IT News: హైదరాబాదీలకు ఇన్ఫోసిస్ ఆఫర్.. రూ.17 లక్షల శాలరీ ప్యాకేజ్, మహిళలకు ప్రాధాన్యం..
Infosys Jobs: దేశంలోని టాప్ ఐటీ కంపెనీలతో పాటు, అంతర్జాతీయ కంపెనీలు సైతం కొంత కాలంలో హైదరాబాదుపై తమ ఫోకస్ కొనసాగిస్తున్నాయి. బెంగళూరు తర్వాత ప్రతిభావంతులైన టెక్కీలు దొరుకుతున్నందున కంపెనీలు ఈ నగరంపై ప్రస్తుతం ఫోకస్ కొనసాగిస్తున్నాయి.
ఈ క్రమంలో హైదరాబాదీలకు మరో మెగా జాబ్ ఆఫర్ ప్రకటించింది ఇన్ఫోసిస్. అవును సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ రోల్ కోసం రిక్రూట్మెంట్ ప్రకటించింది. ఈ జాబ్ కోసం ఒక వేకెన్సీ ఉందని కంపెనీ వెల్లడించింది. ఎంపికైన వ్యక్తులు హైదరాబాద్, పూణే లేదా బెంగళూరుల్లో పనిచేయాల్సి రావచ్చని కంపెనీ ప్రకటించింది. దీనికోసం 7-12 సంవత్సరాలు అనుభవం కలిగిన వ్యక్తులను అర్హులుగా టెక్ దిగ్గజం ప్రకటించింది. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే మహిళల కోసం కంపెనీ ప్రాధాన్యంగా ప్రకటించటం.

కంపెనీ సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ స్థానానికి వార్షిక ప్యాకేజీని రూ.9 నుంచి రూ.17 లక్షల వరకు ఆఫర్ చేస్తోంది. కంపెనీ జాబ్ రోల్ గురించి ఇలా చెప్పింది.. మా ఎంటర్‌ప్రైజ్-వైడ్ కమాండ్ సెంటర్ కార్యకలాపాల రూపకల్పన, అమలు, ఆప్టిమైజేషన్‌ను లీడ్ చేయాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఆదర్శ అభ్యర్థి మౌలిక సదుపాయాలు, అప్లికేషన్ కార్యకలాపాల మధ్య అంతరాన్ని తగ్గిస్తారు, గరిష్ట సిస్టమ్ విశ్వసనీయత, పనితీరును నిర్ధారించే బలమైన పర్యవేక్షణ, సంఘటన నిర్వహణ ఫ్రేమ్‌వర్క్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది.
ఇదే క్రమంలో క్వాలిఫికేషన్ల గురించి వెలల్డిస్తూ కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలని వెల్లడించింది. కనీసం 5 ఏళ్ల కంటే ఎక్కువ కాలానికి సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ గా పనిచేసిన అనుభవం తప్పనిసరిగా పేర్కొంది. మానిటరింగ్ టూల్స్ పై పట్టు అవసరమనిపేర్కొంది. అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలపై తాజా అప్డేట్స్ కలిగి ఉండాలని వెల్లడించింది. నెట్‌వర్కింగ్, సిస్టమ్ డిజైన్, పంపిణీ వ్యవస్థలపై బలమైన అవగాహన తప్పనిసరిగా వెల్లడించింది.
ఉద్యోగానికి అవసరమైన అర్హతలు:
- ఎంటర్‌ప్రైజ్-స్కేల్ కమాండ్ సెంటర్‌లను రూపొందించడం మరియు అమలు చేయడంలో అనుభవం
- ఐటీ కార్యకలాపాల కోసం AIOps, మెషిన్ లెర్నింగ్ పరిజ్ఞానం
- సంబంధిత క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లు లేదా టెక్నాలజీలలో సర్టిఫికేషన్ కలిగి ఉండటం మంచిది
- ఖోస్ ఇంజనీరింగ్, రిలయబిలిటీ టెస్టింగ్ అనుభవం
- ఏదైనా ఐటీ సేవల్లో ఐటిఐఎల్ పద్ధతులను అమలు చేయడంలో నేపథ్యం
ఉద్యోగానికి సంబంధించిన అప్లికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications