బ్యాంక్‌లో అడుగుపెట్టగానే ఉద్యోగులకు షాక్... 2500 మందిని ఇంటికి సాగనంపిన Morgan Stanley.. కారణమిదే..
ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ ఉద్యోగులకు షాకిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ కొనసాగుతున్న వేళ్ల ఈ దిగ్గజం కూడా ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే టాప్ టెక్ దిగ్గజాలు వేలాది మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపగా మోర్గాన్ స్టాన్లీ కూడా అదే బాటలో పయనించింది. ఈ బ్యాకింగ్ దిగ్గజం కంపెనఅ అన్ని విభాగాలలో దాదాపు 2,500 మంది ఉద్యోగులను తొలగించింది.ఇది కంపెనీ మొత్తం శ్రామిక శక్తిలో సుమారు 3 శాతంకి సమానం అని చెప్పుకోవచ్చు.
డిసెంబర్ 31, 2025 నాటికి మోర్గాన్ స్టాన్లీలో ప్రపంచవ్యాప్తంగా 82,992 మంది ఉద్యోగులు ఉన్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం తాజా ఉద్యోగ కోతలు ప్రధానంగా మూడు విభాగాల్లో జరిగాయని తెలుస్తోంది. అవేంటంటే..ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ & ట్రేడింగ్, సంపద నిర్వహణ, పెట్టుబడి నిర్వహణ విభాగాల్లో ఉద్యోగ తొలగింపులు జరిగాయి.అయితే కంపెనీ ఆర్థిక సలహాదారులు ఈ కోతలతో ప్రభావితం కావడం లేదు. తొలగింపులు వ్యక్తిగత పనితీరు, వ్యూహాత్మక ప్రాధాన్యతల ఆధారంగా నిర్ణయించబడ్డాయి. మోర్గాన్ స్టాన్లీ మరోవైపు ఇతర విభాగాల్లో శ్రామిక శక్తిని పెంచే ప్రణాళికలను అమలు చేస్తోంది. ఈ ఉద్యోగ కోతలను వాల్ స్ట్రీట్ జర్నల్ మొదటగా వెల్లడించింది.

2025లో Morgan Stanley రికార్డు స్థాయిలో 70.6 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయం సాధించింది. అయితే, ఉద్యోగాల కోతలు ప్రధానంగా కార్యక్రమాల క్రమబద్ధీకరణ, కృత్రిమ మేధస్సు (AI) సాధనాల అవలంబన కారణంగా వచ్చాయి. అమెరికా కంపెనీలు ఇటీవల AI ఉపయోగం పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపార కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడానికి ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి.
ఇక జాక్ డోర్సే స్వంత కంపెనీ బ్లాక్ లో 4,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఫిబ్రవరి చివరలో ప్రకటించారు. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల సగం కంటే ఎక్కువ. డోర్సే ప్రకారం, బ్లాక్ క్రమంగా చిన్న చిన్న తొలగింపుల స్థానంలో ఒక పెద్ద కోతను ఎంచుకుంది. ఇది AI ఆధారిత ప్రణాళికకి అనుగుణంగా ఉంది. AI సాధనాలు, డేటా విశ్లేషణ,ఆటోమేషన్ పరిజ్ఞానం అనేక కంపెనీలను సౌకర్యవంతంగా, వ్యయ సమర్థవంతంగా ఉద్యోగాలను తగ్గించే దిశలో ప్రేరేపిస్తున్నాయి.
మొత్తంగా చూసుకున్నట్లయితే మోర్గాన్ స్టాన్లీ ఉద్యోగ కోతలు వ్యూహాత్మకంగా, పనితీరు, AI ఆధారిత ఆటోమేషన్ మార్గాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయాలుగా చెబుతున్నారు. ఇది ఆర్థిక రంగం, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, గ్లోబల్ ఫైనాన్స్ పరిశ్రమలో పెద్ద ప్రభావం చూపుతోంది. AI ప్రభావం ఉద్యోగ నియామక మార్పులు, కార్పొరేట్ వ్యయ నియంత్రణ వంటి అంశాలు ఈ దాదాపు 2,500 ఉద్యోగుల కోతలకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.
ఇక మోర్గాన్ స్టాన్లీ ప్రతిభావంతులైన ఉద్యోగులను సమర్ధవంతంగా తిరిగి ఏర్పాటు చేయడం, AI ఆధారిత ప్రణాళికలను అనుసరించడం ద్వారా కంపెనీ వ్యూహాత్మక లక్ష్యాలను సాధిస్తోంది. AI, ఆటోమేషన్ ఆధారిత వ్యూహాలు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద కంపెనీల ఉద్యోగ విధానాలను మారుస్తాయని మార్కెట్, పెట్టుబడిదారులు గమనిస్తున్నారు.


Click it and Unblock the Notifications