పదో తరగతి అర్హతతో రైల్వేలో 22 వేల ఉద్యోగాలు..నెలకు రూ. 18 వేల జీతం.. అప్లై చివరి తేది ఇదిగో..

Railway Jobs 2025: నిరుద్యోగులకు భారత రైల్వే శుభవార్తను తెలిపింది. దేశవ్యాప్తంగా లెవల్-1 పోస్టుల భర్తీ కోసం సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ (CEN) నం. 09/2025ను విడుదల చేసింది. త్వరలో విడుదలయ్యే పూర్తి నోటిఫికేషన్‌కు అవసరమైన అర్హతలు, సర్టిఫికెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని అభ్యర్థులకు సూచించింది.

రైల్వే శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. రైల్వేల్లో 7వ వేతన సంఘం పే మ్యాట్రిక్స్ ప్రకారం లెవల్-1 కేటగిరీలో వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ప్రారంభ వేతనం నెలకు రూ.18 వేలుగా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల పరిధిలో కలిపి సుమారు 22 వేల ఖాళీలు భర్తీ చేసే అవకాశం ఉందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 10వ తరగతి లేదా తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Indian Railways recruitment 2025 RRB Level 1 notification 2025 RRB CEN 09 2025 Railway jobs 2025 RRB Level 1 vacancies Indian Railway jobs Group D recruitment 2025 Railway Level 1 posts RRB apply online railway government jobs RRB Level 1 salary railway jobs eligibility railway exam 2025 railway vacancies 2025 Indian Railways hiring 2025 1 2025 2025 09 2025 1 2025 2025 1 RRB Group D Recruitment 2026 Notification for 22 000 Posts

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహిస్తారు. దరఖాస్తులు స్వీకరించడం 2026 జనవరి 21 నుండి ప్రారంభమవుతాయి. చివరి తేదీ 2026 ఫిబ్రవరి 20 రాత్రి 11:59 గంటల వరకు ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది. అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత RRB అధికారిక వెబ్‌సైట్ లేదా www.rrbapply.gov.in ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. ఆఫ్‌లైన్ లేదా ఇతర మార్గాల్లో పంపిన దరఖాస్తులు స్వీకరించబడవని స్పష్టం చేసింది.

వయోపరిమితి విషయానికి వస్తే.. 2026 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు, గరిష్ఠంగా 33 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి. విద్యార్హతలు, వైద్య ప్రమాణాలు, పోస్టు వారీ వివరాలు పూర్తి స్థాయి నోటిఫికేషన్‌లో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

ఈ నోటిఫికేషన్‌లో ఆధార్ ధృవీకరణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమ ఆధార్ వివరాలను తప్పనిసరిగా సరిచూసుకోవాలని సూచించారు. ఆధార్‌లో ఉన్న పేరు, జనన తేదీ 10వ తరగతి సర్టిఫికెట్‌లో ఉన్న వివరాలకు పూర్తిగా సరిపోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా, ఆధార్‌లో తాజా ఫోటోతో పాటు ఫింగర్‌ప్రింట్, ఐరిస్ వంటి బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేసి ఉండాలి. ఇది లేకపోతే దరఖాస్తు ప్రక్రియలో ఆలస్యం లేదా తిరస్కరణ జరిగే అవకాశముందని రైల్వే శాఖ హెచ్చరించింది.

ఈ ప్రకటన కేవలం ముందస్తు సమాచారం కోసం మాత్రమేనని.. నియామకానికి సంబంధించిన అసలు షరతులు, ఎంపిక విధానం, పరీక్ష విధానం, సిలబస్ వంటి అన్ని వివరాలు త్వరలో విడుదలయ్యే పూర్తి CEN నోటిఫికేషన్‌లో మాత్రమే అమల్లో ఉంటాయని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్పష్టం చేసింది. అలాగే దళారులు, బ్రోకర్లు, ఉద్యోగ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థులను హెచ్చరించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+