కరోనా మహమ్మారి తర్వాత జాబ్ మార్కెట్ పూర్తిగా ధ్వంసమయింది. కంపెనీలు కాస్ట్ కటింగ్ వ్యూహాలకు లక్షలాది మంది ఉద్యోగులు బలయ్యారు. దాదాపు నాలుగేళ్ల నుంచి జాబ్ మార్కెట్ కుప్పకూలి..ఇంకా శిధిలావస్థలోనే ఉంది. మహమ్మారి ముగిసినా ఉద్యోగాలు తీసివేత పర్వం మాత్రం ఆగడం లేదు. గత ఏడాది లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డు మీద పడ్డారు. మహమ్మారికి తోడు కొత్తగా ఏఐ ఉద్యోగుల పాలిట శాపంలా మారింది. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని స్థితిలో ఉద్యోగులు తమ ఉద్యోగాలను చేస్తున్నారు.
అయితే తాజాగా ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం లింక్డ్ఇన్ ఉద్యోగ మార్కెట్ కి సంబంధించి ఓ నివేదికను విడుదల చేసింది. జాబ్స్ ఆన్ ది రైజ్ 2026 పేరుతో వచ్చిన ఈ నివేదిక.. బెంగళూరు ఉద్యోగ మార్కెట్‌లో వేగంగా మారుతున్న మార్పులను స్పష్టంగా చూపిస్తోంది. ఈ నివేదిక ప్రకారం AI ఇంజనీర్ బెంగళూరులో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉద్యోగంగా నిలిచింది. ఇది టెక్నాలజీ, ఉత్పత్తి ఆవిష్కరణలు, గ్లోబల్ డిజిటల్ సేవలలో బెంగళూరు కొనసాగిస్తున్న నాయకత్వానికి నిదర్శనంగా మారింది.

లింక్డ్ఇన్ తాజా పరిశోధనలో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. 2026 నాటికి 72 శాతం మంది నిపుణులు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఈ సంఖ్య ఎంత పెద్దదైనా, అందులో మూడవ వంతుకు పైగా నిపుణులు తమకు తగిన సిద్ధత లేదని భావిస్తున్నారు. వేగంగా మారుతున్న సాంకేతికతలకు సరిపోయే నైపుణ్యాలు లేకపోవడం (38%), పెరుగుతున్న పోటీ (37%) ప్రధాన సవాళ్లుగా వారు పేర్కొన్నారు.
AI ఇంజనీర్ మొదటి స్థానంలో నిలవడమే కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ వంటి ఉన్నత స్థాయి పాత్రలు కూడా టాప్ లిస్ట్‌లో ఉన్నాయి. అంతేకాకుండా, విద్యా రంగానికి చెందిన ప్రొఫెసర్, కార్పొరేట్ రంగంలో కీలకమైన గ్లోబల్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్ డైరెక్టర్, బిజినెస్ డెవలప్‌మెంట్ జనరల్ మేనేజర్ వంటి పాత్రలు కూడా వేగంగా ఎదుగుతున్న ఉద్యోగాలుగా గుర్తించింది. ఇది బెంగళూరు ఉద్యోగ మార్కెట్ కేవలం టెక్‌కే పరిమితం కాకుండా, మేనేజ్‌మెంట్, విద్య, సేల్స్ వంటి రంగాల్లోనూ విస్తరిస్తోందని సూచిస్తోంది.
ఈ నివేదికపై లింక్డ్ఇన్ కెరీర్ నిపుణురాలు, లింక్డ్ఇన్ ఇండియా న్యూస్ సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నీరజిత బెనర్జీ మాట్లాడుతూ.. Bengaluru లో అనుకూలత (adaptability) కలిగిన నిపుణులకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుందని చెప్పారు. వివిధ రంగాల్లో ఉద్యోగ పాత్రలు వేగంగా మారుతున్న నేపథ్యంలో, యజమానులు ఒకే నైపుణ్యానికి పరిమితం కాకుండా AI పరిజ్ఞానాన్ని తమ ప్రధాన నైపుణ్యాలతో కలిపి పనిచేయగల నిపుణులను కోరుకుంటున్నారని ఆమె వివరించారు. సాంకేతికతతో పాటు డిజైన్, కన్సల్టింగ్ వంటి రంగాల్లోనూ నియామకాలు పెరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
లింక్డ్ఇన్ నివేదిక ప్రకారం.. భారతదేశంలోని 94శాతం మంది నిపుణులు తమ ఉద్యోగ శోధనలో AIని ఉపయోగించడానికి సౌకర్యంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, దాదాపు 48 శాతం మంది నియామక ప్రక్రియలో AI వాడకం పెరిగినప్పుడు తమను తాము ఎలా ప్రత్యేకంగా చూపించాలో తెలియదని చెప్పారు. వారిలో 54 శాతం మంది AI రిక్రూటర్ దృష్టిని ఆకర్షించడంలో ఒక అవరోధంగా మారవచ్చని భావిస్తున్నారు. అయినప్పటికీ 65 శాతం మంది AI అభ్యర్థులు, రిక్రూటర్ల మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుపరుస్తుందని నమ్ముతున్నారు.
ఈ నేపథ్యంలో, లింక్డ్ఇన్ AI ఆధారిత ఉద్యోగ శోధన ఫీచర్‌ను అందిస్తోంది. దీని ద్వారా అభ్యర్థులు తమ మాటల్లోనే ఉద్యోగాల కోసం శోధించవచ్చు, అలాగే వారు ముందుగా ఊహించని కొత్త పాత్రలను కూడా కనుగొనవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ సహా పలు భాషల్లో అందుబాటులో ఉంది. రోజుకు 1.3 మిలియన్లకు పైగా వినియోగదారులు దీన్ని ఉపయోగిస్తున్నారని లింక్డ్ఇన్ వెల్లడించింది. ఏది ఏమైనా బెంగళూరు ఉద్యోగ మార్కెట్ 2026 నాటికి AI కేంద్రంగా మరింత బలపడుతోందని చెప్పవచ్చు.
More From GoodReturns

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..

ఒకప్పుడు మ్యాగీ తింటూ గడిపాడు! నేడు నెలకు రూ. 3.5 లక్షల సంపాదిస్తున్నాడు!

Bengaluru: బెంగళూరులో రూ. 500తో రోజంతా గడపడం సాధ్యమేనా? ఈ యువతి ఏం చేసిందో చూడండి!

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Bengaluru: రోడ్లు చూస్తే గుంతలు.. బడ్జెట్ చూస్తే వేల కోట్లు! అసలు డబ్బు అంతా ఎటు వెళ్తోంది?

Bengaluru: ఇన్వెస్టర్లకు పండగే: బెంగళూరులోని ఈ ప్రాంతాల్లో ఆస్తుల విలువ భారీగా జంప్!

Bengaluru: బిజినెస్ చేయాలని ఉన్నా ధైర్యం సరిపోవట్లేదా? మీరు కూడా ఈ ట్రాప్‌లో ఉన్నారేమో చూసుకోండి!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: బెంగళూరు వాసులకు అలర్ట్! మధ్యాహ్నం బయటకు రావొద్దు.. క్లినిక్‌లకు క్యూ కడుతున్న బాధితులు!

రెండేళ్లు కష్టపడితే జీతం రూ.9 పెంచిన కంపెనీ.. నిబంధనల సంకెళ్లలో బందీనయ్యానంటూ భోరుమన్న టెకీ..



Click it and Unblock the Notifications