భారతదేశంలో ఉద్యోగాల నియామక ప్రక్రియ (Hiring) ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరుగుతోంది. గతంలో లాగా కంపెనీలు గుడ్డిగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసుకోవడం లేదు. ఇప్పుడు కంపెనీలు ఆలోచించే తీరు మారింది. ప్రస్తుతం హైరింగ్ ట్రెండ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
గ్లోబల్ జాబ్ ప్లాట్‌ఫారమ్ 'ఇండీడ్' (Indeed) విడుదల చేసిన తాజా 'హైరింగ్ ట్రాకర్' నివేదిక ప్రకారం.. దాదాపు 40 శాతం కంపెనీలు ఇప్పుడు ఫుల్-టైమ్ ఉద్యోగుల కంటే కాంట్రాక్ట్ , ఫ్రీలాన్స్ పద్ధతిలోనే నియామకాలు చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. వ్యాపార అవసరాలకు అనుగుణంగా సిబ్బంది సంఖ్యను మార్చుకునేందుకు ఈ ఫ్లెక్సిబిలిటీ ఉపయోగపడుతుందని కంపెనీలు భావిస్తున్నాయి.

కాంట్రాక్ట్ రోల్స్ ఎందుకు పెరుగుతున్నాయి?
చాలా కంపెనీలు దీర్ఘకాలిక ఖర్చులను తగ్గించుకోవడానికి, తక్షణ అవసరాలను తీర్చుకోవడానికి కాంట్రాక్ట్ పద్ధతిని ఎంచుకుంటున్నాయి. ఏదైనా ఒక నిర్దిష్ట ప్రాజెక్ట్ కోసం నిపుణులు అవసరమైనప్పుడు, వారిని తాత్కాలికంగా తీసుకోవడం వల్ల సంస్థలపై ఆర్థిక భారం తగ్గుతుంది. పాండమిక్ తర్వాత వచ్చిన 'హైరింగ్ సర్జ్' ఇప్పుడు తగ్గిపోయిందని, కంపెనీలు ఇప్పుడు దూకుడుగా కాకుండా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
నైపుణ్యానికే పెద్దపీట
ప్రస్తుతం మార్కెట్ లో నియామకాల సంఖ్య స్థిరంగా ఉన్నప్పటికీ.. అభ్యర్థుల ఎంపికలో ప్రమాణాలు (Evaluation standards) పెరిగాయి. కేవలం డిగ్రీలు ఉంటే సరిపోదని, ప్రాక్టికల్ నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యం (Problem-solving), కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఇండీడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శశి కుమార్ తెలిపారు. ముఖ్యంగా సేల్స్, బిజినెస్ డెవలప్‌మెంట్, ఇంజనీరింగ్ , సప్లై చైన్ విభాగాల్లో డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది.
చిన్న పట్టణాల వైపు కంపెనీల చూపు
మరో ఆసక్తికరమైన మార్పు ఏమిటంటే.. కంపెనీలు ఇప్పుడు మెట్రో నగరాలకే పరిమితం కాకుండా టైర్-2 , టైర్-3 నగరాల్లో ఉన్న టాలెంట్‌ను కూడా గుర్తించడమే. సుమారు 28 శాతం యజమానులు చిన్న పట్టణాల్లో తమ నియామకాలను విస్తరిస్తున్నారు. అక్కడ ఆఫీస్ నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం , కొత్త టాలెంట్ అందుబాటులో ఉండటం దీనికి ప్రధాన కారణం.
నిరుద్యోగుల ముందున్న సవాళ్లు
సర్వే ప్రకారం.. 77 శాతం మంది ఉద్యోగులు కొత్త అవకాశాల కోసం వెతుకుతున్నప్పటికీ, వారిలో కేవలం మూడో వంతు మంది మాత్రమే త్వరగా ఉద్యోగం పొందుతామని నమ్ముతున్నారు. అభ్యర్థుల నైపుణ్యాలకు, కంపెనీల అవసరాలకు మధ్య ఉన్న అంతరం (Skills mismatch) దీనికి ప్రధాన అడ్డంకిగా మారింది. అందుకే ఇప్పుడు కంపెనీలు ప్రాక్టికల్ టెస్టులు, ప్రాజెక్ట్ అసైన్‌మెంట్ల ద్వారా అభ్యర్థులను వడపోస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఇదే విధమైన 'ఫ్లెక్సిబుల్ హైరింగ్ (Flexible Hiring)' విధానం కొనసాగే అవకాశం ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications