పూర్తి వివరాలు పొందుపరచబడ్డాయి. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 10, 2025 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం ప్రారంభించవచ్చు. దరఖాస్తుల చివరి తేదీ సెప్టెంబర్ 30, 2025 సాయంత్రం 6 గంటల వరకు ఉండగా, ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా యూజర్ ఫ్రెండ్లీ పోర్టల్‌ను RBI అందించింది. అభ్యర్థులు దరఖాస్తు ఫారం పూరించడమే కాకుండా, అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేసి, రుసుము చెల్లించి దరఖాస్తును పూర్తిచేయవచ్చు.

అర్హత ప్రమాణాలు: జనరల్ స్ట్రీమ్‌లో అభ్యర్థులు గ్రాడ్యుయేట్‌లో కనీసం 60 శాతం మార్కులు పొందాలి, లేక పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 55శాతం మార్కులు ఉండాలి. DEPR స్ట్రీమ్‌కు ఎకనామిక్స్ లేదా ఫైనాన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ అవసరం కాగా.. DSIM స్ట్రీమ్‌లో స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటికల్ ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. వయస్సు పరిమితి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలని నోటిఫికేషన్ స్పష్టంగా పేర్కొంది. MPhil, PhD లేదా రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సు సడలింపులు ఉన్నాయి.
మూడు దశల్లో పరీక్షలు : RBI గ్రేడ్ B రిక్రూట్‌మెంట్ 2025 కోసం పరీక్ష మూడు దశల్లో నిర్వహించనున్నారు. దశ I ప్రిలిమ్స్ 2025 అక్టోబర్ 18, 19, తేదీలలో జరగనున్నాయి. దశ II మెయిన్స్ 2025 డిసెంబర్ 6, 7, తేదీలలో జరగనుంది.. రెండు దశల ఫలితాలు విడుదలైన తర్వాత ఇంటర్వ్యూ దశలో అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుంది.
RBI గ్రేడ్ B 2025 కోసం దరఖాస్తు ఫారమ్ ఎలా నింపాలి? భారత కేంద్ర బ్యాంక్‌లో గ్రేడ్ B ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తు చేయడం చాలా సులభం. ఆసక్తిగల అభ్యర్థులు RBI అధికారిక వెబ్‌సైట్ rbi.org.in ను సందర్శించాలి. మొదట, ప్రధాన పేజీపై RBI గ్రేడ్ B నోటిఫికేషన్ 2025 పై క్లిక్ చేసి, అందులోని అన్ని వివరాలను పూర్తిగా చదవాలి. నోటిఫికేషన్‌లో అర్హత ప్రమాణాలు, ఖాళీలు, పరీక్షా షెడ్యూల్ మరియు దరఖాస్తు విధానం వివరంగా పొందుపరచబడ్డాయి. తర్వాత, ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి. ఈ దశలో అభ్యర్థులు ముందుగా కొత్త యూజర్‌గా రిజిస్టర్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ సమయంలో మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హత వివరాలు సరిగ్గా నమోదు చేయాలి.
రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, అందిన యూజర్ ID, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి ఆన్‌లైన్ ఫారమ్ నింపడం ప్రారంభించవచ్చు. దరఖాస్తు ఫారమ్‌లో వ్యక్తిగత, విద్యా, వృత్తి సంబంధిత వివరాలను పూర్తి చేసి, అన్ని ఆధార పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఫారమ్ పూర్తి అయిన తర్వాత, RBI సూచించిన రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. రుసుము చెల్లింపు పూర్తయిన తర్వాత దరఖాస్తు ఫారం సబ్మిట్ అవుతుంది. చివరగా, అభ్యర్థులు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకుని భవిష్యత్తులో అవసరానికి ఉంచుకోవాలి.
More From GoodReturns

కంపెనీల్లో పెరుగుతున్న ఘోస్ట్ జాబ్స్ సంస్కృతి.. అర్థం కాక తలలు పట్టుకుంటున్న నిరుద్యోగులు..

మెటా లేఆప్స్..700 మంది ఉద్యోగులు రోడ్డు మీదకు.. 15 వేల మందిని సాగనంపడమే టార్గెట్..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications